Skip to main content

నితిన్ ఏంటి ఆ సినిమా చేయను అంటున్నాడు?

Is Nithin Work in that movie?
Is Nithin Work in that movie?

దశాబ్దన్నర నుండి సినిమాలు చేస్తున్నా కానీ నితిన్ కెరీర్ టాప్ గేర్ లోకి వెళ్లకపోవడానికి తరుచూ వచ్చే ప్లాప్స్ ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇష్క్ అప్పుడు హిట్లు వచ్చినా తర్వాత వెంటనే ప్లాపులు రావడంతో నితిన్ కెరీర్ పైకి వెళ్ళలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అ..ఆ సినిమా సూపర్ హిట్ అయ్యాక నితిన్ కెరీర్ దూసుకుపోతుందని ఆశించారు. అయితే హ్యాట్రిక్ ప్లాపులు నితిన్ ను చుట్టుముట్టాయి. లై, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం సినిమాలు ఒకటి తర్వాత ఒకటిగా వచ్చి ప్లాపులుగా మిగిలాయి. వరస ప్లాపులతో నితిన్ కెరీర్ పూర్తిగా డల్ అయింది. దీంతో ఏడాది పాటు గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఆసక్తికర సినిమాలను లైన్లో పెట్టాడు నితిన్.

మొదటగా ఛలోతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఫిబ్రవరి 21న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేసారు. దీంతో పాటే వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమాకూ కమిట్ అయ్యాడు నితిన్. వెంకీ అట్లూరి తొలిప్రేమతో సూపర్ హిట్ అందుకున్నా, mr. మజ్నుతో ఘోరమైన ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మూడో సినిమాను నితిన్ తో చేయబోతున్నాడు. ఈ సినిమాకు ఒక సింగిల్ షెడ్యూల్ చిత్రీకరణ జరిగింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. ఈ రెండూ కాకుండా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో కూడా ఒక సినిమాకు కమిట్ అయ్యాడు నితిన్. ఇక కృష్ణ చైతన్యతో సినిమా కూడా చేయబోతున్నాడు. ఇలా వరస సినిమాలతో 2020 మొత్తం బిజీగా గడిపేయబోతున్నాడు.

ఇదిలా ఉంటే నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అంధధూన్ సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేసాడు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నితిన్ హీరోగా నిర్మించనున్నారని ప్రచారం జరిగింది. సుధీర్ వర్మను దర్శకుడిగా ఎంచుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నిర్ణయం పట్ల పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కూడా. కాకపోతే ఇన్ని సినిమాల మధ్య నితిన్ ఈ సినిమా ఎలా చేస్తాడా అన్న సందేహాలు అయితే వచ్చాయి. తాజగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాను నితిన్ చేయడట. వేరే యంగ్ హీరోకు అవకాశం ఇస్తాడట. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లోనే మరో యంగ్ హీరోతో ఈ సినిమా తెరకెక్కిస్తారని తెలుస్తోంది. విశ్వక్ సేన్ వంటి నటుడైతే అంధధూన్ కు సరిగ్గా సరిపోతాడని కూడా అంటున్నారు. గతేడాది విడుదలై సంచలన విజయం సాధించింది అంధధూన్. నేషనల్ అవార్డు సైతం గెలుచుకుంది. ఇందులో హీరోగా చేసిన ఆయుష్మాన్ ఖురానాకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. మరి ఈ చిత్రాన్ని ఎవరితో నిర్మిస్తారో అన్నది చూడాలి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి అంటున్నారు. 2020 ఆరంభంలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ORG4Pi

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...