Skip to main content

గౌతమ్ మీనన్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడా?

Gautham Menon planning two movies
Gautham Menon planning two movies

దర్శకులలో కమర్షియల్ దర్శకులు ఒక రకం, టేస్ట్ ఉన్న సినిమాలు తీసి వాటితోనే విజయాలు అందుకునే వారు మరో రకం. గౌతమ్ మీనన్ రెండో కోవకు చెందే దర్శకుడు. తన ప్రతీ సినిమాలో ఏదొక స్పెషలిటీ ఉండేలా చూసుకుంటాడు గౌతమ్ మీనన్. చాలా సింపుల్ గా ఉండే ప్రేమ కావ్యాలు, ఆర్భాటం లేని హీరోయిజం, చాలా బలమైన హీరోయిన్ పాత్ర, అదిరిపోయే పాటలు ఇవన్నీ గౌతమ్ మీనన్ సినిమాల్లో మనకు కనిపిస్తాయి. ఘర్షణ సినిమాతో తెలుగు వారికి పరిచయమయ్యాడు గౌతమ్ మీనన్. ఆ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్. ముఖ్యంగా తమిళంలో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సూర్య, జ్యోతిక జోడికి అప్పట్లో చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. దాని తర్వాత వచ్చిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ లో గౌతమ్ మీనన్ చూపించిన సమీరా రెడ్డి పాత్ర, సూర్య పాత్రలో చూపించిన వేరియేషన్స్, ముఖ్యంగా ఎవర్ గ్రీన్ పాటలు ఇవన్నీ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. గౌతమ్ మీనన్ సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. కొన్ని చిత్రాలను కేవలం తమిళం నుండి డబ్ చేసేయడమే కాకుండా ఇక్కడ తెలుగు హీరోని పెట్టి మళ్ళీ షూట్ చేస్తుంటాడు గౌతమ్ మీనన్. ఘర్షణ, ఏం మాయ చేసావే, ఎటో వెళ్ళిపోయింది మనసు, సాహసం శ్వాసగా సాగిపో చిత్రాలు ఇలా తెరకెక్కించినవే. గౌతమ్ మీనన్ సినిమాల్లో రొమాంటిక్ యాంగిల్ సూపర్బ్ గా వర్కౌట్ అవుతుంది. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా ఎక్సెలెంట్ అని చెప్పవచ్చు.

కేవలం ప్రేమ కథలే కాకుండా యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేయడంలో గౌతమ్ మీనన్ సిద్ధహస్తుడు. రాఘవన్, ఎంతవారు గాని ఈ కోవలోకి చెందే సినిమాలే. దర్శకుడిగా అటు తమిళంలో, ఇటు తెలుగులో కూడా ఒక స్థాయి ఉన్న గౌతమ్ మీనన్ ఆఖరి చిత్రం 2016లో విడుదలైన సాహసం శ్వాసగా సాగిపో. అప్పటినుండి గౌతమ్ మీనన్ సినిమా ఏదీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. అలా అని గౌతమ్ మీనన్ ఖాళీగా ఉన్నాడని కాదు. ఈ గ్యాప్ లో రెండు సినిమాలను తెరకెక్కించాడు.

అయితే ఈ చిత్రాలకు నిర్మాత కూడా తానే అవ్వడంతో ఫైనాన్షియర్స్ తో వచ్చిన వివాదం కారణంగా తను తీసిన రెండు సినిమాలూ విడుదల కాకుండా ఆగిపోయాయి. అందులో ఒకటి ధనుష్ హీరోగా తెరకెక్కిన ఎన్నై నొక్కి పాయుం తోటా కాగా, మరొకటి విక్రమ్ హీరోగా చేసిన ధ్రువ నక్షత్రం. ఇటీవలే ఒక నిర్మాతను పట్టి ఫైనాన్షియర్స్ తో తన వివాదాల్ని పరిష్కరించుకున్న గౌతమ్ మీనన్ ఈ నెల 29న ధనుష్ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేసాడు. ఇదే సినిమా తెలుగులో తూటా పేరుతో విడుదలవుతోంది. ఇక విక్రమ్ ధ్రువ నక్షత్రాన్ని కూడా త్వరలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

తన వివాదాలు పరిష్కారం అవ్వడంతో సూర్యతో ఒక సినిమా, అనుష్క ప్రధాన పాత్రలో మరొక సినిమాను ప్లాన్ చేసాడు గౌతమ్ మీనన్. త్వరలోనే ఈ రెండిట్లో ఒక సినిమాను పట్టాలెక్కించాలని అనుకుంటున్నాడు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2KRVQsb

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...