Skip to main content

కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయిన దేవరకొండ ఫ్యామిలీ

కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయిన దేవరకొండ ఫ్యామిలీ
కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయిన దేవరకొండ ఫ్యామిలీ

టాలెంట్ ఉంటే మనల్ని ఆపేవాడు ఎవడూ లేడని నిరూపిస్తున్నాడు విజయ్ దేవరకొండ. మొదట్లో చాలా చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ను ఆరంభించిన విజయ్ దేవరకొండ తర్వాత హీరోగా ఒక్కసారిగా జువ్వుని పైకెగిశాడు. అనతికాలంలోనే మిడ్ రేంజ్ హీరోలలో ప్రామిసింగ్ గా కనిపిస్తున్న విజయ్ దేవరకొండ మరిన్ని మంచి చిత్రాలతో టాప్ రేంజ్ కు చేరుకోవాలని ఆశిస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో విజయ్ దేవరకొండ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. అయితే అందులో తనది అసలు గుర్తింపు లేని పాత్ర. ఏదో ఉన్నాను అంటే ఉన్నాను అన్నట్టుంటుంది. నువ్విలా సినిమాలో కూడా క్రికెటర్ గా కనిపిస్తాడు. అది కూడా అంతే. అయితే ఆ తర్వాత నాని హీరోగా వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో కీలకమైన రిషి పాత్ర పోషించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ కనిపించేది కాసేపే అయినా ఆ పాత్ర బలమైన ముద్ర వేస్తుంది.

హీరోగా విజయ్ దేవరకొండ చేసిన మొదటి సినిమా పెళ్లి చూపులు సినిమాతో విజయ్ దేవరకొండను అందరూ గుర్తుపట్టడం మొదలుపెట్టారు. ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. పెళ్లి చూపులు ఒకెత్తు అయితే అర్జున్ రెడ్డి సినిమాతో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. సినిమా కొన్ని కాంట్రవర్సీలలో ఇరుక్కున్నా కానీ విజయ్ దేవరకొండ నటనను మెచ్చుకోని వాళ్ళు ఉండరు. అలాగే అర్జున్ రెడ్డి సూపర్ సక్సెస్ అయింది. మిగతా భాషల్లో కూడా ఈ సినిమాను రీమేక్ చేయడంతో అక్కడ కూడా విజయ్ దేవరకొండ పేరు మార్మోగిపోయింది. అర్జున్ రెడ్డి వంటి రా సినిమా చేసాక, గీత గోవిందంలో సాఫ్ట్ క్యారెక్టర్ చేసి రెండు విధాలా ఎంటర్టైన్ చేయగలనని నిరూపించాడు విజయ్ దేవరకొండ. అయితే హిట్ కు హిట్ కు మధ్యలో విజయ్ సినిమాలు ప్లాప్ అవుతుండడంతో నెక్స్ట్ లెవెల్ కు వెళ్లడం ఆలస్యమవుతోంది. ఈ మధ్యే నిర్మాతగా కూడా మారి చేసిన మీకు మాత్రమే చెప్తా సినిమాతో బాగానే డబ్బులు వెనకేసుకున్నాడు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో కలిసి కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాడు. జూబ్లీ హిల్స్ లో ఒక ఇంటిని తీసుకుని దాన్ని తనకు తగినట్లు మార్పులు, చేర్పులు చేసుకున్నాడు. గృహప్రవేశం కూడా జరిగినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు విజయ్ దేవరకొండ. తల్లిదండ్రులు, తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి పూర్తి సాంప్రదాయ దుస్తులతో గృహప్రవేశం చేసిన ఫోటోను సోషల్ మీడియాలో పెట్టాడు. చాలా సంతోషంగా, గర్వంగా ఉందని పోస్ట్ చేసాడు.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం సినిమాల పరంగా కూడా దూకుడు మీదే ఉన్నాడు. వరల్డ్ ఫేమస్ లవర్ ను పూర్తి చేసే స్టేజ్ లో ఉన్నాడు. ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కానుంది. జనవరిలో పూరి జగన్నాథ్ తో సినిమా మొదలుపెడతాడు. దీనికి ఫైటర్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు. వీటి తర్వాత హీరో అని నూతన దర్శకుడితో ఒక ప్రాజెక్ట్, మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ఉన్నాయి.

Credit: Twitter



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/35vMI4y

Comments