అందరూ తినేది అన్నమే, కానీ అది రోడ్డు పక్కన తింటే ఒక రేటు. పెద్ద ప్యాలెస్ లాంటి అయిదు నక్షత్రాల హోటల్ లో కూర్చుని తింటే ఒక రేటు ఉంటుంది. కానీ కొన్ని సార్లు ఇలాంటి వార్తలు విన్నప్పుడు మొదట విడ్డూరం గా అనిపించినా, తర్వాత బాధ, కోపం ఇలా ఎవరి మానసిక స్థితి బట్టి తమదైన ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి. ఇంతకీ, ఈ ౩ గుడ్లకీ దాదాపు రూ, 1700 బిల్లు వేసింది ఎక్కడ అంటే, అహ్మదాబాద్ లోని హయత్ రెసిడెన్సీ అనే హోటల్ లో. గుచ్చుకున్నది మన లాంటి మధ్యతరగతి వాళ్ళకి కాదు లెండి, బాలీవుడ్ లో అగ్ర సంగీత దర్శకులు విశాల్ – శేఖర్ ద్వయంలో ఒకరైన శేఖర్ ఈ గురువారం ఆ హోటల్ కి వెళ్లి భోజనం ఆర్డర్ ఇచ్చి దానితో పాటు ౩ ఉడకబెట్టిన కోడిగుడ్లు ఆర్డర్ ఇవ్వగా, వాటికి బిల్లు రూ.1672 గా బిల్లు లో ఉంది. దీనితో ఆయన మొదట షాక్ అయినా, తర్వాత ఆ విషయాన్ని, వెటకారంగా తీసుకుని తన ట్విట్టర్ లో షేర్ చేసారు.
3 కోడిగుడ్లు ధర : రూ.1350
సర్వీస్ చార్జ్ : 67
సి.జిఎస్ టీ :127
ఎస్.జి.ఎస్.టి : 127
మొత్తం కలిపి రూ.1672 అయింది.
గతంలో ఒకసారి ఇలాగే ఒకసారి ఒక బాలీవుడ్ నటుడికి చండీగఢ్ లోని ఒక హోటల్ వారు రెండు అరటి పళ్లకు రూ.442 బిల్లు వెయ్యగా, ఆ విషయం పై ఆయన ఫిర్యాదు చేసారు. అప్పుడు సదరు హోటల్ వాళ్ళకి ఎక్సైజ్ & టాక్సేషన్ డిపార్ట్ మెంట్ అధికారులు రూ. 25 వేలు జరిమానా విధించారు. మరి ఇప్పుడు ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
Rs. 1672 for 3 egg whites???
That was an Eggxorbitant mealpic.twitter.com/YJwHlBVoiR
— Shekhar Ravjianii (@ShekharRavjiani) November 14, 2019
Credit: Twitter
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2qRMq94
Comments
Post a Comment