Skip to main content

దిల్ రాజు ఎందుకు రాజ్ తరుణ్ ని భరిస్తున్నాడు

దిల్ రాజు ఎందుకు రాజ్ తరుణ్ ని భరిస్తున్నాడు
దిల్ రాజు ఎందుకు రాజ్ తరుణ్ ని భరిస్తున్నాడు

సొంతంగా తన కష్టంగా పైకి ఎదిగిన హీరో రాజ్ తరుణ్. సాదాసీదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన రాజ్ తరుణ్ మొదట్లో హిట్లు అందుకుని స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. రాజ్ తరుణ్ మొదట చేసిన ఉయ్యాలా జంపాల మంచి హిట్టైంది. చాలా తక్కువ బడ్జెట్ లో చేసిన ఈ చిత్రం అందరినీ అలరించింది. తర్వాత చిత్రం సినిమా చూపిస్త మావ అయితే మాస్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా విజయం రాజ్ తరుణ్ ను ప్రామిసింగ్ హీరోగా నిలబెట్టింది. ఇక సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కిన కుమారి 21ఎఫ్ కూడా సూపర్ హిట్ అయింది. దాంతో రాజ్ తరుణ్ కు ఇక తిరుగులేదనుకున్నారు. అయితే ఈ సంబరం ఎన్నాళ్ళో కాదని త్వరగానే తెలిసొచ్చింది. రాజ్ తరుణ్ చేసిన సినిమాలన్నీ ఒకటి తర్వాత ఒకటిగా ప్లాప్స్ గా మిగిలాయి. రీసెంట్ గా వచ్చిన లవర్ చిత్రమైతే అడ్రస్ కూడా లేకుండా ప్లాప్ అయింది. ఈ దెబ్బతో రాజ్ తరుణ్ ఫెడౌట్ అయ్యే స్టేజ్ కు చేరుకున్నాడు. మరో ఉదయ్ కిరణ్, తరుణ్ తరహాలో రాజ్ తరుణ్ కెరీర్ కూడా సైడైపోతుందా అనే అనుమానాలు వచ్చాయి.

అయితే రాజ్ తరుణ్ తో లవర్ సినిమా తీసి చేతులు కాల్చుకున్న దిల్ రాజు ఎవరికీ అర్ధం కాని విధంగా మరోసారి రాజ్ తరుణ్ తోనే సినిమాను తీస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో కొత్త దర్శకుడు జీఆర్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఇద్దరి లోకం ఒకటే డిసెంబర్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో రాజ్ తరుణ్, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొదట ఈ చిత్రాన్ని నవంబర్ లోనే విడుదల చేద్దామనుకున్నా దిల్ రాజు క్రిస్మస్ సెలవులు కలిసివస్తాయన్న నమ్మకంతో డిసెంబర్ 25న విడుదల చేయాలని నిర్ణయించాడు. ఇదంతా బానే ఉంది కానీ దిల్ రాజు లెక్కల విషయంలో కచ్చితంగా ఉండే వ్యక్తి. తన నిర్ణయాలు కూడా ఎక్కువగా సరిగ్గా ఉంటాయని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు ఎందుకని అసలు మార్కెట్ కోల్పోయిన రాజ్ తరుణ్ తో సినిమా తీస్తున్నాడు అనే అనుమానం వచ్చింది. విషయంలోకి వెళితే.. దిల్ రాజు రాజ్ తరుణ్ తో చేసుకున్న మూడు సినిమాల అగ్రిమెంట్ దీనికి కారణమని తెలుస్తోంది. అందులో భాగంగా ముందు లవర్, ఇప్పుడు ఇద్దరి లోకం ఒకటే సినిమాలను నిర్మించాడు. మరో సినిమా కూడా త్వరలో పట్టాలెక్కించాలని నిర్ణయించుకున్నాడు దిల్ రాజు. అదీ కాకుండా నైజాం, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఎక్కువ థియేటర్లు దిల్ రాజు కనుసన్నల్లోనే నడుస్తాయన్న విషయం తెల్సిందే.

థియేటర్లకు ఫీడింగ్ ఇవ్వడానికైనా ఈ చిత్రాలు పనికొస్తాయని దిల్ రాజు ఆశిస్తున్నాడు. ఎలాగు ఈ చిత్రాలను తనే పంపిణీ చేస్తాడు కాబట్టి లాభమైనా, నష్టమైనా తనే భరించొచ్చు. అందుకే అగ్రిమెంట్ ను అలాగే ఉంచాడు. రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒకటే కాకుండా మరో చిత్రంలో నటిస్తున్నాడు. అది ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కనుక మళ్ళీ హిట్ అయితే రాజ్ తరుణ్ కెరీర్ మళ్ళీ పుంజుకునే అవకాశముంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/36prVAM

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...