ఇటీవలే విడుదలైన ఒక సినిమా ట్రైలర్ లో మందు, సిగరెట్, అమ్మాయిలలా శత్రువు కూడా ఒక వ్యసనం అంటాడు. సినిమా వాళ్ళ కోసం ఈ డైలాగ్ ను కొంత మార్చి మందు, సిగరెట్, అమ్మాయిలు, శత్రువులా నటన కూడా ఒక వ్యసనం అని చెప్పొచ్చేమో. ఎందుకంటే యాక్టింగ్ చేయాలన్న కోరిక ఒకసారి పుట్టాలే కానీ అది ఇక చచ్చేదాకా విడిచిపోదు. ఇండస్ట్రీలో నటులే కాకుండా చాలా మంది దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు నటులైన సందర్భాలు మనం ఎన్నో చూసాం. తాజాగా ఈ లిస్ట్ లో చేరుతున్నాడు వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. గతంలో ఈయన చిత్రాలు సాంకేతికంగా ఉన్నతంగా ఉండేవి. కచ్చితంగా ఏదొక కొత్తదనాన్ని ప్రయత్నించేవాడు ఆర్జీవీ. అప్పట్లో ఈయనకు అంత పబ్లిసిటీ పిచ్చి కూడా ఉండేది కాదు. తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్లిపోయేవాడు. అయితే సోషల్ మీడియా పరిధి పెరిగి, టీవీల్లో కనిపించే అవకాశాలు కూడా ఎక్కువవడంతో ఎలాగోలా స్క్రీన్ పై తను ఉండాలన్న తపన వర్మకు ఎక్కువైపోయింది. పబ్లిసిటీ కోసం ఈరోజుల్లో వర్మ చేయని పనంటూ ఏం ఉండట్లేదు. కెరీర్ మొదట్లో ఈయన కథలు కూడా బాగుండేవి. కానీ ఇప్పుడు ఎవర్ని టార్గెట్ చేద్దామా, ఎవర్ని ఎక్కిరిస్తూ సినిమా తీద్దామా అన్నట్లు పరిస్థితి తయారైంది.
ఎప్పుడూ వివాదాలతో సావాసం చేసే రామ్ గోపాల్ వర్మ, రీసెంట్ చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ తో బోలెడన్ని వివాదాలని కొనితెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈయన మరింత ముందుకెళ్లి కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని మరో సినిమా తీసాడు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాసుకున్నట్లు వర్మ ప్రకటించాడు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్ కు 6 మిలియన్ పైగా వ్యూస్ తెచ్చుకుంది. రవిశంకర్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న ఈ చిత్రంలోని మూడు పాటలను ఇప్పటికే విడుదల చేసారు. టైటిల్ సాంగ్, బాబు చంపేస్తాడు, కాస్ట్ ఫీలింగ్ అంటూ పాటలు విడుదల చేయగా అవి మిలియన్ వ్యూస్ దాటి తెచ్చుకున్నాయి. ఈ చిత్రంలో ఎలాంటి వివాదాలు సృష్టించాడోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ లో చంద్రబాబు, లోకేష్ కు పప్పు వడ్డించడాన్ని హైలైట్ చేయడం మరిన్ని వివాదాలకు దారితీసేలా కనిపిస్తోంది.
ఇందాక అనుకున్నట్లు రామ్ గోపాల్ వర్మకు కూడా యాక్టింగ్ బగ్ కుట్టింది. ఆ మధ్య కోబ్రా అనే సినిమాలో డాన్ పాత్ర పోషిస్తున్నట్లు ప్రకటించి అందరినీ భయపెట్టిన వర్మ, ఇప్పుడు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రంలో ఒక చిన్న పాత్రలో మెరిశాడట. ఇప్పటివరకూ దర్శకత్వంతో పాటు మాటలు రాయడం, పాటలు పాడటం, రాయడం వంటివి చేసిన వర్మ ఇప్పుడు నటనలోకి కూడా దిగాడన్నమాట. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రంలో ఈ కొత్త నటుడు కూడా ఒక భాగం. ఈ వ్యక్తిని ఎక్కడో చూసినట్లుగా ఉంది కానీ గుర్తురావట్లేదు. మీకు తెలుసా అంటూ తన ఫోటోని షేర్ చేసుకున్నాడు.
This new actor in KAMMA RAJYAMLO KADAPA REDDLU resembles somebody I know but I am not able to remember ..Can you? #KRKR pic.twitter.com/YK0ddlLgv5
— Ram Gopal Varma (@RGVzoomin) November 5, 2019
Credit: Twitter
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/33pz2aL
Comments
Post a Comment