Skip to main content

సుకుమార్.. ఈసారి ఏం చూపిస్తాడో

సుకుమార్.. ఈసారి ఏం చూపిస్తాడో
సుకుమార్.. ఈసారి ఏం చూపిస్తాడో

ఇండస్ట్రీలో ప్రతి దర్శకుడికి ఒక్కో రకమైన శైలి, ఒక్కో విజన్ ఉంటాయి. వాటికి తగ్గట్లు సినిమాలు తీసుకుంటూ పోతుంటారు. ఈ ప్రాసెస్ లో విజయాలూ రావొచ్చు, పరాజయాలు కూడా పలకరించొచ్చు. అలాగే సుకుమార్ కు కూడా ఒక రకమైన విజన్ ఉంది. చాలా సింపుల్ గా సాగే కొన్ని సన్నివేశాలతోనే హీరోయిజాన్ని వేరే లెవెల్ కు తీసుకెళ్లగల దర్శకుడిగా సుకుమార్ కు పేరుంది. అలాగే అతని స్క్రీన్ ప్లే చాలా తెలివిగా సాగుతుందని పేరుంది. సినిమా ప్లాపైనా, హిట్టైనా ఈ ఫార్ములాను మాత్రం వదల్లేదు సుకుమార్. నిజానికి సుకుమార్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక విఫలమయ్యాడేమో కానీ ఎప్పుడూ బ్యాడ్ మూవీ తీసింది లేదు. తన లాస్ట్ సినిమా రంగస్థలంతో అయితే సుకుమార్ దర్శకుడిగా తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ఇంతలా తెలుగు నేటివిటీను చూపిస్తూ వచ్చిన సినిమా ఈమధ్య కాలంలో రాకపోవడంతో రంగస్థలానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

రంగస్థలం వంటి పెద్ద హిట్ ఇచ్చినా కానీ సుకుమార్ కు నెక్స్ట్ సినిమాను సెట్ చేసుకోవడానికి చాలా టైమ్ పట్టింది. ముందు మహేష్ తో సినిమా అనుకున్నా కానీ కొన్ని కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. వెంటనే అల్లు అర్జున్ తో సినిమా కన్ఫర్మ్ అయింది కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బన్నీ బిజీగా ఉండడంతో సుకుమార్ మరికొన్ని నెలలు వెయిట్ చేయకతప్పలేదు. మొత్తానికి అల్లు అర్జున్ 20వ చిత్రానికి ముహూర్తం ఇటీవలే జరిగింది. ఈ చిత్రానికి కూడా సుకుమార్ సూపర్బ్ బ్యాక్ డ్రాప్ ను ఎంచుకున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందన్నది దాదాపు కన్ఫర్మ్. కాకపోతే అల్లు అర్జున్ పాత్ర పైనే ఇంకా క్లారిటీ లేదు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే బ్యాచ్ కు నాయకుడిగా అల్లు అర్జున్ కనిపిస్తాడని వార్తలు వచ్చాయి. మరోవైపు అది కాదు, ఇందులో బన్నీ ఫారెస్ట్ ఆఫీసర్ గా కనిపిస్తాడని అంటున్నారు.

ఏదేమైనా రంగస్థలం టైప్ లో ఈ చిత్రాన్ని కల్ట్ క్లాసిక్ ను చేద్దామని ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. అయితే రంగస్థలం షూటింగ్ కు ముందు రామ్ చరణ్ లుక్, పాత్ర తీరు తెలియజేసేలా ఒక పోస్టర్ ను వదిలాడు సుకుమార్. అల్లు అర్జున్ సినిమా లాంచ్ రోజున ఇలాంటి పోస్టర్ ను వదులుతాడేమోనని బన్నీ అభిమానులు ఆశపడ్డారు. కాకపోతే ఈసారి బన్నీ పాత్ర తీరుతెన్నులపై ఎటువంటి క్లారిటీ ఇవ్వకూడదని సుకుమార్ ఫీలయ్యాడు. అందుకే ఎటువంటి పోస్టర్ ను వదల్లేదు. మైత్రి మూవీస్ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ లోనే పట్టాలెక్కుతుందని అంటున్నారు. టాప్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు బిజీగా ఉన్న కారణంగా ఈ చిత్రానికి సుకుమార్ తో కలిసి పనిచేయట్లేదు. అయితే దేవి శ్రీ ప్రసాద్ తో అనుబంధాన్ని కంటిన్యూ చేస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే ఆర్య, ఆర్య 2 రేంజ్ లో పాటలు కావాలని అభిమానుల నుండి దేవి శ్రీ ప్రసాద్ కు వినతులు అందుతున్నాయి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2NtXRvi

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...