టాలీవుడ్ లో లేడి యాంకర్స్ సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది. స్టేజ్ పై మాటలతోనే కాకుండా హాట్ గ్లామర్ తో కూడా హీటెక్కిస్తున్నారు. అనసూయ – రష్మీ లాంటి యాంకర్స్ దెబ్బకి కొంతమంది క్రేజ్ తగ్గుతూ వస్తోంది. కానీ సుమని మాత్రం వాళ్ళు అంతగా బీట్ చేయలేకపోతున్నారు. సుమ కేవలం తన మాటలతోనే న్యాచురల్ గా ముందుకు సాగుతోంది.
అయితే ఇప్పుడు ఎంత మంది హాట్ యాంకర్స్ వస్తున్నా ఒకప్పటి ఉదయ భానును రేంజ్ లో మాత్రం క్రేజ్ అందుకోలేదనే చెప్పాలి.
రియాలిటీ షోలు చేసుకుంటూనే సినిమా ఈవెంట్స్ లలో అలాగే అవార్డ్స్ ప్రోగ్రాంలలో హోస్టింగ్ చేసుకుంటూ బిజీబిజీగా కనిపించేది. ఆమె తరువాత సుమ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందని చెప్పవచ్చు. పెళ్లి తరువాత హ్యాపీగా కుటుంబ సభ్యులతో పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న ఆమె యాంకరింగ్ కి దాదాపు గుడ్ బాయ్ చెప్పేసిందని అంతా అనుకున్నారు. మధ్యలో కాస్త మెరిసినప్పటికి క్లిక్కవ్వలేదు. ఇక మళ్ళీ తన గత జీవితాన్ని తిరిగి పొందాలని ఉదయభాను ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.
అయితే ఉదయభానుకి ఒకప్పుడు క్రేజ్ మంచిగానే ఉన్నప్పటికీ ఇప్పుడు అదే రేంజ్ లో మళ్ళీ పుంజుకుంటుందా అనేది డౌట్ గా ఉంది. రష్మీ – అనసూయ లాంటి వాళ్ల డామినేషన్ గట్టిగా పెరిగిపోయింది. శ్యామల- మంజూష వంటి వారు కూడా ఈవెంట్స్ లలో మెరుస్తున్నారు. రోజుకో ఈవెంట్ తో మంచి పేమెంట్స్ అందుకుంటున్నారు. దీంతో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఉదయ ట్రాక్ లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నట్లు టాక్.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2C3dzbl
Comments
Post a Comment