Skip to main content

బన్నీ కంటే ముందు పవన్ తో ఛాన్స్

బన్నీ కంటే ముందు పవన్ తో ఛాన్స్
బన్నీ కంటే ముందు పవన్ తో ఛాన్స్

దర్శకుడు వేణు శ్రీరామ్ కు ఒక బంపర్ ఆఫర్ తగిలింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రకటించిన ఐకాన్ మూవీకి దర్శకుడు వేణు శ్రీరామే. అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తోన్న అల వైకుంఠపురములో తర్వాత అల్లు అర్జున్ ఐకాన్ చిత్రాన్నే చేద్దామని మొదట భావించాడు. అయితే సుకుమార్ కేవలం ఆరే నెలల్లో షూటింగ్ ను పూర్తి చేస్తానని మాట ఇచ్చి తన సినిమాను ముందు పట్టాలెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ పూర్తిగా రా అండ్ రస్టిక్ గా, రంగస్థలంలో చరణ్ మాదిరి లుక్ లోకి మారిపోనున్నాడు. కానీ అంతకంటే ముందు అల వైకుంఠపురములో షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. నవంబర్ నాలుగో వారం నుండి సుకుమార్ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ఇటీవలే ఈ చిత్రానికి ముహూర్తం జరిగిన విషయం తెల్సిందే. ఇక వేణు శ్రీరామ్ ఐకాన్ విషయానికొస్తే సుకుమార్ సినిమాను మొదలుపెట్టడంతో ఇక ఐకాన్ షెడ్ కు వెళిపోయినట్లే అన్న టాక్ బలపడింది. ఎందుకంటే ముందు నుండి బన్నీ ఐకాన్ మీద దృష్టి పెట్టాడు. ఐకాన్ నే ఎక్కువ ప్రమోట్ చేసాడు. సుకుమార్ సినిమాకు చేయాల్సిన మార్పులు ఎక్కువగా ఉండడంతో పక్కా స్క్రిప్ట్ తో ఉన్న ఐకాన్ ను ముందు మొదలుపెడదామని భావించాడు. అయితే ఆ తర్వాత కథ మొత్తం మారిపోయింది. ఆరు నెలల షూటింగ్ కండిషన్ తో పాటు తన బంధువులను ప్రొడక్షన్ లో భాగం చేసుకుంటారన్న మాట మీద అల్లు అర్జున్ ఎస్ చెప్పాడు.

దీంతో వేణు శ్రీరామ్ ఇప్పుడు ఆరు నెలల పాటు ఖాళీగా గడపాలని అంతా భావించారు. కానీ అతనికి మరో బంపర్ ఆఫర్ తగిలింది. అదే పవన్ కళ్యాణ్ సినిమాను రీమేక్ చేసే అవకాశం. పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ గురించి ఆలోచించాక దిల్ రాజు చేసిన ప్రపోజల్ పింక్ రీమేక్. అమితాబ్, తాప్సి ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ కోర్ట్ రూమ్ డ్రామాను ఇప్పుడు పవన్ ప్రధాన పాత్రలో తెలుగులో తీయబోతున్నారు. తాప్సి పాత్రలో ఎవరనేది ఇంకా తెలియలేదు. ఇప్పటిదాకా ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది వెతుకులాట జరిగింది. మొదట పవన్ కు క్లోజ్ అయిన డాలీని ఈ చిత్రానికి దర్శకుడ్ని చేద్దామనుకున్నారు కానీ ఆ అవకాశం దిల్ రాజు రికమండేషన్ మీద వేణు శ్రీరామ్ కు దక్కింది. ప్రస్తుతం వేణు పింక్ రీమేక్ కు అవసర మార్పులు చేసి పవన్ కు సూట్ అయ్యే విధంగా తీర్చి దిద్దుతున్నాడట. డిసెంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశముంది. పవన్ ఈలోగా తన లుక్ ను మునుపటి మాదిరి తీసుకొస్తాడు. మరోవైపు ఐకాన్ సినిమా షెడ్ కు వెళ్లలేదని, సుకుమార్ సినిమా చేసిన తర్వాత బన్నీ కచ్చితంగా ఈ సినిమాను మొదలుపెడతాడని అంటున్నారు. అంటే బన్నీ సినిమా డైరెక్ట్ చేసే కంటే ముందు పవన్ ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని కొట్టేశాడీ యంగ్ దర్శకుడు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2pySKlA

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...