Skip to main content

డబల్ రోల్స్ హవా తెలుగులో ఊపందుకుంది!

డబల్ రోల్స్ హవా తెలుగులో ఊపందుకుంది!
డబల్ రోల్స్ హవా తెలుగులో ఊపందుకుంది!

ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ టాలీవుడ్ లో నడుస్తుంటుంది. ఒకసారి బయోపిక్ లు వస్తే, ఒకసారి హారర్ కామెడీలు వస్తాయ్, ఒకసారి విలన్ ను హీరో బకరా చేసే సినిమాలు వస్తాయి, ఒకసారి టైటిల్ లో నువ్వు అన్న పదంతో సినిమాలు ఊపందుకుంటాయి. ఇలా టాలీవుడ్ లో ఒకరు ఏది మొదలుపెడితే అది నడుస్తుండడం పరిపాటిగా మారింది. ఇప్పుడు ఎక్కడ చూసినా డబల్ రోల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ ట్రెండ్ ఇదివరకు కూడా నడిచినా ఇప్పుడు మళ్ళీ మొదలైంది. ఒకసారి ఏ ఏ సినిమాలు డబల్ రోల్స్ తో ట్రెండ్ అవుతున్నాయో చూద్దాం.

ముందుగా మెగాస్టార్ చిరంజీవిని తీసుకుంటే.. ఈ మధ్యే ఖైదీ నెం 150తో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చాడు. అందులో డబల్ రోల్ లో నటించిన విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు తన 152వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనుండగా ఇందులో కూడా చిరు డబల్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం. చిరు డబల్ రోల్ వేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ కావడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగాయి.

సాహో తర్వాత ప్రభాస్ నటిస్తున్న జాన్ చిత్రంలో కూడా రెబెల్ స్టార్ డబల్ రోల్ లో నటిస్తున్నాడట. ఈ చిత్రంలో ప్రభాస్ తండ్రీకొడుకుల పాత్రలు వేస్తున్నాడని తెలుస్తోంది. బాహుబలిలో కూడా ప్రభాస్ తండ్రీ కొడుకులుగా నటించిన విషయం తెల్సిందే. అయితే అందులో ఇద్దరు ప్రభాస్ లు ఒకేసారి కనిపించరు. ఇందులో ఇద్దరూ కలిసి ఉన్న సన్నివేశాలు చాలానే ఉన్నాయిట.

నందమూరి బాలకృష్ణ ఇప్పటివరకూ డబల్ రోల్ లో ఎన్ని సినిమాలు చేసాడంటే లెక్కపెట్టలేని పరిస్థితి. అన్ని సినిమాల్లో బాలయ్య డబల్ రోల్ లో నటించాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న రూలర్ లో కూడా బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. పోలీస్ ఆఫీసర్ గా, స్టైలిష్ డాన్ గా బాలయ్య కుమ్మేస్తాడని తెలుస్తోంది.

ఇవే కాకుండా మాస్ మహారాజా రవితేజ డిస్కో రాజా తర్వాత చేయాల్సిన సినిమాలో కూడా డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విక్రమార్కుడులో రవితేజ డబల్ రోల్ లో ఇరగతీసిన సంగతి తెల్సిందే. త్వరలోనే ఈ చిత్రం గురించిన అధికారిక ప్రకటన వెలువడుతుంది.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ కూడా ఇప్పుడు డ్యూయల్ రోల్ ట్రెండ్ లో పడ్డాడు. ఇస్మార్ట్ శంకర్ వంటి మాస్ హిట్ తో తన మార్కెట్ ను సుస్థిరపరుచుకున్న రామ్ ఇప్పుడు తన తర్వాతి చిత్రంగా ఒక రీమేక్ ను ప్రకటించిన సంగతి తెల్సిందే. అరుణ్ విజయ్ హీరోగా తెరకెక్కిన తడం చిత్రాన్ని తెలుగులో రెడ్ గా తీయబోతున్నాడు. అయితే తమిళ చిత్రానికి తెలుగు వెర్షన్ కు చాలా మార్పులుంటాయని తెలుస్తోంది. కానీ డ్యూయల్ రోల్ లో ఎటువంటి మార్పులు ఉండవు. రెడ్ చిత్రంలో రామ్ బ్రదర్స్ గా డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. నవంబర్ 16 నుండి రెడ్ సినిమా చిత్రీకరణ మొదలవుతుంది. ఏప్రిల్ 9న రెడ్ విడుదల కానుంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2K1iX3o

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...