Skip to main content

నాకు రాహుల్ ఎప్పటికీ స్నేహితుడే, నా దృష్టిలో రియల్ విన్నర్ బాబా మాస్టర్ : శ్రీముఖి

srimukhi shares interesting things about bigg boss
srimukhi shares interesting things about bigg boss

బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు ముగిసినా ఇంకా దాని గురించి వార్తలు ఎక్కడో ఒక చోట నుండి వినపడుతూనే ఉన్నాయి. ఒకవైపు బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ వరసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడుపుతుంటే, రన్నరప్ శ్రీముఖి మాత్రం మాల్దీవుల్లో ఎంజాయ్ చేసింది. నిన్నటిదాకా మాల్దీవుల్లో స్నేహితులతో, ఫ్యామిలీతో సరదా సమయం గడిపిన శ్రీముఖి మొత్తంగా రీఫ్రెష్ అయింది. స్నేహితుల బ్యాచ్ లో కో యాంకర్ విష్ణుప్రియ, ఆర్జే చైతు కూడా ఉండడం విశేషం. మొత్తంగా బిగ్ బాస్ లో ఉండగా మిస్ అయిన ఫ్యామిలీని,బయట ప్రపంచాన్ని ఆస్వాదించిన శ్రీముఖి, బిగ్ బాస్ తన జీవితంలో చాలా స్పెషల్ అని చెప్పింది. తను ఎన్నో పాఠాలు బిగ్ బాస్ లో నేర్చుకున్నానని అవి తనకు జీవితంలో చాలా ఉపయోగపడతాయని పేర్కొంది. ఇంకా బిగ్ బాస్ లో విశేషాల గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.

* బిగ్ బాస్ లో తాను అన్నిటికన్నా ఫ్యామిలీని ఎక్కువ మిస్ అయ్యానని పేర్కొంది. కుటుంబంతో ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలీలేదని, 105 రోజులు వాళ్ళను వదిలి ఉంటే వాళ్ళ విలువ తెలిసొచ్చిందని చెప్పింది. బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్న పార్టిసిపంట్స్ అందరి మీద తనకు గౌరవం ఉందని శ్రీముఖి చెప్పింది. ఎవరితోనూ విభేదాలు లేవని, అందరూ రియల్ ఫైటర్స్ అని ఆమె కితాబిచ్చింది.

* ఇక రాహుల్ సిప్లిగంజ్ తో జరిగిన గొడవ గురించి స్పందిస్తూ రాహుల్ తనకు బిగ్ బాస్ కు రాకముందు కూడా స్నేహితుడే, బిగ్ బాస్ తర్వాత కూడా స్నేహితుడే. మా మధ్య విబేధాలు టాస్క్ ల సందర్భంగా ఎక్కువగా వచ్చాయి. అవి నేను బిగ్ బాస్ లోనే వదిలేసా. మేము ఎప్పటికీ మంచి స్నేహితులమే అని శ్రీముఖి అంది.

* తన దృష్టిలో రాహుల్ రియల్ విన్నర్ కాదని ఆమె అభిప్రాయపడింది. బాబా భాస్కర్ ను రియల్ విన్నర్ గా అభివర్ణించింది. బాబా భాస్కర్ మొదట్లో టాస్క్ లు పెద్ద అర్ధం కాక ఆడలేకపోయాడు, అయితే సీజన్ లాస్ట్ లో బాబా భాస్కర్ ఆడిన టాస్క్ లు నిజంగా సూపర్. అంతకు మించి తను మంచి ఎంటర్టైనర్. వంట కూడా బాగా చేసి పెడతాడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్న బాబా రియల్ విన్నర్ అంటోంది శ్రీముఖి.

* కొంత మంది తన చేతికి ఉన్న టాటూ రియల్ ది కాదని అనుకుంటున్నారు, కానీ అది నిజం టాటూ, ఎప్పటికీ నా చేతికి అలాగే ఉంటుంది అని అంటోంది. ఇక అందరూ అనుకుంటున్నట్టు, బయట ప్రచారంలో ఉన్నట్టు బిగ్ బాస్ లో తమకు తిండికేం లోటు లేదని చెప్పింది. రేషన్ అప్పుడప్పుడు తక్కువ ఇచ్చినా ఎప్పటికప్పుడు స్పెషల్ డిషెస్ ఇచ్చి మమ్మల్ని బిగ్ బాస్ బాగా చూసుకున్నారు అని శ్రీముఖి వివరించింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలనన్న నమ్మకం బిగ్ బాస్ ఇచ్చిందని, ఈ జర్నీ తనకు పూర్తి సంతృప్తికరంగా ఉందని శ్రీముఖి అంటోంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Qe170C

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...