Skip to main content

ఇక అధికారికమే : పవన్ రీ ఎంట్రీ, పింక్ రీమేక్

ఇక అధికారికమే : పవన్ రీ ఎంట్రీ, పింక్ రీమేక్
ఇక అధికారికమే : పవన్ రీ ఎంట్రీ, పింక్ రీమేక్

ఇప్పటిదాకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీపై వస్తున్న వార్తలన్నీ నిజాలు కాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ మళ్ళీ ముఖానికి రంగు వేసుకోబోతున్నాడు. అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసిన పవన్, రాజకీయంగా ఇప్పుడు స్తబ్దత నెలకొనడంతో మళ్ళీ సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ చాలానే ఆలోచించాల్సి వచ్చింది. దిల్ రాజు కూడా పవన్ ను మళ్ళీ సినిమాల్లోకి తీసుకోవడానికి చాలానే కష్టపడ్డాడు. పవన్ ఎంతకూ సినిమాలోకి రావడానికి ఒప్పుకోకపోవడంతో పింక్ రీమేక్ తో పవన్ ముందుకొచ్చాడు. ఇక్కడ ఈక్వేషన్ చాలా సింపుల్. ఎక్కువగా కోర్టులో నడిచే డ్రామా. పెద్దగా లుక్ మార్చాల్సిన పని లేదు. కేవలం 30 రోజుల కాల్ షీట్స్ ఇస్తే చాలు. అది కూడా ఒకేసారి అవసరం లేదు. పవన్ ఇంతకు ముందు తీసుకునే అంత రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసాడు.పైగా డ్యాన్సులు, ఫైట్లు అంటూ ఒళ్ళు హూనం చేసుకోవాల్సిన పనిలేదు. ఈ లెక్కలు అన్నీ వేసుకుని పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు ఎస్ అన్నాడు.

ఇన్నాళ్లూ రూమర్స్ గానే మిగిలిన న్యూస్ ఈరోజు అధికారికంగా వెల్లడించారు. కాకపోతే చిన్న చేంజ్ తో. పింక్ రీమేక్ హక్కులు బోనీ కపూర్ వద్ద ఉన్నాయ్. తమిళంలో అజిత్ హీరోగా నెర్కొండ పార్వై పేరుతో సినిమా తీసి హిట్టు కొట్టాడు బోనీ కపూర్. ఇప్పుడు తెలుగులో ఇదే చిత్రాన్ని చేయడానికి సన్నద్ధమవుతున్నాడు. దిల్ రాజుతో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు బోనీ కపూర్. దిల్ రాజు వద్ద ఆస్థాన దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. వేణు శ్రీరామ్ ముందు అల్లు అర్జున్ తో ఐకాన్ సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నాడు. అల్లు అర్జున్ కూడా ముందు అల వైకుంఠపురములో పూర్తి చేసి తర్వాత ఐకాన్ సినిమాను చేద్దామని భావించాడు. అయితే ఈలోగా పవన్ నుండి పింక్ రీమేక్ కు ఎస్ అని సమాధానం రావడంతో లెక్కలన్నీ మారిపోయాయి. వేణు శ్రీరామ్ ను ముందు పింక్ రీమేక్ కు దర్శకత్వం వహించమని బాధ్యతలు అప్పజెప్పారు. అప్పటిదాకా అల్లు అర్జున్ ఖాళీగా ఉండలేడు కాబట్టి సుకుమార్ సినిమాను ముందుకు తోసారు. అలా కొన్ని రోజుల క్రితం సుకుమార్ – అల్లు అర్జున్ సినిమాకు ముహూర్తం కుదిరింది. ఇప్పుడు పింక్ రీమేక్ గురించి వార్తలు బయటకు వచ్చాయి. పింక్ రీమేక్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Credit: Twitter



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2WxSRKg

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...