ఏదైనా ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసి లేనప్పుడు దాని గురించి ఎంత వెంపర్లాడినా ప్రయోజనం ఉండదు. ఈ విషయం ఎవరికి అర్థమైనా కాకపోయినా నడుము అందాల సుందరిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఇలియానాకు బాగా అర్ధమై ఉంటుంది. ఇక్కడ తెలుగులో చేసినప్పుడు కామ్ గా సినిమాలు చేసేసి బాలీవుడ్ నుండి ఒకటి అరా అవకాశాలు రాగానే అటు చెక్కేసి టాలీవుడ్ సినిమాలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది ఇలియానా. ఇక్కడ వారు తనను గ్లామర్ కు మాత్రమే ఉపయోగించుకున్నారని, ఇక్కడి హీరోలను సైతం తక్కువ చేసి మాట్లాడింది. క్రమంగా బాలీవుడ్ లోనూ అవకాశాలు సన్నగిల్లాయి. ఆపై ప్రియుడు ఆండ్రూ నీబోన్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ అసలు సమయమే తెలియలేదు ఇల్లూ బేబీకి. అయితే ప్రియుడు నుండి విడిపోయాక మళ్ళీ సినిమాలలో బిజీ కావాలని చూస్తోంది. అందుకు అందరూ ఎంచుకునే దారినే ఎంచుకుంటోంది ఇలియానా.
సోషల్ మీడియాలో అడ్డు అదుపూ అన్నది లేకుండా రెచ్చిపోతోంది. వరసగా ఫోటోషూట్లు చేస్తూ ఒకదాన్ని మించి మరొక ఫొటోలో అందాలు ఆరబోస్తూ ఇలియానా కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది. అసలు బికినీ తప్ప వేరొక డ్రెస్ లేనట్లు, వరసగా బికినీలో ఉన్న ఫోటోలని అప్లోడ్ చేస్తూ వచ్చింది. అవి కూడా బాగా దగ్గరనుండి తీయడంతో యువత పండగచేసుకున్నారు. బికినీ మాత్రమే కాకుండా ఎలాంటి డ్రెస్ వేసుకున్నా క్లీవేజ్, నాభి సౌందర్యాలు ఎక్కువగా ప్రోజెక్ట్ అయ్యేలా ఇలియానా జాగ్రత్తలు పడింది. అయితే ఈ ఫోటోలను చూసిన సోషల్ మీద యూజర్లు ఇలియానా అందరినీ మోసం చేస్తోందని, పాత ఫోటోలను కొత్త ఫోటోల పేరిట అప్లోడ్ చేస్తోందంటూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు.
అయితే వీటికి ఇలియానా తన ఫోటోలతోనే సమాధానమిచ్చింది. వరసగా వేడి పుట్టించే ఫొటోలతో గుక్కతిప్పుకోనివ్వలేదు. సౌత్ లో తాను నటించేందుకు సిద్ధమని సంకేతాలు పంపించింది కూడా. ప్రస్తుతం సౌత్ లో సీనియర్ హీరోల పక్కన నటించేందుకు హీరోయిన్లు కరువయ్యారు. కాజల్, తమన్నా లాంటి వారు అవకాశాన్ని ఉపయోగించుకుని భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుండడంతో వీరికి ప్రత్యామ్నాయం కోసం తెలుగు ఫిల్మ్ మేకర్స్ చూస్తున్నారు. సీనియర్ హీరోలకు తాను సరిగ్గా సరిపోతానని ఇలియానా అంటోంది. మరి టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ అమ్మడి ఫోటోషూట్లను చూస్తున్నారో లేదో.
Credit: Instagram
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/34Hc6nB
also celebrating that I fit into this gorgeous @triangl swimsuit after a while 
Comments
Post a Comment