Skip to main content

తనపై వచ్చిన ట్రోల్స్ కు సమాధానం చెప్పనున్న బాలయ్య

nandamuri balakrishna to face trolls with his pics
nandamuri balakrishna to face trolls with his pics

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 105వ చిత్రం రూలర్ చిత్ర షూటింగ్ పనులతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదలకు ముస్తాబవుతోంది. ఇంకా 20 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాకు ముహూర్తం చేసేసి కూడా చాలా రోజుల పాటు షూటింగ్ కు వెళ్ళలేదు. దీనికి కారణాలు తెలియదు కానీ రెండు నెలల క్రితమే షూటింగ్ మొదలైంది. మొదట థాయిలాండ్ లో భారీ షెడ్యూల్ చేసారు. తర్వాత హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని యాక్షన్ ఘట్టాలతో పాటు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది.

దసరాకు ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ఫస్ట్ లుక్ ను వదిలారు. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సాఫ్ట్ వేర్ ఎంప్లొయ్ గా బాలకృష్ణ లుక్ ను ఐరన్ మ్యాన్ టోనీ స్టార్క్ ను పోలి ఉన్నా బాలయ్యకు మాత్రం పెర్ఫెక్ట్ గా సరిపోయింది అంటున్నారు అభిమానులు. ఈ చిత్రంతో బాలయ్య బౌన్స్ బ్యాక్ అవుతాడని ఆశించారు అతని అభిమానులు. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ బయోపిక్ ను తీసి దారుణంగా దెబ్బ తిన్నాడు. అటు ఫైనాన్షియల్ గా, ఇటు ఎమోషనల్ గా ఈ చిత్రం బాలకృష్ణకు వేదనను మిగిల్చింది. భారీ నష్టాలతో హీరోగానూ బాలయ్య కొన్ని స్టెప్స్ వెనక్కి వెళ్లిపోయాడనే చెప్పాలి.

అందుకే కచ్చితంగా హిట్ కొట్టాలని, తనతో జై సింహా తీసిన కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ చిత్రాన్ని చేస్తున్నాడు. దసరాకు వచ్చిన లుక్ తో పాజిటివ్ అంచనాలని పెంచిన బాలయ్య, దీపావళికి విడుదలైన లుక్ తో మాత్రం ట్రోల్స్ ను ఎదుర్కొన్నాడు. బాలకృష్ణకు ట్రోల్స్ ఎదుర్కోవడం కొత్తేమి కాదు. చాలా సందర్భాల్లో బాలయ్యను ట్రోల్స్ చేస్తూ వచ్చారు. అయితే ఈసారి ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా కామెంట్ చేసారు. దీపావళికి విడుదలైన ఈ పోస్టర్ లో బాలయ్య పోలీస్ పాత్రలో కనిపించాడు. సాఫ్ట్ వేర్ ఎంప్లొయ్ లుక్ లో అందరినీ ఆకట్టుకున్న బాలయ్య ఈ లుక్ తో మాత్రం మీమ్ పేజెస్ కు ఉపయోగపడ్డాడు. మినిమం కేర్ తీసుకోకుండా వదిలిన ఈ పోస్టర్ మీద వచ్చిన ట్రోల్స్ బాలయ్య దృష్టికి వెళ్లాయి కూడా. అందుకే వీటిని ఎదుర్కోవడానికి నందమూరి బాలకృష్ణ కొత్త ప్లాన్ వేసాడు.

త్వరలో నందమూరి బాలకృష్ణకు చెందిన ఈ చిత్రంలోని కొన్ని పిక్స్ ను విడుదల చేస్తారట. అయితే ది బెస్ట్ అనుకునే స్టిల్స్ నే విడుదల చేసి అటు ఫ్యాన్స్, ఇటు యాంటీ ఫ్యాన్స్ ను తృప్తి పరచాలని బాలయ్య చిత్ర టీమ్ ను ఆదేశించినట్లు తెలుస్తోంది. సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో భూమిక, జయసుధ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సి కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. బాలయ్య ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. మరి ఈ చిత్రంతోనైనా హిట్ కొట్టి తన పనైపోలేదని బాలయ్య నిరూపించుకోగలడా?



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/329hBd5

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...