- ఇసుక పాలసీ మీద చేసే ధర్నాకి అసలు విశాఖనే ఎందుకు వేదిక చేసారు?
- ఇసుక ఎక్కువగా రవాణా అయ్యే శ్రీకాకుళం, రాజమండ్రి, విజయవాడ ప్రాంతాలను ఎందుకు వదిలేసారు?
- ఇదే పచ్చ పార్టీ వాళ్ళు గతంలో రాజమండ్రి చుట్టు పక్కల గత అయిదారేళ్ల కాలంగా పోస్టర్లు వేసి మరీ ర్యాంప్ లు నడిపారు కదా మరి.?
- కొందరు ప్రజా ప్రతినిధులు వందలాది కోట్లు సంపాదించారు. అది మరిచారా?
- మరి అలాంటి సెంటర్ ను వదిలేసి, విశాఖనే ఎందుకు వేదికగా చేసుకున్నారు?
దీని వెనుక అసలు నిజం ఏంటి అంటే విశాఖపట్టణాన్ని విజయవాడ తరువాత ఒక సామాజిక వర్గం తన అడ్డాగా చేసుకుంది. ఇది ఒక్క రోజులో వారికి సాధ్యం కాలేదు. దాదాపు ఇరవై ఏళ్లుగా క్రమక్రమంగా ఒక్కొక్క అంశం పై పట్టు తెచ్చుకున్నారు.
ఇక్కడ ప్రస్తుత అధికార పార్టీ సరైన ఫలితాలు సాధించకపోవడానికి కూడా ఈ వర్గం తాలూకాబలమే కారణం. ఇలాంటి నేపథ్యంలో, విశాఖలో మేయర్ ఎన్నికలు రాబోతున్నాయి.
విశాఖ మీద తమ పట్టుపోతుందేమో అన్న భయం ఈ వర్గంలో ప్రస్తుతం మొదలైంది ఇలాంటి టైమ్ లో స్థానికుల సాయం కన్నా, ఈస్ట్, వెస్ట్ నుంచి ఇక్కడ ఉద్యోగ, వ్యాపారాల రీత్యా పెద్ద సంఖ్యలో వచ్చిన వారి మద్దతు తీసుకోవడం అవసరం. అలాంటి మద్దతు రావాలి అంటే కాపు కాసే వాళ్ళ మద్ధతు కావాలి. ఒక వేళ విశాఖ మేయర్ పదవి కమ్మటి బిడ్డల చేజారిపోతే, చాలా కష్టం.
విశాఖలో రియల్ ఎస్టేట్, హోటల్, ఇండస్ట్రీ తదితర రంగాల్లో ఆ వర్గం బలంగా వుంది. అందుకే విజయసాయి రెడ్డి విశాఖను ఎలాగైనా వైకాపా కు అనుకూలంగా మార్చాలని పట్టుదలగా వున్నారు.
విశాఖలో రాబోయే రోజుల్లో గంటా లాంటి పత్తి గింజలు పూల పార్టీ లోకి, కొంత మందిని తీసుకుని గోడ దూకుతారనే ప్రచారం వుంది. అలాంటి వాళ్లకు చెక్ చెప్పాలంటే ఇలాంటిది ఏదో ఒకటి చెయ్యాలి
ఈ ప్లానింగ్ లో భాగంగానే తెలుగుదేశం నుంచి మాత్రం వెలమ సామాజిక వర్గానికి చెందిన అయ్యన్న, అచ్చెన్న వచ్చారు తప్ప, కాపు నాయకులు రాలేదు. మొత్తానికి మన రాజకీయ నాయకులకు అయితే కులం – లేకపోతే శవం తప్ప ఇంకొక రాజకీయం చెయ్యబుద్ది కాదు ఎందుకో..?
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PXV1BN
Comments
Post a Comment