Skip to main content

ఎన్టీఆర్ అట్లీ సినిమా ఇప్పట్లో లేనట్టేనా?

ఎన్టీఆర్ అట్లీ సినిమా ఇప్పట్లో లేనట్టేనా?
ఎన్టీఆర్ అట్లీ సినిమా ఇప్పట్లో లేనట్టేనా?

ఈ మధ్య విజయ్ విజిల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హైదరాబాద్ వచ్చిన స్టార్ డైరెక్టర్ అట్లీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనతో టచ్ లో ఉంటాడని, ఏ ఇనెమ విడుదలైనా ఫోన్ చేసి కంగ్రాట్స్ చెబుతాడని చెప్పుకొచ్చాడు. ఇదే సందర్భంగా మాట్లాడుతూ అన్నీ అనుకున్నట్లు జరిగితే ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని కూడా అన్నాడు. ఇద్దరి మధ్య ఈ విషయంపై చర్చ జరిగినట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఖుషీ అయిపోయారు. అట్లీ తమిళ దర్శకుడే అయినా తెలుగు వారికి పరిచయమున్నవాడే. తన ప్రతి సినిమా తెలుగులో డబ్బింగ్ అయింది. విజయవంతమయ్యాయి కూడా. అట్లీ సినిమాలంటే హీరోయిజాన్ని ఓ లెవెల్లో లేపుతాడన్న విషయం తెల్సిందే. అందుకే ఎన్టీఆర్ తో సినిమా అంటే ఫ్యాన్స్ ఒక ఊపున్న మాస్ మసాలా సినిమా ఊహించుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాతే ఈ సినిమా ఉంటుందన్న చర్చలు కూడా జరిగిపోయాయి ఫ్యాన్స్ మధ్య. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పట్లో ఎన్టీఆర్ – అట్లీ కాంబినేషన్ ఉండదనే అంటున్నారు. దానికి కారణాలు కూడా లేకపోలేదు.

అట్లీ ఇప్పుడు షారుఖ్ ఖాన్ తో సినిమా తీయబోతున్నాడు. గత ఏడాది నుండి అట్లీ – షారుఖ్ సినిమా గురించి చర్చలు నడుస్తున్నాయి. ఇటీవలే షారుఖ్ ఖాన్ పుట్టినరోజుకి అట్లీ తన భార్యతో కలిసి వెళ్లి పార్టీ అటెండ్ అయ్యాడు కూడా. ఆ మధ్య షారుఖ్ తో సినిమా అంటే తప్పకుండా ఉంటుందన్న తరహాలోనే మాట్లాడాడు అట్లీ. ఇప్పుడు బాలీవుడ్ లో వినిపిస్తున్న రూమర్స్ బట్టి షారుఖ్ వద్ద అట్లీ మూడు సినిమాలకు సైన్ చేసాడట. ఇందులో మొదటగా షారుఖ్ హీరోగా ఒక సినిమాను అట్లీ డైరెక్ట్ చేస్తాడు. తర్వాత షారుఖ్ నిర్మాతగా మరో బాలీవుడ్ హీరోతో అట్లీ సినిమా ఉంటుంది. ఇంకా మూడో సినిమా గురించి ఎటువంటి సమాచారం లేదు. సో, అట్లీ మూడు సినిమాలు చేసేవరకూ బాలీవుడ్ కే పరిమితమవుతాడు. తన సొంత భాష అయిన తమిళంలోనే ఒక నాలుగేళ్ల పాటు అట్లీ సినిమా చేయలేడు. ఇక తెలుగు గురించి చెప్పేదేముంది. సో, ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని అన్నీ అది ఇప్పట్లో కాదని, తర్వాత పరిస్థితులు మారి అసలు ఉంటుందో లేదో కూడా చెప్పలేమని విశ్లేషకులు అంటున్నారు.

ఇక మరోవైపు ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ తర్వాత కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాలు చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఎవరి సినిమా ముందు, ఎవరిది తర్వాత అన్న విషయంలో క్లారిటీ లేదు కానీ ఈ ఇద్దరి దర్శకులతో ఎన్టీఆర్ తర్వాతి సినిమాలు ఉంటాయి. మరోవైపు త్రివిక్రమ్ ప్రస్తుతం బన్నీతో అల వైకుంఠపురములో తెరకెక్కిస్తున్నాడు. త్రివిక్రమ్ కు రామ్ చరణ్ తో కూడా ఒక సినిమా కమిట్మెంట్ ఉంది. కొరటాల శివ చిరంజీవితో సినిమా చేస్తున్నాడు. కొరటాల శివకు కూడా రామ్ చరణ్ తోనే ఎప్పటినుండో ఒక సినిమా కమిట్మెంట్ ఉంది. మరి ఎవరి చిత్రం ఎవరితో ఎప్పుడు మొదలవుతుందో ఆర్ ఆర్ ఆర్ పూర్తయితే కానీ క్లారిటీ రాదు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2NP2iSY

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...