Skip to main content

రాహుల్.. పునర్నవితో రిలేషన్ ను బిగ్ బాస్ లో వాడుకున్నాడా?

Is rahul punarnavi relation fake one
Is rahul punarnavi relation fake one ?

కారణాలు ఏమైనా కానీ బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. శ్రీముఖితో చాలా టఫ్ కాంపిటీషన్ నడిచినా కానీ చివరికి రాహుల్ నిలబడ్డాడు. టికెట్ టు ఫినాలే గెలిచి స్ట్రైట్ గా ఫైనల్స్ కు చేరిన రాహుల్, లాస్ట్ వీక్ నామినేషన్స్ లో లేకపోవడంతో ఓటింగ్ లో లేడు. మరోవైపు శ్రీముఖి, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్ వంటి వారు నామినేషన్స్ నుండి సేవ్ అయి వచ్చారు. దీంతో సేవ్ అయిన వారికి ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. తమ కోసం ప్రేక్షకులు ఓట్లు వేస్తున్నారని తెలిసింది. కానీ రాహుల్ డైరెక్ట్ గా ఫైనల్స్ కు వెళ్లడంతో తన ఓటు బ్యాంక్ గురించి కొంత ఆందోళన చెందిన మాట వాస్తవం. ఏదైతేనేం మొత్తానికి రాహుల్ సిప్లిగంజ్ అత్యధిక ఓట్లు తెచ్చుకుని బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాడు.

రాహుల్ సిప్లిగంజ్ హౌజ్ లోకి ఎంటరైన తొలి వారాలకి, లాస్ట్ వారాలకి చాలా డిఫరెన్స్ ఉంది. మొదట్లో చాలా లో కాన్ఫిడెన్స్ తో కనిపించేవాడు రాహుల్. అయితే నెమ్మదిగా పునర్నవితో బాండ్ ఏర్పడడం, వరుణ్, వితిక, రాహుల్, పునర్నవి ఒక బ్యాచ్ గా ఏర్పడడంతో రాహుల్ నెమ్మదిగా కాన్ఫిడెన్స్ గైన్ చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో పెద్దగా టాస్క్ లు కూడా ఆడని రాహుల్ కు ఫుటేజ్ దొరికిందంటే దానికి కారణం పునర్నవి.

ఆమెతో రాహుల్ కు స్నేహంలా మొదలైన వ్యవహారం, తర్వాత దానిని మించి మరేదో ఉందన్నట్లుగా ఇద్దరూ కలరింగ్ ఇచ్చారు. నాగార్జున కూడా ఈ విషయంపై ఏం తేల్చకుండా వాళ్లతో సరదాగా జోకులు వేస్తూ ఆటపట్టిస్తూ రాహుల్ కు కావాల్సినంత హెల్ప్ చేసాడు. రాహుల్ – పునర్నవి బంధం రాహుల్ కు భలే ప్లస్ అయింది. కంటెస్టెంట్స్ కూడా వీళ్లిద్దరి పెయిర్ ను లైక్ చేయడం మొదలుపెట్టారు. మధ్యలో పునర్నవి ఎలిమినేట్ అవ్వడంతో రాహుల్ ఎమోషనల్ అవ్వడం అతనికి మరింత ప్లస్ అయింది.

హౌజ్ లో ఉన్నప్పుడు అసలు వారిద్దరి బంధం గురించి ఎటువంటి క్లారిటీ ఇవ్వని రాహుల్ సిప్లిగంజ్ హౌజ్ నుండి బయటకు వచ్చిన వెంటనే పునర్నవితో రిలేషన్ గురించి పెదవి విప్పాడు. పునర్నవి తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని, ఆల్రెడీ తన లైఫ్ లో వేరొకరు ఉన్నారని పేర్కొన్నాడు. పునర్నవిని డేటింగ్ కు పిలిచినట్లు కూడా రాహుల్ ఒప్పుకున్నాడు. అయితే అందుకు పునర్నవి ఒప్పుకోలేదట. మొత్తానికి రాహుల్ – పునర్నవి బంధం గురించి సీక్రెట్ రివీల్ అయిపోయినట్లే.

ఇక రూమర్ రాయుళ్లు ఈ దెబ్బకు రెస్ట్ తీసుకోవచ్చు. ఇదిలా ఉంటే పునర్నవి లైఫ్ లో ఇంకొకరు ఉన్నారని తెలిసినప్పుడు ఇద్దరూ ఎందుకంత క్లోజ్ గా మూవ్ అవుతూ ఇద్దరి మధ్యన ఏదో ఉందన్నట్లుగా కలరింగ్ ఇచ్చారన్నది అర్ధం కాని ప్రశ్న. కేవలం బిగ్ బాస్ కోసం వీరిద్దరూ రిలేషన్ ను వాడుకున్నారు. ఏదైతేనేం, మొత్తానికి రాహుల్ విన్ అయ్యాడు. ఇప్పుడు దేని గురించి జరిగినా ఒకటే.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2WPVfvO

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...