ఎస్ ఎస్ థమన్.. బహుశా ఏ సంగీత దర్శకుడికి థమన్ పై వచ్చినన్ని ట్రోల్స్ వచ్చి ఉండవు. ఎన్నో మీమ్స్ థమన్ పై చేసారు. కిక్ వంటి అదిరిపోయే ఆల్బమ్ తో తెలుగు ఇండస్ట్రీకొచ్చిన థమన్, అనతికాలంలోనే టాప్ రేంజ్ కు చేరుకున్నాడు. చాలా త్వరగా మహేష్ వంటి టాప్ స్టార్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే అవకాశం సంపాదించుకున్నాడు. అక్కడినుండి వెనుతిరిగి చూసుకోలేదు థమన్. అయితే ఎంత త్వరగా పైకి ఎదిగాడో, అంతే త్వరగా తన మీద ట్రోల్స్ వచ్చేలా చేసుకున్నాడు. థమన్ స్వరపరిచిన కొన్ని ట్యూన్స్ కాపీ అంటూ సోషల్ మీడియాలో జోకులు పేల్చడం మొదలయ్యాయి. దీంతో ఒత్తిడికి గురైన థమన్ నుండి కొన్ని సాధారణ ఆల్బమ్స్ వచ్చాయి. దానికి తోడు తన దగ్గరకి వచ్చే దర్శకులు సైతం మాస్ బీట్స్ కోరుకోవడంతో డప్పులు కొట్టే థమన్ అంటూ విమర్శించడం మొదలుపెట్టారు.
వీటి వల్ల థమన్ రేంజ్ పడిపోతూ వచ్చింది. కానీ తను ఈ విమర్శలను పాజిటివ్ గానే తీసుకున్నాడు. తనను తాను తిరిగి ఆవిష్కరించుకునే ప్రయత్నం చేసాడు. పూర్తిగా మాస్ డప్పులకు దూరంగా వెళ్లి మహానుభావుడు, తొలిప్రేమ, mr. మజ్ను, అరవింద సమేత వంటి సూపర్ హిట్ ఆల్బమ్స్ వచ్చాయి. మెలోడీలను సరికొత్తగా ప్రెజంట్ చేసి థమన్ అందరి మనసులను తిరిగి గెలుచుకోవడం మొదలుపెట్టాడు. 2019 అయితే థమన్ కెరీర్ కు టర్న్ అవుట్ అనే చెప్పాలి. సెకండ్ హాఫ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా థమన్ పేరే వినిపిస్తోంది.
అల వైకుంఠపురములో ఇప్పటివరకూ విడుదలైన రెండు పాటలూ సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. సామజవరగమన, రాములో రాముల యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. మొదటి పాట 60 మిలియన్ వ్యూస్ కు చేరుకోగా, రెండో పాట విడుదలైన మొదటి 24 గంటల్లో అత్యధికంగా ప్లే అయిన సౌత్ ఇండియన్ పాటగా రికార్డు సృష్టించింది. అల వైకుంఠపురములో మాత్రమే కాకుండా ఇటీవలే విడుదలైన రవితేజ డిస్కో రాజా మొదటి పాట నువ్వు నాతో ఏమన్నావో సాంగ్ కూడా కుమ్మేసింది. రిట్రో ఫీల్ కలిగించే సాంగ్ కావడంతో థమన్ ను అందరూ అభినందిస్తున్నారు.
ఇవి చాలవన్నట్లు రీసెంట్ గా విడుదలైన సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజూ పండగే లోని టైటిల్ సాంగ్ ను కూడా ప్రతి ఒక్కరూ ఇష్టపడుతున్నారు. థమన్ కెరీర్ లోనే ఇది బెస్ట్ ఫేజ్ అని కొనియాడుతున్నారు. వారు అన్నట్లుగానే థమన్ కెరీర్ లో ఇది ది బెస్ట్ ఫేజ్. ఒకవైపు దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడంతో థమన్ టాలీవుడ్ లో టాప్ ప్లేస్ చేజిక్కించుకోవాలని భావిస్తున్నాడు.
అందుకు ఇదే సరైన తరుణం. ఈ వారం నాగచైతన్య, వెంకటేష్ కలిసి నటించిన వెంకీ మామ చిత్రంలోని మొదటి సాంగ్ కూడా విడుదలవుతుంది. ఈ పాట కూడా బాగా వచ్చిందని అంటున్నారు. రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రానికి కూడా థమన్ సంగీతం అందించనున్నాడు. ఇలా వరస సినిమాలు చేయడమే కాకుండా వరసగా హిట్స్ కొడుతూ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారుతున్నాడు థమన్.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/33jBShq
Comments
Post a Comment