Skip to main content

మరోసారి డిటెక్టివ్ కాంబినేషన్

మరోసారి డిటెక్టివ్ కాంబినేషన్
మరోసారి డిటెక్టివ్ కాంబినేషన్

సినిమా అనేది ఎంత గొప్పదో కొంతమంది దర్శకులు చేసిన సినిమాలు చూస్తే మనకు అర్థమవుతుంది. సినిమాకు సంబంధించిన 24 విభాగాల్లో తనదైన ముద్ర వేస్తూ, ఆ సినిమాను ఎప్పుడు చూసిన మొదటి నుంచి చివర వరకు తనదైన సంతకాన్ని చేసినట్లు చూపిస్తారు ఆ దర్శకులు. వాళ్లల్లో తమిళ దర్శకుడు మిస్కిన్ ఒకరు.

మంచు మనోజ్ చేసిన రాజు భాయ్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా తమిళ వెర్షన్ & రైటర్ డైరెక్టర్ మిస్కిన్. అంతేకాకుండా ఒక నటుడిగా కూడా మిస్కిన్, విజయ్ సేతుపతి ఇటీవల చిత్రం సూపర్ డీలక్స్ లో కూడా ఒక అద్భుతమైన పాత్రలో కనిపించారు.

లాంగ్ షాట్స్, క్లోజప్, మోనో లాగ్ షాట్స్, ఒక థియేటర్ ప్లే చూసినట్లు ఉండే సింగిల్ టేక్ సీన్స్, ముఖ్యంగా చీకటి వెలుతురు కాంబినేషన్ లో మిస్కిన్ షాడో షాట్స్ ఇప్పుడు కొత్తగా వచ్చే యువతరం ప్రేక్షకులందరికీ పాఠాలు లాంటివి. ప్రస్తుతం ఆయన డైరెకషన్ చేసిన సైకో అనే సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది.

గతంలో విశాల్ తో ఆయన దర్శకత్వం వహించిన తుప్పరివాలన్ (తెలుగులో డిటెక్టివ్) అనే సినిమాకి సీక్వెల్ రెడీ చేస్తున్నారు డైరెక్టర్ మిష్కిన్. విశాల్ డిటెక్టివ్ పాత్రలో కనిపించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. కమర్షియల్ గా కూడా హిట్ అయింది.

డిటెక్టివ్ అద్వైత భూషణ్ గా విశాల్ నటన, ఆ సినిమా స్క్రీన్ ప్లే, మరీ ముఖ్యంగా ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎవరూ మర్చిపోలేరు. ఒక చిన్న కుక్క పిల్ల చనిపోవడంతో మొదలుపెట్టే ఆ ఇన్వెస్టిగేషన్, చివరకి పెద్ద పెద్ద హత్యలు చేసే సీరియల్ కిల్లర్స్ గ్యాంగ్ ని పట్టుకోవడం, నిజంగా ఆడియెన్స్ ని సీట్ edge మీద కూర్చోబెడుతుంది. ఇప్పుడు రాబోయే డిటెక్టివ్ 2 సినిమాలో నటి గౌతమి ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు.

బాక్సాఫీస్ లెక్కలు పక్కనపెడితే, సినిమా అనేది ఎవడు పడితే వాడు తీసేది కాదని, ఒక గొప్ప సినిమాకి పర్యాయపదంగా సినిమాలు చేసి చూపించిన వ్యక్తి డైరెక్టర్ మిస్కిన్. ప్రస్తుతం తీసే డిటెక్టివ్ 2 సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుందాం.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2WOxRiz

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...