Skip to main content

కోటి రూపాయలతో కుమ్ముకుంటోన్న హాట్ యాంకర్

కోటి రూపాయలతో కుమ్ముకుంటోన్న హాట్ యాంకర్
కోటి రూపాయలతో కుమ్ముకుంటోన్న హాట్ యాంకర్

బిగ్ బాస్ పూర్తయి రెండు వారాలు గడిచినా కాని ఇంకా దాని గురించిన వార్తలు మాత్రం తగ్గట్లేదు. బిగ్ బాస్ గురించి రోజుకో వార్త పుట్టుకొస్తోంది. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 3 ఫైనలిస్ట్స్ రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి గురించి వార్తలు తగ్గట్లేదు. బిగ్ బాస్ పూర్తవ్వడంతో వారి పారితోషికం వివరాలు బయటకు పొక్కాయి. దాంతో మీడియా రోజుకోరకంగా వివిధ కోణాల్లో వార్తలు అల్లేసి పండగ చేసుకుంటోంది. ఈ మధ్య బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పారితోషికం గురించి ఇలాగే వార్తలు రాసింది ఒక మీడియా సంస్థ. రాహుల్ బిగ్ బాస్ విన్ అయినందుకు వచ్చిన 50 లక్షల చెక్ తో పాటు రోజుకి లక్షకు పైగా తీసుకుంటున్నట్టు కథనాలు ప్రచురించింది. ఈ వార్తలపై రాహుల్ స్పందించాడు. అందరూ అనుకుంటున్నట్లు మాకు రోజుకు లక్ష రూపాయల పేమెంట్ అనేది లేదు. బయట ప్రచారంలో ఉన్నదానికంటే చాలా తక్కువ. నేను ఒక్క షో చేస్తే ఛార్జ్ చేసే అమౌంట్ కంటే బిగ్ బాస్ లో ఉన్నందుకు తీసుకున్నదే తక్కువ అని పేర్కొన్నాడు.

అయితే దీనిపై కూడా భిన్న కథనాలు వచ్చాయి. కావాలనే రాహుల్ ఫిగర్స్ తక్కువ వేసి చెప్పాడని, అసలు నంబర్స్ బయటకి రాకూడదు కాబట్టి జనాలను కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా మాట మార్చాడని అన్నారు. రాహుల్ సంగతి తెలీదు కానీ శ్రీముఖి మాత్రం కచ్చితంగా రోజుకి లక్షకు పైనే ఛార్జ్ చేసిందట. షో కు వచ్చే ముందే 15 వారాలు షో లో కచ్చితంగా ఉంటానన్న మాట తీసుకున్నాకే శ్రీముఖి షో కు రావడానికి ఒప్పుకుందట. రోజుకి లక్ష చొప్పున ఆమె ఉన్నది 105 రోజులు కాబట్టి కోటి దాటేసింది. టాక్స్ లు తీసేసినా కూడా ఆమె దాదాపు కోటి రూపాయలు ముట్టినట్లు తెలుస్తోంది. అందుకే శ్రీముఖి హౌజ్ నుండి బయటకు వచ్చిన వెంటనే స్నేహితులతో, ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ వారం రోజుల పాటు ఫుల్ రిలాక్స్ అయిపోయాక రీసెంట్ గా తిరిగి హైదరాబాద్ చేరుకుందిట శ్రీముఖి.

పారితోషికంతో పాటు స్టార్ మా కు కొన్ని షోస్ కి యాంకరింగ్ చేసేలా కూడా ఒప్పందం మీద సంతకం చేసిందట శ్రీముఖి. అయితే తను మళ్ళీ డిసెంబర్ నుండే తిరిగి షూట్ లలో పాల్గొంటానని పేర్కొంది. ఈ మూడున్నర నెలలు తాను కుటుంబాన్ని, ఇంటిని చాలా మిస్ అయ్యానని అందుకే ఈ నెల మొత్తం రెస్ట్ తీసుకుని మళ్ళీ నూతనోత్సాహంతో షోస్ ఒప్పుకుంటానని చెబుతోంది. మొత్తానికి బిగ్ బాస్ లో పాల్గొన్న అందరూ షో అయిపోగానే ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఒక్క శ్రీముఖి మాత్రం ఈ విషయంలో ఎస్కేప్ అయింది. ఎవరికీ చిక్కకుండా హాలిడేస్ కు చెక్కేసింది. ఇప్పుడు మళ్ళీ తిరిగొచ్చింది కాబట్టి ఇప్పుడేమైనా ఇంటర్వ్యూలు ఇస్తుందేమో చూడాలి.ఇటీవలే శ్రీముఖి సోషల్ మీడియాలో మాట్లాడుతూ రాహుల్ బిగ్ బాస్ టైటిల్ గెలిచినా కానీ తన దృష్టిలో రియల్ విన్నర్ బాబా భాస్కర్ అని చెప్పిన విషయం తెల్సిందే.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/36PYYhE

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...