Skip to main content

మరో ఆప్షన్ లేక అతనికే ఫిక్స్ అయిన మహేష్

మరో ఆప్షన్ లేక అతనికే ఫిక్స్ అయిన మహేష్
మరో ఆప్షన్ లేక అతనికే ఫిక్స్ అయిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 26వ చిత్రం చిత్రీకరణలో బిజీగా మారిన సంగతి తెల్సిందే. నవంబర్ లోనే ఈ చిత్ర షూటింగ్ పూర్తైపోతుంది. సంక్రాంతికి అంటే జనవరి 12న ఈ సినిమా విడుదలవుతుంది. మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గత కొన్ని చిత్రాల నుండి మహేష్ కమర్షియల్ అంశాలను, ఫ్యాన్స్ కోరికలను పక్కనపెట్టి అతి మంచివాడి పాత్రలు పోషిస్తూ వస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరులో కూడా మంచి వాడి పాత్రే అయినా కానీ ఇందులో కమర్షియల్ అంశాలకు కొదవ లేదు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ విషయంలో పక్కాగా ఉంటాడు. కమర్షియల్ అంశాలకు లోబడి చిత్రాన్ని చేస్తాడు. తన గత చిత్రాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. అలాగే అనిల్ రావిపూడి చిత్రాలంటే ఎంటర్టైన్మెంట్ పక్కా. కడుపుబ్బా నవ్విస్తాడు. ఈ నేపథ్యంలో సరిలేరు నీకెవ్వరు తమకు ఫుల్ మీల్స్ పెట్టే చిత్రమని మహేష్ అభిమానులు నమ్ముతున్నారు. దానికి తగ్గట్లే సరిలేరు నీకెవ్వరు టీమ్ కూడా అంచనాలను అంతకంతకూ పెంచేస్తోంది. ఈ సినిమా చూస్తే కడుపు చెక్కలవ్వడం ఖాయం అనే పదాన్ని ప్రతి ఒక్కరూ వాడుతున్నారు.

ఇక ఈ సినిమా సంగతి పక్కనపెడితే నవంబర్ లోనే ప్రస్తుత సినిమా షూటింగ్ పూర్తైపోతున్నా మహేష్ వెంటనే నెక్స్ట్ సినిమాను మొదలుపెట్టట్లేదు. ఈసారి మూడు నుండి నాలుగు నెలలు బ్రేక్ తీసుకోవడం పక్కా అని తెలుస్తోంది. దీనికి కారణం మహేష్ తో టచ్ లో ఉన్న దర్శకులెవరూ ప్రస్తుతం ఖాళీగా లేరు. సందీప్ వంగా స్క్రిప్ట్ కు మహేష్ కొన్ని మార్పులు సూచించాడు. అయితే ఈలోగా బాలీవుడ్ నుండి సందీప్ కు పిలుపొచ్చింది. అటు చెక్కేసాడు. పరశురామ్ చెప్పిన కథను మహేష్ వద్దనుకున్నాడు. అనిల్ రావిపూడి కథ చెప్పినా సరిలేరు నీకెవ్వరు విడుదలైతే కానీ ఏ విషయం తేల్చలేడు. అనుభవం తక్కువున్న దర్శకుడితో చేయడానికి మహేష్ సిద్ధంగా లేడు. దీంతో వంశీ పైడిపల్లితోనే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మహర్షి తర్వాత మరో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు మహేష్. తనకెవరైనా దర్శకుడు నచ్చితే వారితో మళ్ళీ మళ్ళీ చేయడానికి ఇష్టపడతాడు మహేష్. అయితే మహర్షి చేసిన తర్వాత మరో సినిమా గ్యాప్ కూడా లేకుండా వంశీ పైడిపల్లి మళ్ళీ మహేష్ కే కథ సిద్ధం చేస్తున్నాడు.

అయితే వంశీ పైడిపల్లి సినిమా అంటే మహేష్ ఫ్యాన్స్ కు కొంత కంగారుగా ఉంది. మహర్షి హిట్టయినా కానీ అది అన్ని వర్గాలని మెప్పించిన సినిమా అయితే కాదు. మహేష్ అభిమానులు కూడా కొంత మంది ఈ చిత్రంపై తమ అసంతృప్తి వ్యక్తం చేసారు. పైగా వంశీ పైడిపల్లి బాగా స్లో. పూరి జగన్నాథ్, అనిల్ రావిపూడిలా చాలా ఫాస్ట్ గా సినిమాలు తీసే దర్శకులంటే ఫ్యాన్స్ ఇష్టపడతారు. కానీ వంశి పైడిపల్లి స్క్రిప్ట్ కు, మేకింగ్ కు చాలా టైమ్ తీసుకుంటాడు. ఈ లెక్కన వచ్చే వేసవికే వంశీ పైడిపల్లి – మహేష్ సినిమా పట్టాలెక్కుతోంది. అప్పటిదాకా మహేష్ ఖాళీనే.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2N9sreQ

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...