Skip to main content

అల వైకుంఠపురములో దృష్టి ఇక మలయాళ వెర్షన్ పై

అల వైకుంఠపురములో దృష్టి ఇక మలయాళ వెర్షన్ పై
అల వైకుంఠపురములో దృష్టి ఇక మలయాళ వెర్షన్ పై

ఇతర రాష్ట్రాల్లో మార్కెట్ సంపాదించుకోవాలని మన హీరోలు ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేసారు. అయితే అనుకోకుండానే అల్లు అర్జున్ కు కేరళలో మంచి మార్కెట్ వచ్చింది. వరసపెట్టి తన డబ్బింగ్ సినిమాలు అక్కడ హిట్ అవ్వడంతో అల్లు అర్జున్ రేంజ్ అక్కడ బాగా పెరిగింది. ఫ్యాన్స్ కు తయారయ్యారు. అల్లు అర్జున్ ను మల్లు అర్జున్ అని సంభోదిస్తుంటారు అక్కడ. మలయాళంలో ఒక మీడియం రేంజ్ హీరోకు ఉండే మార్కెట్ ను చాలా తక్కువ కాలంలోనే సంపాదించుకున్నాడు బన్నీ. తను తెలుగులో చేసే ప్రతి సినిమా మలయాళంలో కూడా విడుదలయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆ మధ్య కేరళ వెళ్తే అక్కడ జన సందోహానికి బన్నీ కూడా ఆశ్చర్యపడ్డాడు. ఆ రేంజ్ లో అభిమానులు సందడి చేసారు. అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న అల వైకుంఠపురములో చిత్రానికి భీభత్సమైన ప్రమోషన్స్ చేస్తున్న విషయం తెల్సిందే. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రాన్ని అగ్రసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు విడుదల కాగా, రెండూ కూడా సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. ఒకదాన్ని మించి మరొకటి మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తూ దూసుకుపోతున్నాయి. ఈ చిత్రానికి నాలుగు నెలల ముందే ప్రమోషన్స్ మొదలుపెట్టాలన్న అల వైకుంఠపురములో టీమ్ స్ట్రాటజీ సూపర్ గా వర్కౌట్ అయింది. ఇప్పుడు ఈ చిత్రానికి ఉన్నంత బజ్ తెలుగులో మరే సినిమాకి లేదంటే అతిశయోక్తి కాదు.

తెలుగులో ఇప్పటికే మచ్ అవైటెడ్ ఫిల్మ్ గా పేరు తెచ్చుకున్న అల వైకుంఠపురములో ప్రమోషన్స్ లో మాత్రం తగ్గేది లేదంటున్నారు. ఈ నెలలోనే చిత్రంలోని మూడో పాటను కూడా విడుదల చేస్తారట. అయితే దానికంటే ముందు అల వైకుంఠపురములో మలయాళ వెర్షన్ టైటిల్, ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ఈరోజు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు కాగా ఎటువంటి అప్డేట్ వస్తుందా అని ఎదురుచూసిన అభిమానులకు అల వైకుంఠపురములో టీమ్ ఇలా స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చిందన్నమాట. ఈ చిత్రాన్ని మలయాళంలో అంగు వైకుంఠపురతు పేరుతో విడుదల చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలోని సూపర్ డూపర్ హిట్ మెలోడీ సామజవరగమన మలయాళ వెర్షన్ ను ఈ నెల 10వ తారీఖున విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు వెర్షన్ తో పాటే మలయాళ వెర్షన్ కూడా జనవరి 12 2020న విడుదలవుతుందని తెలిపారు. ఒకవైపు తెలుగే అనుకుంటే ఇప్పుడు మలయాళంలో కూడా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. కేవలం ఇక్కడ విడుదలైన పోస్టర్ కు టైటిల్ మార్చడం లాంటిది కాకుండా మలయాళ ప్రేక్షకుల కోసం కొత్త పోస్టర్ ను వదిలారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే, నివేద పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుశాంత్, నవదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టబు ఈ చిత్రం ద్వారానే మళ్ళీ తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోంది. థమన్ ఈ చిత్రానికి స్వరాలను అందిస్తున్న విషయం తెల్సిందే. చినబాబు, అల్లు అరవింద్ నిర్మాతలు.

Credit: Twitter



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2rlMw9g

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...