Skip to main content

కొత్త సినిమాను ప్రకటించనున్న నాగ్

కొత్త సినిమాను ప్రకటించనున్న నాగ్
కొత్త సినిమాను ప్రకటించనున్న నాగ్

కింగ్ నాగార్జునకు ఇప్పుడు కమిట్మెంట్స్ ఏం లేవు. ఇన్నాళ్లూ కొత్త సినిమా ఎప్పుడంటే బిగ్ బాస్ అయ్యాక చూద్దాం అనేవాడు. బిగ్ బాస్ హోస్ట్ చేయడం ద్వారా నాగ్ కు బాగానే ముట్టింది. 30 ఎపిసోడ్స్ హోస్ట్ చేసినందుకు గాను దాదాపు 5 కోట్ల రూపాయలు ముట్టజెప్పారు బిగ్ బాస్ యాజమాన్యం. మధ్యలో రెండు ఎపిసోడ్స్ కు నాగ్ లేకపోయినా అమౌంట్ కటింగ్ లాంటివి లేకుండా ఫుల్ పేమెంట్ ఇచ్చేసారు. ఇక నాగ్ హోస్టింగ్ సంగతి పక్కనపెట్టేస్తే ఈ మూడున్నర నెలలు ప్రేక్షకులకు దగ్గరగా ఉండటానికి ఒక వేదిక దొరికింది నాగార్జునకు. ఈ రకంగా నాగార్జునకు బిగ్ బాస్ ప్లస్ అయిందనే చెప్పాలి. వచ్చే సీజన్ బిగ్ బాస్ కు నాగార్జున హోస్టింగ్ చేస్తాడా లేదా అన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేం. ఇప్పటిదాకా తెలుగులో మూడు సీజన్లు అవ్వగా, మూడింట్లో ముగ్గురు హోస్ట్ లుగా చేసారు. మరి నాలుగో సీజన్ కు నాలుగో హోస్ట్ వస్తాడా లేక నాగ్ నే రిపీట్ చేస్తారా అన్నది చూడాలి.

ఈ విషయం పక్కనపెడితే నాగార్జున, బిగ్ బాస్ పూర్తవ్వడంతో తన ఫోకస్ మొత్తం ఇప్పుడు సినిమాలపైనే పెడుతున్నాడు. తన తర్వాతి సినిమాలను లైన్లో పెట్టాలని చూస్తున్నాడు. అయితే కెరీర్ పరంగా ఇప్పుడు నాగార్జున పరిస్థితి ఏమంత బాగోలేదు. ఎంతో నమ్మి చేసిన మన్మథుడు 2, దారుణమైన ప్లాప్ గా మిగిలింది. అంతే కాకుండా బోలెడంత చెడ్డ పేరుని కూడా మూటగట్టుకోవాల్సి వచ్చింది. నాగార్జున రీసెంట్ సినిమాలు కూడా ఫ్లోప్స్ అవ్వడంతో ఇప్పుడు తన మార్కెట్ పొజిషన్ ఏంటి, ఎలాంటి సినిమాలు తీయాలి, ఎంత బడ్జెట్ లో చేస్తే సినిమాకి మంచిది వంటి లెక్కలన్నీ వేస్తున్నాడట. ఈ నేపథ్యంలో కథలు వింటున్న నాగార్జున ఒక కొత్త దర్శకుడి కథకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. నాగార్జున, కార్తీ కలిసి నటించిన ఊపిరి చిత్రానికి అసిస్టెంట్ రైటర్ గా పనిచేసిన సోలమన్ చెప్పిన కథకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మహేష్ బాబు మహర్షి చిత్ర కథా విస్తరణలో కూడా సోలమన్ హస్తం ఉంది. వంశీ పైడిపల్లి దగ్గర ఇన్నాళ్లూ పనిచేసిన సోలమన్ ఇప్పుడు దర్శకుడు అవ్వాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

కథ నచ్చినా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వడం కరెక్టేనా అన్న సందేహం నాగార్జునకు ఉందిట. చాలా రోజులు ఆలోచించిన తర్వాత కథ బాగుంది కాబట్టి ముందుకెళదామని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని మొదలుపెడతారు. నాగార్జున ఇప్పుడు రెగ్యులర్ కమర్షియల్ ఎంటెర్టైనెర్స్ చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో నాగ్ ఎలాంటి సినిమా ఎంచుకున్నాడోనన్న ఆసక్తి మొదలైంది. మరోవైపు నాగార్జున ఎప్పటినుండో పెండింగ్ లో పెట్టిన బంగార్రాజు సినిమా విషయం ఏమైందన్న దానిపై ఎటువంటి సమాచారం లేదు. బిగ్ బాస్ అయ్యాక బంగార్రాజు షూటింగ్ మొదలుపెడతారని అందరూ అనుకున్నారు. అయితే నాగ్ దీనిపై స్పందించట్లేదు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2JXsyYC

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...