Skip to main content

అల్లు అర్జున్ ఎఫెక్ట్ – నవంబర్ నుండే సరిలేరు ప్రచారం

Sarileru Neekevvaru rescheduling promotional campaign
Sarileru Neekevvaru rescheduling promotional campaign

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తన 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు చిత్రానికి నిజంగా మాట్లాడుకుంటే ఇంకా ప్రచారం ఏం మొదలుకాలేదు. ఏదో ఒక పాట రిలీజ్ చేసారు కానీ అది అంత సీరియస్ గా తీసుకుని చేసింది కాదు. అది కాకుండా మరో రెండు, మూడు పోస్టర్లు మాత్రమే వదిలారు. ఇంకా సంక్రాంతికి రిలీజ్ ఉండడంతో అనిల్ రావిపూడి చెప్పినట్లు ప్రమోషన్స్ కు ఇంకా చాలా టైమ్ ఉంది. అసలైతే డిసెంబర్ నుండి ఈ చిత్ర ప్రమోషన్స్ ను అగ్రసివ్ గా ప్లాన్ చేసారు. వారానికి ఒక ప్రమోషనల్ మెటీరియల్ తో ఇప్పటికే ప్లాన్ రెడీ చేసారు.

ఇక జనవరి నుండి డే టు డే ప్రమోషనల్ యాక్టివిటీస్ కు సంబంధించిన షెడ్యూల్ సిద్ధంగా ఉంది. జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుండడంతో దాదాపు 11వ తేదీ వరకూ మీడియాలో ఈ చిత్రం మార్మోగిపోయేలా అన్ని ప్లాన్స్ సిద్ధంగా ఉన్నాయి. నిజానికైతే ఒక స్టార్ హీరో చిత్రానికి ఇది చాలా ఎక్కువ. ఇంత పబ్లిసిటీ కూడా కోరుకోరు టాప్ హీరో అభిమానులు. కానీ ఈసారి సంక్రాంతికి పోటీ విపరీతంగా ఉండడంతో సరిలేరు నీకెవ్వరు టీమ్ ప్రమోషన్స్ విషయంలో అగ్రసివ్ గా వెళ్లాలని నిర్ణయించుకుంది.

అయితే వీళ్ళ కంటే చాలా ముందే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో ప్రమోషన్స్ మొదలుపెట్టడంతో సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్ పై ఒత్తిడి పడింది. ఇప్పటికే రెండు పాటలని వదిలిన అల వైకుంఠపురములో టీమ్ ఆ రెండు పాటలు సూపర్ హిట్ అవ్వడంతో గాల్లో తేలిపోతోంది. ఇదే ఊపులో నవంబర్ లో మరింత ప్రమోషనల్ మెటీరియల్ ను సిద్ధం చేస్తున్నారు టీమ్. ఈ నెలలో ఒక టీజర్, మూడో పాట విడుదల చేస్తారు. అల వైకుంఠపురములో ప్రమోషన్స్ విషయంలో ఇంత దూకుడుగా ఉండడంతో సరిలేరు నీకెవ్వరు టీమ్ కూడా ప్రమోషనల్ స్ట్రాటజీ మారుద్దామా అన్న ఆలోచనలో ఉన్నారట.

డిసెంబర్ నుండి మొదలుపెట్టే బదులు నవంబర్ సెకండ్ వీక్ నుండే ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ముందుగా చిత్ర టీజర్ ను వదిలి దాని ద్వారా అల వైకుంఠపురములో టీమ్ కు ప్రతి దాడి చేయాలని చూస్తున్నారు. అయితే ఇప్పటికే విపరీతమైన హైప్ ను తెచ్చుకున్న అల వైకుంఠపురములో టీమ్ పై ఒత్తిడి పెంచడం అంత సులువైన విషయమేం కాదు. ప్రస్తుతం ఈ ప్రపోజల్ ను మహేష్, అనిల్ రావిపూడి వద్దకు తీసుకెళ్ళిందిట ప్రమోషనల్ టీమ్. వాళ్ళు ఇంకా దాన్ని ధృవీకరించాల్సి ఉంది.

మరోవైపు మహేష్ బాబు, అనిల్ రావిపూడి అండ్ కో ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ కోసం కేరళ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తయిపోయింది. ప్రశాంతంగా షూటింగ్ ముగించుకుని వచ్చి అప్పుడు ప్రమోషన్స్ చేసుకుంటారో లేక ఒత్తిడికి తలొగ్గి ముందే ప్రమోషన్స్ మొదలుపెడతారో చూడాలి. ఏదేమైనా ప్రస్తుతం అల వైకుంఠపురములో టీమ్ దే పైచేయిగా కనపడుతోంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2qWMLqW

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...