Skip to main content

అసలు ప్రదీప్ కు ఏమైంది? అనారోగ్యం సమస్య కాదా?

Pradeep Latest Update
Pradeep Latest Update

యాంకర్ ప్రదీప్ కు తెలుగు బుల్లితెరపై ప్రత్యేక స్థానం ఉంది. అంచెలంచలుగా ఎదుగుతూ ప్రదీప్ ఈరోజు టాప్ యాంకర్స్ లో ఒకడిగా స్థిరపడ్డాడు. షోస్ లో హోస్ట్ గా చేయడమే కాకుండా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అనే సెలబ్రిటీ టాక్ షో ను సొంతంగా నిర్వహిస్తున్నాడు ప్రదీప్. ఈ షో నాలుగు సీజన్లుగా విజయవంతంగా రన్ అవుతోంది. ప్రదీప్ కామెడీ టైమింగ్, కామెడీ పేరిట అతి చేయకపోవడం, ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా షో రన్ చేయడం వంటివి అతణ్ణి టాప్ స్థాయిలో నిలబెట్టాయి. అయితే విజయవంతంగా తన కెరీర్ ను ముందుకు తీసుకెళుతున్న ప్రదీప్ కు సడెన్ గా ఏమైంది అంటూ అందరూ అనుకుంటున్నారు. దీనికి కారణం సడెన్ గా ప్రదీప్ బయట ఎక్కడా కనిపించకపోవడమే. ఢీ డ్యాన్స్ షో తో పాటు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా షో ను కూడా ప్రస్తుతం రన్ చేస్తోన్న ప్రదీప్ లైమ్ లైట్ కు దూరంగా వెళ్ళిపోయాడు.

ప్రదీప్ కు ఏదో అనారోగ్య సమస్య వచ్చిందని వార్తలు వచ్చాయి. ఢీ షో లో ప్రదీప్ స్థానంలో వచ్చిన యాంకర్ రవి కూడా ప్రదీప్ త్వరలోనే వస్తాడని ప్రస్తుతం తనకొచ్చిన అనారోగ్యానికి చికిత్స తీసుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు. అయితే ఆ కొన్నాళ్ళు చాలా రోజులుగా మారిపోయింది. అయినా ఎక్కడా ప్రదీప్ జాడ తెలియలేదు. అభిమానులు ఎంతలా ప్రదీప్ కోసం ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. దీంతో కొత్తగా ప్రదీప్ కు అనారోగ్య సమస్య ఒక్కటే కారణం కాదని, ఏదో సమస్యతో ప్రదీప్ ఇబ్బంది పడుతున్నాడంటూ సోషల్ మీడియాలో కొంత మంది వాదిస్తున్నారు.

ప్రదీప్ కు డెంగ్యూ వచ్చిందని వార్తలు వచ్చాయి. డెంగ్యూ అయి ఉంటే ఈ పాటికి కోలుకునేవాడు కదా అంటూ లాజిక్స్ తీస్తున్నారు. అయినా అనారోగ్య సమస్య కారణమైతే కనీసం సోషల్ మీడియాలో ఇదీ ఇబ్బంది అని పోస్ట్ చేసేవాడు, కానీ ప్రదీప్ సోషల్ మీడియాకు కూడా దూరంగా గడుపుతున్నాడు. దీంతో ప్రదీప్ అభిమానుల్లో అతనికి ఏమైంది అంటూ ఆందోళన కనిపిస్తోంది.

ఏదేమైనా ప్రదీప్ లేని లోటు బుల్లితెరపై బాగా తెలుస్తోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. వారు అన్నదాంట్లో కూడా లాజిక్ ఉంది. అనారోగ్య సమస్య చిన్నదైతే ఈపాటికి కోలుకుని తిరిగి వచ్చేవాడు. లేదా కనీసం అభిమానులకు ఏమైందో వివరణ ఇచ్చేవాడు. ఇలా ఏ సమాచారం లేకుండా ప్రదీప్ ఏమైపోయినట్లు అంటూ అందరూ అనుకోవడం ఎక్కువైంది. యాంకర్స్ లో ప్రదీప్ స్థాయి ఏంటనేది ఈ విషయం మరోసారి రుజువుచేస్తోంది. ఏదేమైనా ప్రదీప్ కు వచ్చిన సమస్య చిన్నదే అవ్వాలని, అతను త్వరలో తిరిగి రావాలని, తన పూర్వ వైభవాన్ని అందుకోవాలని మనం కోరుకుందాం.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2JW23D1

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...