Skip to main content

మహేష్ – కెజిఎఫ్ దర్శకుడు కాంబో.. అయ్యే పనేనా?

మహేష్ - కెజిఎఫ్ దర్శకుడు కాంబో.. అయ్యే పనేనా?
మహేష్ – కెజిఎఫ్ దర్శకుడు కాంబో.. అయ్యే పనేనా?

నిన్న ఎక్కడనుండి పుట్టుకొచ్చిందో తెలీదు కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు 27వ చిత్రం కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఉంటుందని వార్తలు మొదలయ్యాయి. ఈ వార్తలు ఏ రేంజ్ లో వచ్చాయంటే ఇక ఈ కాంబో పక్కా అన్న తరహాలో రావడంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకుని సంబరాలు చేసేసుకున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తన 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. టాకీ పార్ట్ ఇప్పటికే పూర్తయింది. ఇక బ్యాలెన్స్ సాంగ్స్ షూట్ మాత్రం మిగిలుంది. అవి కూడా ఈ నెలాఖరుకి పూర్తవుతాయని తెలుస్తోంది. మాస్ జనాలను ఆకట్టుకోవడానికి ఈ చిత్రంలో ఏకంగా రెండు స్పెషల్ సాంగ్స్ ను సిద్ధం చేస్తున్నాడు అనిల్ రావిపూడి. జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది.

సరిలేరు నీకెవ్వరు చిత్రం చివరి దశల్లో ఉన్నా కానీ మహేష్ బాబు ఇంకా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. ఎప్పుడూ ఒక సినిమా చివర్లో ఉండగానే తర్వాతి సినిమాను ప్రకటించే మహేష్ ఈసారి ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టేశాడు. సరిలేరు నీకెవ్వరు తర్వాత వెంటనే సినిమా చేయకుండా మరో మూడు నుండి నాలుగు నెలలు సినిమా నుండి బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. వీటిని మహేష్ భార్య నమ్రత ధృవీకరించింది కూడా. పిల్లలతో సమయం గడపడం, తర్వాతి సినిమా కోసం ప్రిపేర్ అవ్వడం కోసం ఈ బ్రేక్ ను వినియోగించుకుంటారని తెలిసింది. అంటే మహేష్ తన తర్వాతి సినిమాను మొదలుపెట్టడానికి కనీసం ఏప్రిల్ వరకూ సమయం పడుతుంది. సరిగ్గా ఈ పాయింట్ నుండే మహేష్ తర్వాతి సినిమా గురించి వార్తలు అల్లేశారు చాలా మంది. ఇప్పటికే కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మహేష్ టచ్ లో ఉన్న విషయాన్ని ఉపయోగించుకుని మహేష్ 27వ చిత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఉంటుందని ప్రచారం జరిగింది. అంతవరకూ అయితే బాగానే ఉండేది.

కానీ ఈ చిత్రం ప్యాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోందని, హిందీ, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారన్నది ఈ వార్త సారాంశం. మార్చ్ లేదా ఏప్రిల్ నుండి ఈ చిత్రం పట్టాలెక్కబోతోందట. ఈ వార్తలు ప్రముఖ న్యూస్ పేపర్లలో కూడా ప్రచురితమయ్యాయి. అయితే రూమర్ రాయుళ్లు ఇక్కడ ఒక లాజిక్ ను మిస్ చేసారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కెజిఎఫ్ 2 చిత్ర షూటింగ్ పనులతో బిజీగా ఉన్నాడు. ఈ షూటింగ్ పూర్తి కావడానికే మార్చ్ నెల అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ కోసం మరో మూడు నెలలు కచ్చితంగా అవసరమవుతాయి. అంటే అవన్నీ వదిలేసి మహేష్ సినిమాను మొదలుపెట్టేస్తాడా?

ప్రశాంత్ నీల్ తో మహేష్ సినిమా ఉంటుంది, కాకపోతే అది మహేష్ 27వ చిత్రం కాకుండా 28వ చిత్రంగా తెరకెక్కవచ్చు. ప్రశాంత్ నీల్ కంటే ముందు వంశీ పైడిపల్లితో సినిమా చేసే అవకాశముంది. అదీ మ్యాటరు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2NCc4Yn

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...