‘అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ సంస్థలో తొలి చిత్రం గా ‘మిస్ మ్యాచ్’ పేరుతొ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా ‘సలీం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. మిస్ మ్యాచ్ చిత్ర టీజర్ ను విక్టరీ వెంకటేష్ విడుదల చేసారు.
టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే ఈ లవ్ స్టొరీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని సమాచారం. ఆట కదరా శివ చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ శంకర్ ఈ సినిమాతో మరో సక్సెస్ కొట్టబోతున్నాడు. ఐశ్వర్య రాజేష్, ఉదయ్ శంకర్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయని తెలుస్తోంది. త్వరలో చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు మీడియాతో తెలుపునున్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/34lmDVg
Comments
Post a Comment