ఎప్పుడూ విలక్షణమైన కథలు, పాత్రలు ఎంచుకునే గోపీచంద్ ఈసారి కూడా మరో విభిన్నమైన కథతో మన ముందుకు వస్తున్నాడు. సంపత్ నంది దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమాకి “సీటీ మార్” అనే టైటిల్ అనుకుంటున్నారు. గోపీచంద్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. కబడ్డీ నేపధ్యంలో ఈ సినిమా ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో తమన్నా, గోపీచంద్ ఇద్దరూ, కబడ్డీ కోచ్ లుగా కనిపిస్తారు.
సంపత్ నందితో ఇంతకుముందు గోపీచంద్ “గౌతమ్ నంద” అనే సినిమా చేసారు. అదే విధంగా తమన్నతో సంపత్ నంది రచ్చ, బెంగాల్ టైగర్ సినిమాలు చేసారు. గోపీచంద్ కి హిట్ వచ్చి చాల కాలం అయ్యింది. “సాహసం” తరువాత గోపీచంద్ కి సరైన హిట్ రాలేదు. ఇటీవల విడుదల అయిన “చాణక్య” సినిమా ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. ప్రస్తుతం సంపత్ నంది దర్సకత్వం లో వస్తున్న ఈ సినీమాకు గోపీచంద్ రెమ్యునరేషన్ కూడా ముందు తీసుకోవడం లేదు. సంపత్ నంది కూడా తన గత చిత్రాలు హిట్ కాకపోవడంతో ఈ సినిమాను హిట్ చెయ్యాలని హార్డ్ వర్క్ చేస్తున్నాడు.
ఆల్ ది బెస్ట్ టూ గోపీచంద్ & సంపత్ నంది
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/36S078i
Comments
Post a Comment