Skip to main content

ఫేడ్అవుట్ హీరోయిన్లకు కాసులు కురిపిస్తున్న హాట్ వెబ్ సిరీస్ లు

digital streaming sites targets fadeout heroines for bold scenes
digital streaming sites targets fadeout heroines for bold scenes

డిజిటల్ స్ట్రీమింగ్ ఇప్పుడు బాగా ఊపందుకుంది. ఎంటర్టైన్మెంట్ మొత్తం మన గుప్పిట్లోకి వచ్చేసింది. సినిమాల కోసం థియేటర్లకు వెళ్లే పరిస్థితి పూర్తిగా తగ్గిపోయింది. సినిమా థియేటర్ లో విడుదలైన నెల రోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ సైట్లలో దర్శనమిస్తుండడంతో ఇక థియేటర్ కు ఎవరు వెళ్లారు? ఈ డిజిటల్ స్ట్రీమింగ్ సైట్లు కేవలం సినిమాలను ప్రదర్శించడమే కాకుండా వెబ్ సిరీస్ లను కూడా అందిస్తుండడం అదనపు ఆకర్షణ. కొత్త కొత్త కథాంశాలతో డేరింగ్ టేకింగ్ తో ఈ వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుంటున్నాయి. ఇలా రూపొందుతున్న వెబ్ సిరీస్ లలో ఎక్కువగా బూతు కంటెంట్ లేదా అడల్ట్ డైలాగులు ఎక్కువగా ఉంటున్నాయి. వీటికే ప్రేక్షకుల ఆదరణ దక్కుతోంది. ఎంత ఎక్కువ బూతు మాటలుంటే అంత బోల్డ్ గా తీసినట్లు లెక్క వేస్తున్నారు. ఇక స్కిన్ షో గురించి చెప్పేదేముంది. న్యూడిటీ తప్ప అంతా ఉంటుంది అందులోనే.

అయితే ఈ తరహా వెబ్ సిరీస్ లు ఫేడ్అవుట్ అయిన హీరోయిన్లకు భలే కలిసొస్తోందని చెప్పాలి. ఎలాగు సెన్సార్ లేకపోవడంతో ఇక కంట్రోల్ అన్నది ఈ వెబ్ సిరీస్ లకు లేదు. ఎలాంటి కంటెంట్ ను అయినా ప్రేక్షకులకు చూపించవచ్చు. అందుకే ఎక్కువగా అశ్లీల సీన్లు తీసేవారు ఎక్కువైపోయారు. వీటి వల్ల లాభాలు కూడా బాగుండడంతో ప్రొడక్షన్ హౌజ్ లు చాలా మటుకు ఇలాంటి వెబ్ సిరీస్ లు తీయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇలాంటి వెబ్ సిరీస్ లకు మొదట కావాల్సింది హీరోయిన్. బోల్డ్ గా నటించడానికి వీరు ఆల్రెడీ ఫేడ్అవుట్ అయిన హీరోయిన్లను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు లేక, సోషల్ మీడియాలో ఇప్పటికీ గ్లామర్ ఫోటోషూట్లు చేస్తూ టచ్ లో ఉన్న హీరోయిన్లను భారీ పారితోషికం ఆశ చూపి ఈ వెబ్ సిరీస్ లలో నటింపచేస్తున్నారు. సినిమా అవకాశాల కోసం చూసి అవి రాక ఇబ్బంది పడుతున్న హీరోయిన్లకు ఈ వెబ్ సిరీస్ లు మంచి ఆదాయ మార్గాలుగా మారాయి. సినిమాలకు ఏ మాత్రం తగ్గని రీతిలో వెబ్ సిరీస్ లలో పారితోషికాలు ఉంటుండడంతో వీరు కూడా బోల్డ్ గా నటించడానికి పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చెయ్యట్లేదు.

ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో సినిమా తారలు చాలా మంది నటిస్తున్నారు. నెమ్మదిగా సాంకేతిక వర్గం కూడా వెబ్ సిరీస్ లవైపు చూస్తోంది. హిందీ వాళ్ళు ఈ విషయంలో చాలా ముందున్నా, తెలుగులో కూడా ఈ మధ్యే మొదలైంది. ఇప్పటికే నాలుగు టాలీవుడ్ దర్శకులు కలిసి లస్ట్ స్టోరీస్ ను తెలుగులో తీస్తున్న విషయం తెల్సిందే. ఇప్పుడు సినిమాలకు ప్రత్యామ్నాయ ఎంటర్టైన్మెంట్ గా మారిన వెబ్ సిరీస్ లు త్వరలో సినిమాలను ఓవర్ టేక్ చేసినా ఆశ్చర్యం లేదు. ఇక్కడ రైటర్లకు, దర్శకులకు నచ్చింది తీసుకునే ఫ్రీడమ్ ఉండడంతో వెబ్ సిరీస్ ల హవా జోరుగా సాగుతోంది. ఈ ముసుగులో బోల్డ్ కంటెంట్ పేరిట ఫేడ్అవుట్ హీరోయిన్ల చేత శృంగార సన్నివేశాలను ఇష్టమొచ్చినట్లు చిత్రీకరిస్తున్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2JW2qNR

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...