మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా భావించిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ సైరా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. కలెక్షన్స్ పరంగా సినిమా చాలా వరకు ఫెయిల్ అనే చెప్పాలి. ఫ్యాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ చేసి మరి సినిమాను 5భాషల్లో రిలీజ్ చేశారు. కానీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంతగా లాభాలను అందించలేకపోయింది. మెగా ఫ్యాన్స్ కి ఆ రిజల్ట్ నిరాశనే మిగిల్చింది.
ఇక ఇప్పుడు ఎవరు లేనట్టు పాత హీరోయిన్ ని మెగాస్టార్ 152 సినిమా కోసం సెలెక్ట్ చేసుకుంటుండడం కాస్త ఇబ్బంది పెడుతున్న విషయం. గత కొంత కాలంగా కొరటాల శివ హీరోయిన్ విషయంలో చర్చలు జరిపి ఫైనల్ గా సీనియర్ హీరోయిన్ త్రిషను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ కాస్త చర్చలు మరికొంత మంది హోరోయిన్స్ లిస్ట్ ని చూపించినప్పటికి మొత్తానికి కొరటాల ఓటు త్రిషాకే పడిందట. ఇంకా ఫిక్స్ కాలేదు. చర్చలు జరుపుతున్నారు అని అంతా అనుకున్నప్పటికి దాదాపు ఆమెనే ఫైనల్ చేసేందుకు చిత్ర యూనిట్ అంతా సిద్ధమైనట్లు సమాచారం.
రేపో మాపో మెగాస్టార్ 152 ప్రాజెక్ట్ హీరోయిన్ విషయంపై కొణిదెల ప్రొడక్షన్ నుంచి క్లారిటీ రానుంది. ఫైనల్ గా ఈ సినిమాతో అయిన తెలుగు రాష్ట్రాల్లో సాలీడ్ హిట్ అందుకోవలని మెగాస్టార్ చిరంజీవి ప్లాన్ చేసుకుంటున్నాడు. కానీ త్రిష లాంటి పాత హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకోవడం అభిమానులకు మింగుడు పడటం లేదు. మరి దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాలో త్రిషను ఎంతవరకు అందంగా చూపిస్తాడో చూడాలి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2pvK5Aw
Comments
Post a Comment