మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా మంచి టాక్ తో విడుదలైనా యూఎస్ లో ఈ చిత్ర కలెక్షన్స్ ఆశించినంత స్థాయిలో లేకపోవడంతో అక్కడ భారీ నష్టాలు తప్పవనుకున్నారంతా. ప్రీమియర్స్ తోనే 1 మిలియన్ కు చేరువగా వచ్చిన సైరా మూడో రోజు నుండి డల్ అయింది. దీంతో 2 మిలియన్ అయినా సాధిస్తుందా అని ట్రేడ్ సందేహం వ్యక్తం చేసింది.
అయితే రెండో వారం కూడా సైరా వసూళ్లు ఆశాజనకంగా ఉండటం అక్కడి డిస్ట్రిబ్యూటర్లకు ఊరటనిస్తోంది. విడుదలై 11 రోజులు దాటిన సైరా 2.44 మిలియన్ డాలర్స్ సాధించి ఆల్ టైమ్ తెలుగు టాప్ 10 యూఎస్ గ్రాసర్స్ లో పదవ స్థానంలో నిలిచింది. సైరా, చిరంజీవి గత చిత్రం ఖైది నెం 150ను దాటి పదవ స్థానంలో నిలవడం విశేషం. ఖైది నెం 150 వసూళ్లు $2447043 అవ్వగా ఇప్పుడు సైరా వసూళ్లు $2448312.
ఆల్ టైమ్ టాప్ 10 హైయెస్ట్ గ్రాసర్స్:
బాహుబలి 2 : $20.57
బాహుబలి : $6.86
రంగస్థలం : $3.51
భరత్ అనే నేను : $3.41
సాహో : $3.23
శ్రీమంతుడు : $2.88
మహానటి : $2.54
గీతగోవిందం : $2.46
అ ఆ : $2.44
సైరా : $2.44
సైరా ఫుల్ రన్ ముగిసేసరికి మహానటి లైఫ్ టైమ్ కలెక్షన్స్ ను దాటి ఏడవ స్థానంలో నిలుస్తుందని ట్రేడ్ ఊహిస్తోంది. ఏదేమైనా కూడా దాదాపు 1 మిలియన్ వరకూ అక్కడి డిస్ట్రిబ్యూటర్ నష్టపోనున్నాడు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2VESrRQ
Comments
Post a Comment