Skip to main content

క్రిస్మస్ బరిలోకి దిగిన రాజ్ తరుణ్ – అంతా దిల్ రాజు ప్లానింగ్

క్రిస్మస్ బరిలోకి దిగిన రాజ్ తరుణ్ - అంతా దిల్ రాజు ప్లానింగ్
క్రిస్మస్ బరిలోకి దిగిన రాజ్ తరుణ్ – అంతా దిల్ రాజు ప్లానింగ్

ఏదైనా దిల్ రాజు ప్లానింగ్ వేరుగా ఉంటుంది. అందుకే ఇన్నేళ్ళుగా దిల్ రాజు విజయవంతమైన నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగగలుగుతున్నాడు. ఏడాదికి ఆరేడు సినిమాలు కూడా రిలీజ్ చేయగల దమ్మున్న నిర్మాతగా పేరొందిన దిల్ రాజు వాటి రిలీజ్ లను ఒకటిదానికొకటి క్లాష్ అవ్వకుండా మంచి సీజన్ చూసి విడుదల చేసుకోగలడు. అందుకే దిల్ రాజుకు సక్సెస్ రేట్ ఎక్కువ. ఇప్పుడు ఈ ఉదాహరణ ఎందుకంటే ప్రస్తుతం దిల్ రాజు డైరెక్ట్ గా నిర్మాణంలో భాగమైన రెండు సినిమాలు ఇద్దరి లోకం ఒకటే, 96 రీమేక్ ల రిలీజ్ డేట్ లను చాకచక్యంగా మార్చి తన నేర్పరితనాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇద్దరి లోకం ఒకటే. షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం నవంబర్ లో విడుదల కావాల్సి ఉంది. అయితే నవంబర్ రిలీజ్ అంటే మార్కెట్ కూడా అంత సహకరించదు. అయితే డిసెంబర్ కు రిలీజ్ డేట్ మారుద్దాం అనుకుంటే దిల్ రాజు నిర్మాణంలోనే శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 96 రీమేక్ ఉండనే ఉంది. ఈ చిత్రంపై దిల్ రాజు చాలానే ఆశలు పెట్టుకున్నాడు. ఎంతో ఇష్టపడి ఈ సినిమా హక్కులను కొనుక్కుని ఒరిజినల్ డైరెక్ట్ చేసిన దర్శకుడినే ఏరి కోరి ఈ సినిమాకు పెట్టుకున్నాడు. అయితే అనుకోకుండా ఈ సినిమా షెడ్యూల్స్ లో తేడా వచ్చేసింది. సమంత పార్ట్ షూటింగ్ పూర్తయింది కానీ శర్వానంద్ వి బ్యాలెన్స్ ఉన్నాయి. డిసెంబర్ రిలీజ్ కాబట్టి ఈలోగా షూట్ చేసేద్దామా అంటే శర్వానంద్ డేట్స్ ఖాళీగా లేవు. నవంబర్ అంతా ఆల్రెడీ కమిట్మెంట్ ఉంది. సో, 96 రీమేక్ డిసెంబర్ రిలీజ్ ను అందుకోవడం కష్టమే.

ఇక చేసేదేం లేక 96 రీమేక్ రిలీజ్ ను ఫిబ్రవరికి మార్చేశాడు దిల్ రాజు. ఈలోగా శర్వానంద్ కూడా ఫ్రీ అవుతాడు కాబట్టి డిసెంబర్ లో షూట్ చేసుకుని తీరిగ్గా ఫిబ్రవరికి రిలీజ్ పెట్టుకోవచ్చు. జనవరిలో కూడా రిలీజ్ ల హడావిడి ఎక్కువగా ఉంది. దిల్ రాజు నిర్మాణంలో ఇన్వాల్వ్ అయిన సినిమాలే రెండు ఉన్నాయి. ఈ హడావిడిలో ఒకదానికొకటి క్లాష్ అవ్వకుండా ఫిబ్రవరి అంటే సినిమాల రిలీజ్ లు తక్కువ ఉంటాయి కాబట్టి ఫిబ్రవరి నెలకు 96 రీమేక్ ను షిఫ్ట్ చేసాడు.

కాబట్టి, ఇప్పుడు తన ఖాతాలో ఉన్న డిసెంబర్ స్లాట్ ఖాళీగా ఉంది కాబట్టి అందులోకి ఇద్దరి లోకం ఒకటేను రిలీజ్ చేయాలని డిసైడ్ అయిపోయాడు. ఆ రకంగా అన్ సీజన్ లో రిలీజ్ కావాల్సిన ఇద్దరి లోకం ఒకటే ఇప్పుడు క్రిస్మస్ కు రిలీజవుతోంది. ఆల్రెడీ డిసెంబర్ 20న నందమూరి బాలకృష్ణ, రూలర్, సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజూ పండగే చిత్రాలు రిలీజ్ డేట్స్ ప్రకటించేసుకుని ముస్తాబవుతున్నాయ. అదే రోజు విడుదల చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి డిసెంబర్ 25న ఇద్దరి లోకం ఒకటేను విడుదల చేయాలని దిల్ రాజు నిర్ణయించాడు. ఇలా అయితే డిసెంబర్ 25, జనవరి 1, మొదటి వారంలో రెండు రోజులు పబ్లిక్ హాలిడేస్ వస్తాయి. సో వర్కౌట్ అవుతుందని అని ఆశపడుతున్నాడు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2osXs3G

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...