Skip to main content

ఢిల్లీ బాబు మళ్ళీ వస్తాడంటున్న ఖైదీ దర్శకుడు

lokesh kanagaraj
lokesh kanagaraj

కార్తీకి విభిన్నమైన చిత్రాలు ఎంచుకుంటాడన్న పేరుంది. ఖైదీ చిత్రంతో మరోసారి ఈ విషయాన్ని స్పష్టం చేసాడు. హీరోయిన్ లేకుండా, పాటలు లేకుండా, అసలు మనకలవాటైపోయిన కమర్షియల్ హంగులు ఏవీ లేకుండా ఒక సినిమా చేయాలంటే నిజంగా గట్స్ ఉండాలి. లోకేష్ కనకరాజ్ చెప్పిన కథను నమ్మి కార్తీ చేసిన చిత్రం ఖైదీ. మా నగరం వంటి సూపర్ సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన లోకేష్, తన రెండో ప్రయత్నంగా చేసిన చిత్రం ఖైదీ. లోకేష్ టెరిఫిక్ రైటింగ్ కు కార్తీ అద్భుతమైన నటన తోడవ్వడంతో ఖైదీ అందరికీ తెగ నచ్చేస్తోంది. అందరూ మస్ట్ వాచ్ అంటూ ఈ చిత్రాన్ని రికమెండ్ చేస్తున్నారు.

నిజానికి ఖైదీ చిత్రాన్ని ఎవరూ ఫస్ట్ ఆప్షన్ గా పెట్టుకోలేదు. భారీ హంగులతో వస్తున్న బిగిల్ (తెలుగులో విజిల్) వైపే ఆకర్షితులయ్యారు అందరూ. పైగా ఖైదీ చిత్రాన్ని ఓ రేంజ్ వరకే పరిమితం చేసారు టీం. దీంతో బిగిల్ వైపే మొదట ప్రేక్షకులు క్యూ కట్టారు. ఖైదీ చిత్రానికి మొదటిరోజు మొదటి రెండు ఆటలు దాదాపు 25 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉంది. అయితే ఫస్ట్ షో నాటికి మౌత్ టాక్ బలంగా స్ప్రెడ్ అవ్వడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. చాలా చోట్ల ఈ చిత్రానికి ఫస్ట్ షో నుండి హౌజ్ ఫుల్స్ పడ్డాయి. రెండో రోజు ఇదే ట్రెండ్ కంటిన్యూ అయింది.

బిగిల్/ విజిల్ లో హడావిడి ఎక్కువ విషయం తక్కువని తేలింది. ఇది కేవలం విజయ్ ఫ్యాన్స్ కోసం సినిమాగా చూసిన వాళ్లకు అనిపించింది. కంటెంట్ బాగ్ వీక్ గా ఉంది. అయినా విజయ్ మ్యానరిజమ్స్ తో మ్యానేజ్ చేయడం వల్ల బిగిల్ చివరికి హిట్ అనిపించుకుంటుంది. మరోవైపు ఖైదీ పెద్ద హడావిడి లేకుండా సూపర్బ్ కంటెంట్ తో మన ముందుకు వచ్చింది. తెలుగులో 5 కోట్లకు బిజినెస్ జరిగిన ఈ చిత్రం ప్రస్తుతం వచ్చిన టాక్ తో ఈజీగా రికవర్ చేసేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఖైదీలో ఓపెన్ ఎండింగ్ ఇవ్వడం ప్రేక్షకులకు ఆసక్తి కలిగించింది. ఈ చిత్రానికి సీక్వెల్ లేక ప్రీక్వెల్ తీయొచ్చంటూ ప్రేక్షకుల నుండి స్పందన మొదలైంది. చాలా మంది దర్శకుడ్ని ఈ విషయంపై ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో క్లారిటీ ఇవ్వడానికి దర్శకుడు లోకేష్ కనకరాజ్ ముందుకొచ్చాడు. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందో ప్రీక్వెల్ ఉంటుందో ఇప్పుడే చెప్పలేనని, కానీ ఢిల్లీ బాబు మళ్ళీ వస్తాడని మాత్రమే చెప్పగలగని అన్నాడు.

ఖైదీలో ఢిల్లీ బాబు 10 ఏళ్ళు జైల్లో గడిపినట్లు మాత్రమే చెప్తాడు. 10 ఏళ్లకు ఢిల్లీ బాబు ఏం చేసేవాడో ఏదో ఒక ముక్కలో చెప్పేస్తాడు. లాస్ట్ లో విలన్ ఖైదీని చూసి ఎందుకు స్టన్ అయిపోతాడో కూడా తెలీదు. వీరిద్దరి మధ్య కూడా ఏదో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. ఇవన్నీ ఖైదీ చూసిన ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తున్నాయి. కానీ ఖైదీ 2 చూడాలంటె ఈజీగా మరో 3 లేదా 4 ఏళ్ళు ఎదురుచూడక తప్పదు. ఎందుకంటే లోకేష్ తన నెక్స్ట్ సినిమా విజయ్ హీరోగా చేయబోతున్నాడు. దీపావళికి ఇద్దరూ పోటీ పడి ఇప్పుడు ఇద్దరూ కలిసి పనిచేయబోతున్నారన్నమాట



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2olCJid

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...