సుకుమార్ కు క్రియేటివ్ దర్శకుడిగా మంచి పేరుంది. రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు సుకుమార్. ఈ చిత్రం 100 కోట్ల కలెక్షన్స్ ను అధిగమించింది. మైత్రి మూవీస్ సంస్థకు భారీ లాభాలను తెచ్చి పెట్టింది రంగస్థలం. అయినా కానీ సుకుమార్ కు నెక్స్ట్ సినిమాను సెట్ చేయడానికి చాలా సమయం పట్టింది. ముందు మహేష్ బాబు కోసం కథ అనుకుని నెలల తరబడి దాని మీద వర్క్ చేసి మొత్తానికి రెడీ చేసుకుని వెళితే మహేష్, తనకు మధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
అయితే వెంటనే అదే ప్రాజెక్ట్ అల్లు అర్జున్ తో సెట్ అయింది. మైత్రి మూవీస్ సంస్థ తొలి నుండి ఈ ప్రాజెక్ట్ కు నిర్మాతగా ఉంది. స్క్రిప్ట్ తయారుచేసే దశలోనే ఈ ప్రాజెక్ట్ కు కోట్లల్లో ఖర్చయింది. బోలెడంత సమయం కూడా వృథా అయింది. అయినా కానీ మైత్రి సంస్థ సుకుమార్ మీద నమ్మకంతో పెట్టుబడి పెట్టింది. ప్రీ ప్రొడక్షన్ దశలోనే బోలెడంత ఖర్చైనా కానీ మైత్రి ఒక్క మాట మాట్లాడలేదు. సినిమాకు మంచి లాభాలు వస్తే అదే చాలు అనుకుంది.
నిజానికి సుకుమార్ మీద ఆ సంస్థకు ఉన్న గురి అది. రంగస్థలం వంటి పెద్ద హిట్ ఇచ్చినందుకు సుకుమార్ మీద అపార గౌరవం చూపుతోందీ నిర్మాణ సంస్థ. తమ చిత్రాలన్నిటిలోనూ సుకుమార్ ను ఇన్వాల్వ్ చేస్తోంది. సలహాలు తీసుకుంటోంది. సుకుమార్ భవిష్యత్ ప్రాజెక్టుల విషయంలో నిర్మాణ భాగస్వామి అవ్వాలని కోరుకుంటోంది. ఎలా అయితే త్రివిక్రమ్ చేసే ప్రతి సినిమా వెనకాల హారిక అండ్ హాసిని సంస్థ ఉంటుందో అలా సుకుమార్ వెనకాల మైత్రి సంస్థ అన్నమాట. సుకుమార్ సినిమా కోసం బాగా ఖర్చు పెట్టిస్తాడు. అయితే తన సినిమాల్లో ఏదొక స్పెషలిటీ ఉంటుంది. అది కనుక క్లిక్ ఐతే సినిమా రిజల్ట్ బ్లాక్ బస్టర్ కు తక్కువగా ఉండదు. అందుకే సుకుమార్ సినిమాలు అయితే సూపర్ హిట్లు లేకపోతే అట్టర్ ప్లాపులు అన్న తరహాలో ఉంటుంది.
ఇక బన్నీ – సుకుమార్ ప్రాజెక్టు విషయానికొస్తే ఎప్పుడో సినిమా ప్రకటన జరిగినా స్క్రిప్ట్ లో మార్పులు అంటూ బన్నీ ఇంత కాలం ఫైనల్ చేయలేదు. అయితే ఎట్టకేలకు రెండు, మూడు కండిషన్స్ తో ఈ చిత్రానికి ఎస్ చెప్పేసాడు. ఒకటి సుకుమార్ ఈ చిత్రాన్ని ఆరే నెలల్లో పూర్తి చేసి సమ్మర్ కు విడుదల చేయాలి. రెండోది ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామిగా ముత్తంశెట్టి మీడియాను చేర్చుకోవాలి. అల్లు అర్జున్ అమ్మ తరుపు బంధువులదే ఈ ముత్తంశెట్టి మీడియా. నా పేరు సూర్య సినిమాకు నాగబాబును పార్ట్నర్ ను చేసి హెల్ప్ చేసిన అల్లు అర్జున్ ఈసారి అమ్మ తరుపు బంధువులను నిర్మాణ భాగస్వామిని చేసి హెల్ప్ చేస్తున్నాడు. అంటే వీరు నిర్మాణంలో జోక్యం చేసుకోరు. లాభాలు వస్తే వాటా తీసుకుంటారంతే. ఇలా మైత్రి లాభాలను ఆశించి సుకుమార్ ను నమ్ముకుంటే బన్నీ వచ్చి దానికి గండి కొట్టాడన్నమాట.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/32YF8OZ
Comments
Post a Comment