Skip to main content

విజయ్ దేవరకొండతో పూరి బాలీవుడ్ మాస్టర్ ప్లాన్ అదిరిపోయిందిగా!

విజయ్ దేవరకొండతో పూరి బాలీవుడ్ మాస్టర్ ప్లాన్ అదిరిపోయిందిగా!
విజయ్ దేవరకొండతో పూరి బాలీవుడ్ మాస్టర్ ప్లాన్ అదిరిపోయిందిగా!

పూరి జగన్నాథ్ కు డాషింగ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో పేరుంది. హీరోలను సరికొత్తగా ప్రెజంట్ చేయడంలో, కంప్లీట్ మేకోవర్ ఇవ్వడంలో పూరి సిద్ధహస్తుడు. అంతేకాకుండా తన సినిమాల్లో హీరోలు డైనమిక్ గా ఒకరకమైన యారగన్స్ మైంటైన్ చేస్తుంటారు. అయితే గత కొంత కాలంగా పూరి ఫామ్ పరంగా చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇక తన పనైపోయిందన్నారు. అయితే పడడం, లేవడం పూరికి కొత్తేమీకాదు. తన పనైపోయిందన్న ప్రతిసారి విమర్శకుల పని పడుతూ పూరి జగన్నాథ్ బ్లాక్ బస్టర్స్ ను అందించాడు.

ఈసారి కూడా పూరి జగన్నాథ్ అదిరిపోయే రీసౌండింగ్ హిట్ ఇచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ తో విమర్శకుల నోళ్లు మోయించాడు. ఇస్మార్ట్ శంకర్ తో పూరి జగన్నాథ్ కూడా కలలో ఊహించని హిట్ అందింది. నిన్నటితో ఈ చిత్రం 100 రోజుల రన్ కూడా పూర్తి చేసుకుంది. ఇటీవలే బుల్లితెరపై ప్రదర్శింపబడ్డ ఈ చిత్రం అదిరిపోయే టీఆర్పీ రేటింగ్స్ ను సొంతం చేసుకుంది. ఆంధ్ర, తెలంగాణ కలిపి మొత్తం 14.44 టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. జీ5 యాప్ లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఇంత సాలిడ్ హిట్ ఇచ్చిన పూరి జగన్నాథ్ తన తర్వాతి చిత్రాన్ని విజయ్ దేవరకొండతో చేస్తున్న విషయం తెల్సిందే.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం డిసెంబర్ నుండి షూటింగ్ మొదలవుతుంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్, హీరో చిత్రాల చిత్రీకరణ పూర్తైన తర్వాతే ఇది మొదలవుతుంది. దీనికి ఇంకా సమయం ఉండడంతో పూరి పక్కా స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నాడు. మరోవైపు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. ఇక్కడే పూరి జగన్నాథ్ మాస్టర్ ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ అందాల తార దివంగత శ్రీదేవి కూతురు జాన్వీని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో జాహ్నవి మాట్లాడుతూ సౌత్ లో విజయ్ దేవరకొండతో పని చేయాలని ఉందని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. సరిగ్గా ఇప్పుడు ఇదే మాటను పట్టుకుని పూరి జాన్వీని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికోసం తన బాస్ వర్మ సహాయం కూడా తీసుకుంటున్నాడట. ఒకవేళ జాన్వీ కనుక ఎస్ అంటే ఈ చిత్రాన్ని తెలుగు – హిందీ భాషల్లో తెరకెక్కించాలని భావిస్తున్నాడు. అర్జున్ రెడ్డిని హిందీలో తీసే సమయంలో విజయ్ దేవరకొండ పేరు బాలీవుడ్ లో బాగానే హల్చల్ చేసింది. ఈ క్రేజ్ ను, జాన్వీ ఫ్యాక్టర్ ను ఉపయోగించుకోవాలని పూరి భావిస్తున్నాడు.

ఈ సినిమా కనుక బాలీవుడ్ లో హిట్ అయితే సల్మాన్ ఖాన్ తో చిత్రం చేసే అవకాశం మెరుగవుతుంది. ఎలాగు సల్మాన్ పూరితో సినిమా చేయడానికి సుముఖంగానే ఉన్నాడు కానీ హిందీ సినిమాను హ్యాండిల్ చేయగలడా అని ఆలోచిస్తున్నాడు. ఇలా ఒకే దెబ్బతో రెండు పిట్టల్ని కొట్టాలని పూరి భావన. ఎందుకంటే శ్రీదేవి కూతురు జాన్వీ సౌత్ లో చేస్తున్న ఫస్ట్ సినిమా అంటే ఇక్కడ కూడా చిత్రానికి ఫుల్ క్రేజ్ వస్తుంది. ఎంతైనా పూరి మామూలోడు కదబ్బా.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/344sBty

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...