Skip to main content

చేసిన తప్పే మళ్ళీ చేస్తున్న పూజ హెగ్డే

చేసిన తప్పే మళ్ళీ చేస్తున్న పూజ హెగ్డే
చేసిన తప్పే మళ్ళీ చేస్తున్న పూజ హెగ్డే

అవకాశాలు వస్తున్న చోటుని వదులుకుని లేని చోట తాపత్రయపడడాన్ని ఏమంటారు? మీకు తెలీకపోతే ఒకసారి పూజ హెగ్డేను అడిగితే తెలుస్తుంది. ఎందుకంటే తెలుగులో ఆమెకు బంగారం లాంటి అవకాశాలు బోలెడు వస్తున్నాయి. కానీ ఆమె చూపు మాత్రం బాలీవుడ్ వైపే ఉంది. పూజ హెగ్డేకు మొదటినుండి బాలీవుడ్ లో సక్సెస్ అవ్వాలనే కల. తెలుగులోనే ఆమె డెబ్యూ జరిగినా ఆమె మాత్రం బాలీవుడ్ లో ప్రయత్నాలను కొనసాగించింది. ఇక్కడ వరసగా ముకుంద, ఒక లైలా కోసం సినిమాలను చేసింది పూజ హెగ్డే. నిజానికి ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడింది లేదు. ముకుంద ప్లాప్ అవ్వగా, ఒక లైలా కోసం యావరేజ్ గా ఆడింది. అయినా కానీ పూజ హెగ్డే తెలుగు ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. చూడటానికి అందంగా ఉండడం, కొంచెం హైట్ కూడా ఉండడంతో పొడుగ్గా ఉండే హీరోల పక్కన పెర్ఫెక్ట్ గా సెట్ అవుతుందన్న భావన కలిగించింది పూజ హెగ్డే.

అయితే సరిగ్గా తెలుగులో పుంజుకునే టైమ్ లో బాలీవుడ్ లో అవకాశమొచ్చిందని వెళ్లిపోయింది. హృతిక్ రోషన్ సరసన మోహెన్ జోదారో సినిమాలో నటించింది. దీని కోసం టాలీవుడ్ కు దాదాపు రెండేళ్లు దూరం కావాల్సి వచ్చింది. ఈ రెండేళ్లు టాలీవుడ్ లోనే ఉండుంటే ఆమె అప్పుడే స్టార్ హీరోయిన్ అయిపోయేది. ఏదైతేనేం డీజే సినిమాతో మళ్ళీ టాలీవుడ్ లోకి స్టన్నింగ్ ఎంట్రీ ఇచ్చింది పూజ హెగ్డే. ఇక అక్కడినుండి ఆమె వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు క్యూ కట్టాయి. మహేష్ తో మహర్షి చేసింది. ప్రభాస్ సరసన జాన్ సినిమాకు ఎంపికైంది. దాదాపు 30 రోజుల కాల్ షీట్స్ కు ఆమెకు కోటిన్నర దాకా చెల్లిస్తున్నారు ఇక్కడి నిర్మాతలు. మళ్ళీ అదనంగా తన స్టాఫ్ కు 25 లక్షలు చెల్లించాలి. ఇంత సౌకర్యవంతంగా ఇక్కడ ఉంటే ఆమె మళ్ళీ బాలీవుడ్ కలలే కంటోంది.

ఇటీవలే పూజ హెగ్డే హిందీలో చేసిన హౌస్ ఫుల్ 4 విడుదలైంది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రంలో పూజ హెగ్డే కాకుండా కృతి సనన్, కృతి కర్బందా కూడా హీరోయిన్స్ గా నటించారు. మరో ఇద్దరు హీరోయిన్స్ ఉండడంతో పూజకు స్పెషల్ గా దక్కిన గుర్తింపంటూ ఏం లేదు. కృతి కర్బందాకు ఉన్న స్క్రీన్ స్పేస్ కూడా ఈమెకు దక్కలేదు. దీనికోసం ఆమె మూడు నెలలు లాక్ అయిపోయింది. పైగా హిందీ సినిమా అంటే ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేయాలి. దానికోసం ఏకంగా నెల రోజులు కేటాయించింది. ఇక్కడ ఆమెకు ఉన్నంత హోదా అక్కడ ఆమెకు దక్కదు. పైగా హౌస్ ఫుల్ 4 ఒప్పుకోవడం ఇక్కడ రెండు పెద్ద సినిమాలను వదిలేసుకోవాల్సి వచ్చింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. కానీ పూజ హెగ్డే మాత్రం దీపం గురించి పట్టించుకోకుండా గాలికి వదిలేస్తోంది. అది కనుక ఆరిపోతే ఇక అంతే సంగతులు. చెప్పిన సామెత అర్థమైందిగా. లేదంటే దీపం స్థానంలో తెలుగు సినిమాను పెట్టి మళ్ళీ చదవండి. ఇక్కడ అవకాశాలు తగ్గితే మొదటికే మోసం వస్తుంది. కాదంటారా?



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2pcC1Va

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...