Skip to main content

బిగ్ బాస్ టైటిల్ ప్రకటించేది ఎవరు?

బిగ్ బాస్ టైటిల్ ప్రకటించేది ఎవరు?
బిగ్ బాస్ టైటిల్ ప్రకటించేది ఎవరు?

వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో మరో సీజన్ పూర్తి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. మరో 8 రోజుల్లో బిగ్ బాస్ పూర్తి కానుంది. ఇప్పటికే రాహుల్, బాబా భాస్కర్, శ్రీముఖి ఫైనల్స్ కు చేరుకున్నారు. ఇక మిగిలిన ముగ్గురు వరుణ్, అలీ, శివజ్యోతిలలో ఒకరు ఎలిమినేట్ అయి మరో ఇద్దరు ఫైనల్స్ కు చేరుకుంటారు. ఈరోజు ఎపిసోడ్ లో అది కూడా తెలిసిపోతుంది. ఇక ఫైనల్స్ కు చేరిన ఐదుగురిలో తర్వాత వారం ఎపిసోడ్ లో ఒకరు బిగ్ బాస్ 3 టైటిల్ ను గెలుచుకుంటారు. అయితే బిగ్ బాస్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. అలాగే ఈసారి టైటిల్ ను ప్రకటించేది హోస్ట్ నాగార్జున కాదు.

నాగార్జున ఫైనల్ వీక్ ను కూడా హోస్ట్ చేసినా టైటిల్ ప్రకటించే సమయానికి మరొక సూపర్ గెస్ట్ వచ్చి బిగ్ బాస్ విజేతను ప్రకటిస్తారు. ఈ స్పెషల్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అక్కినేని నాగార్జున స్వయంగా వెళ్లి చిరంజీవిని ఫైనల్ వీక్ కు ఆహ్వానించాడట. చిరంజీవి కూడా ఈ విషయంలో పాజిటివ్ గా రెస్పాండ్ అయి కచ్చితంగా వస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. సైరా ఫైనల్ రన్ కు చేరుకుంటుండడం, ఇంకా కొరటాల శివ సినిమా మొదలుకావడానికి సమయం ఉండడంతో ఒకరోజును బిగ్ బాస్ కోసం కేటాయించడం చిరంజీవికి సులువైంది.

దీంతో బిగ్ బాస్ సీజన్ 3 లాస్ట్ డే నాడు చిరంజీవి, నాగార్జున కలిసి బిగ్ బాస్ ను నడిపించబోతున్నారు. మొదటి రెండు సీజన్లతో పోలిస్తే ఈసారి బిగ్ బాస్ మరింత వినూత్నంగా ఉండేలా బిగ్ బాస్ యాజమాన్యం ప్రణాళికలు వేస్తోంది. లాస్ట్ వీక్ కు వచ్చినా ప్రేక్షకులకు నచ్చేలా, టిఆర్పిలో భారీగా నమోదయ్యేలా వ్యూహాలు రచించింది బిగ్ బాస్ టీమ్. ఇప్పటికే లాస్ట్ వీక్ ఏ విధంగా సాగాలి అనే దాని మీద షెడ్యూల్ మొత్తం సిద్ధమైపోయిందట. బిగ్ బాస్ 3 లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కు ఆహ్వానాలు పంపుతున్నారట. లాస్ట్ డే నాడు అందరూ ఉండేలా బిగ్ బాస్ యాజమాన్యం చూస్తోందని తెలుస్తోంది.

ఇది పక్కన పెడితే ఈరోజు ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు, మిగిలిన ముగ్గురిలో ఎవరు ఫైనల్స్ కు చేరతారన్నది ఆసక్తికరంగా మారింది. నిన్న సోషల్ మీడియాలో శివజ్యోతి ఎలిమినేట్ అయిపోయిందని వార్తలు వచ్చాయి. ఐతే అలీ కూడా ఎడ్జ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి వార్తలు వచ్చినట్లు నిజంగానే శివజ్యోతి ఎలిమినేట్ అయిపోయిందా లేక అలీ ఎలిమినేట్ అయ్యాడా అనేది మరికొద్ది గంటల్లో తెలిసిపోతుంది. వరుణ్ అయితే ఫైనల్స్ కు చేరినట్టేనని చెబుతున్నారు. ఎవరు ఫైనల్స్ కు చేరినా లాస్ట్ సీజన్ టైప్ లో క్లియర్ విన్నర్ ఎవరనేది ముందే ఊహించడం చాలా కష్టం. లాస్ట్ టైమ్ అయితే కౌశల్ షో ను వన్ సైడ్ చేసేసాడు. షో పూర్తవ్వడానికి చాలా ముందే కౌశల్ విన్నర్ అని తేలిపోయింది.

మరి ఈసారి ఎవరు టైటిల్ గెలుచుకుంటారో చిరంజీవి చేతుల మీదుగా బిగ్ బాస్ టైటిల్ గెలుచుకునే ఆ అదృష్టవంతులు ఎవరనేది వచ్చే ఆదివారమే తెలుస్తుంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2pg44Tm

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...