Skip to main content

“రాములో రాముల” అల్లు అర్జున్ వాయిస్ తో…

"రాములో రాముల" అల్లు అర్జున్ వాయిస్ తో...
“రాములో రాముల” అల్లు అర్జున్ వాయిస్ తో…

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న అల వైకుంఠపురములో 2020 సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెల్సిందే. ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ విషయంలో అగ్రసివ్ గా వెళ్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ చిత్రంలో ఒక పాటను విడుదల చేసారు. అది రికార్డుల మీద రికార్డులను తిరగరాస్తోన్న విషయం తెల్సిందే. పాట విడుదలైన నెల రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ సాధించి తెలుగు పాటల్లో సరికొత్త రికార్డును సృష్టించింది. లైక్స్ విషయంలో కూడా 750K+ లైక్స్ తో దూసుకుపోతోంది. త్వరలోనే 1 మిలియన్ లైక్స్ 100 మిలియన్ వ్యూస్ వస్తాయని చిత్ర టీమ్ ఆశిస్తోంది. ఈ పాట ప్రమోషన్స్ కు బాగా ఉపయోగపడిన విషయం తెల్సిందే. గత నెల రోజులనుండి సినీ ప్రియులందరూ ఈ పాట గురించే డిస్కస్ చేస్తున్నారు.

నిత్య యవ్వనుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ పాటను థమన్ సంగీత స్వర కల్పనలో లేటెస్ట్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ పాట యూట్యూబ్ లో రికార్డులనే కాక, ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో సైతం ఎక్కువగా ప్లే అవుతూ సంచలనం సృష్టిస్తోంది. ఈలోగానే అల వైకుంఠపురములో టీమ్ మరో ప్రమోషనల్ మెటీరియల్ ను దింపుతున్నారు. ఈ చిత్రంలోని సెకండ్ సాంగ్ ‘రాములో రాముల’ను దీపావళి సందర్భంగా ఈరోజు విడుదల చేయనున్నారు.

నాలుగు రోజుల క్రితం రాములో రాముల సాంగ్ వీడియో టీజర్ ను విడుదల చేయగా దానికి కూడా అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ట్యూన్ చాలా క్యాచీగా ఉన్నట్లు టీజర్ వింటుంటేనే అర్ధమైపోతుంది. “రాములో రాముల నన్ను ఆగం చేసిందిరో.. రాములో రాముల నా పాణం తీసిందిరో” అంటూ సాగే ఈ సాంగ్ ఈరోజు సాయంత్రం యూట్యూబ్ లో విడుదల కానుంది. టాలెంటెడ్ సింగర్ అనురాగ్ కులకర్ణి ఈ పాటను పాడగా, కాసర్ల శ్యామ్ దీనిని రచించారు. థమన్ ఈ పాట కూడా సెన్సేషన్ అవుతుందని ఆశిస్తున్నాడు.

ఈ పాట వీడియో సాంగ్ టీజర్ కూడా యూట్యూబ్ లో హల్చల్ చేసింది. నాలుగు రోజుల్లోనే ఈ టీజర్ 6 మిలియన్ వ్యూస్, 200K+ లైక్స్ తో మోస్ట్ వ్యూడ్, మోస్ట్ లైక్డ్ వీడియో టీజర్ గా రికార్డులకెక్కింది. ఇలా తమ ప్రతీ ప్రమోషనల్ స్ట్రాటజీ వర్క్ అవుతున్నందుకు చిత్ర టీమ్ ఫుల్ హ్యాపీగా ఉంది. అన్నట్టు ఈ పాటకు మరో అట్రాక్షన్ కూడా ఉందండోయ్.. ఈ పాట అల్లు అర్జున్ వాయిస్ ఓవర్ తో రానున్నట్లు చిత్ర బృందం కొద్ది సేపటి క్రితం ప్రకటించారు. బన్నీ వాయిస్ ఓవర్ కాబట్టి అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరింత ఆతృతగా ఈ పాట కోసం ఎదురుచూస్తున్నారు.

అల్లు అర్జున్ వాయిస్ ఓవర్ ఏ విధంగా ఉండబోతోందో అని ఫ్యాన్స్ మధ్య డిస్కషన్స్ కూడా మొదలైపోయాయి. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ అయిన నివేద పేతురాజ్ లుక్ కూడా ఈ సెకండ్ సాంగ్ రిలీజ్ సందర్భంగా విడుదల చేసారు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, చిత్రలహరి వంటి చిత్రాలతో టాలెంటెడ్ హీరోయిన్ అనిపించుకున్న నివేదకు ఈ చిత్రంలో ఎటువంటి రోల్ ఇచ్చారో అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకూ చిన్న చిత్రాలే చేస్తూ వచ్చిన నివేదకు ఇది నిజంగా మంచి అవకాశమే. ఇందులో ఈ భామకు మంచి రోల్ పడితే ఇక ఆమె కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు.

Credit: Twitter



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2WmHepu

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...