Skip to main content

బాబా భాస్కర్ కు బిగ్ బాస్ ఎందుకంత ఎలివేషన్ ఇస్తున్నారు?

బాబా భాస్కర్ కు బిగ్ బాస్ ఎందుకంత ఎలివేషన్ ఇస్తున్నారు?
బాబా భాస్కర్ కు బిగ్ బాస్ ఎందుకంత ఎలివేషన్ ఇస్తున్నారు?

బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో.. అంటే ప్రేక్షకులు ఇచ్చే తీర్పుల మీదే షో నడవాలి. కానీ నిజంగా బిగ్ బాస్ లో ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగానే ఎలిమినేషన్స్ జరుగుతాయా అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి. షో కు మంచి టీఆర్పీలు రావడానికి నిర్వాహకులు పెద్ద ఉపయోగం లేని కాండిడేట్స్ ను ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. షో కు గ్లామర్ తీసుకొచ్చి టీఆర్పీ కోసం ఉపయోగపడే వారిని షో లో ఉంచడానికి ప్రయత్నిస్తారు. కాండిడేట్స్ ను తీసుకునేటప్పుడే ఎవరెప్పుడు ఎలిమినేట్ అయితే బాగుంటుందోనని ఒక లిస్ట్ వేసుకుంటారని సమాచారం. ఆ ప్రకారంగా బాబా భాస్కర్ ను మిడ్ సీజన్ లో ఎప్పుడైనా సమయం చూసి ఎలిమినేట్ చేద్దామని ప్లాన్ వేశారు. బాబా భాస్కర్ కు కూడా షో కు ఆహ్వానించినప్పుడు మహా అయితే ఉంటే అంత వరకూ ఉండే ఛాన్స్ లు ఉన్నట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే బాబా భాస్కర్ కూడా మూడు వారాలకే బట్టలు తెచ్చుకుని షో కు వచ్చాడు. తను
ఇంత కాలం ఉంటానని తనే అనుకోలేదు. షో నిర్వాహకులు కూడా బాబా భాస్కర్ ను ఇంతకాలం ఉంచాల్సి వస్తుందని ఊహించలేదు.

షో మొదలైనప్పటినుండే బాబా భాస్కర్ తనదైన శైలి ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడం మొదలుపెట్టాడు. కామెడీ టైమింగ్ అదరగొడుతూ, పెద్దగా వివాదాల జోలికి వెళ్ళడానికి బాబా భాస్కర్ టాప్ కాండిడేట్ అయిపోయాడు. దీంతో బిగ్ బాస్ యాజమాన్యం వెంటనే అలెర్ట్ అయింది. తన మీద నెగటివిటీ తీసుకొచ్చేందుకు బాగా ప్రయత్నించింది. బాబా భాస్కర్ మీద పెద్దగా కంప్లైంట్స్ లేకపోయినా కానీ కావాలని తను మాస్క్ వేసుకుని ఆడుతున్నాడు అని, బాబా భాస్కర్ కాదు బాబా మాస్కర్ అంటూ బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున చేతే చెప్పించింది. ఆ సమయంలో చూపించిన వీడియోలు కూడా అంత బలంగా లేవు. బాబా భాస్కర్ కన్నా ఎక్కువ సమస్యలు తీసుకొచ్చిన కంటెస్టెంట్స్ ను వదిలేసి తననే టార్గెట్ చేయడం నిజంగానే అతని మీద ప్రభావం చూపించింది. అప్పటిదాకా యమ జోష్ తో ముందుకు సాగిపోయిన భాస్కర్ బాగా డల్ అయిపోయాడు. ఈ సమయంలోనే రాహుల్ బాగా పుంజుకున్నాడు. బాబా డల్ అయితే అయ్యాడు కానీ అతణ్ణి ఎలిమినేట్ చేయడం బిగ్ బాస్ వల్ల కాలేదు.

అసలే ఎంటర్టైన్మెంట్ కరువైన ఈ బిగ్ బాస్ సీజన్ లో బాబా భాస్కర్ కూడా లేకపోతే ఇక షో చూడటం అనవసరం అన్న రేంజ్ లో ప్రేక్షకుల్లో భావన ఏర్పడింది. అందుకే ఫినాలే వీక్ కు ముందు జరిగిన నామినేషన్స్ లో కూడా ఫస్ట్ బాబానే సేవ్ అయ్యాడు. ఇక లాస్ట్ వీక్ కు రావడంతో బిగ్ బాస్ నిర్వాహకుల వైఖరి కూడా మారింది. బాబా భాస్కర్ ను కార్నర్ చేయడం మానేసి ఎలివేట్ చేయడం మొదలుపెట్టారు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో సూపర్ స్టార్ ఆఫ్ ది సీజన్ అంటూ బాబా భాస్కర్ కూడా కట్ చేసిన ఏవీ.. మిగతావారికంటే సూపర్ గా ఉంది. మంచి మంచి ఎలివేషన్స్ ఇస్తూ బాబా భాస్కర్ కు మంచి హైప్ తీసుకొచ్చారు. తన వల్ల టీఆర్పీలు ప్రభావితం అవుతుండడం వల్లే ఇలా చేసారని అర్ధమైపోతుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం బాబా భాస్కర్ టాప్ 3 కి చేరుకోవడం దాదాపు ఖరారైనట్లే.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2WDnEpb

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...