Skip to main content

సిద్ధం మనోహర్.. ‘మహానటి’ టు ‘జాతి రత్నాలు’

సిద్ధం మనోహర్.. 'మహానటి' టు 'జాతి రత్నాలు'
సిద్ధం మనోహర్.. ‘మహానటి’ టు ‘జాతి రత్నాలు’

ఎవరికైనా హార్డ్ వర్క్, డిసిప్లిన్, టాలెంట్ ఉంటే లక్ అనేది మనల్ని ఫాలో అవుతూ వస్తుందని నిరూపించాడు సిద్ధం మనోహర్. ప్రస్తుతం ఈ పేరు వింటే ఎవరు అనే సందేహం వచ్చినా త్వరలో అందరూ గుర్తించుకునే పేరు అవుతుందని నమ్మకంగా ఉన్నాడు మనోహర్. నేషనల్ అవార్డు విన్నింగ్ చిత్రం ‘మహానటి‘కి అసిస్టెంట్ కెమరామెన్ గా చేసాడు సిద్ధం మనోహర్. మహానటికి కెమరామెన్ గా డాని సాంచెజ్ – లోపెజ్ పనిచేసారు. తనకి అసిస్టెంట్ గా పనిచేసిన సిద్ధం మనోహర్ పనితనానికి ముగ్దుడైన మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ మనోహర్ కు అద్భుతమైన అవకాశమిచ్చాడు.

ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి వంటి సినిమాలతో దర్శకుడిగా మెప్పించిన నాగ్ అశ్విన్, నిర్మాతగా మారి చేస్తున్న తొలి ప్రయత్నం జాతి రత్నాలు. మహానటి వంటి చిత్రాన్ని అందించిన స్వప్న సినిమాస్ బ్యానర్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తుండడం విశేషం. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో తెలుగు వారికి దగ్గరైన నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ దాదాపు 75 శాతం పూర్తయినట్లు, నవంబర్ లో చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలున్నాయని మూవీ యూనిట్ తెలిపింది.

నిన్ననే ఈ చిత్ర మోషన్ పోస్టర్ కూడా విడుదలైంది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముగ్గురూ ఖైదీ బట్టలో ఉండగా ముగ్గురికీ వరసగా చొక్కాపై 420, 210, 840 నంబర్లు ఉన్నాయి. పిట్టగోడ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనుదీప్ కెవి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని “ఫన్నీయస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్”గా ప్రమోట్ చేస్తున్నారు. రధన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

మరి నేషనల్ అవార్డు గెలుచుకున్న దర్శకుడి నిర్మాణంలో, స్వప్న సినిమాస్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ లో టాలెంటెడ్ నటులతో తెరకెక్కుతున్న జాతి రత్నాలు వంటి చిత్రంతో ‘డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ’గా తన మొదటి అడుగును వేయబోతున్న సిద్ధం మనోహర్ కు ఇది సువర్ణకాశమనే చెప్పాలి. తన టాలెంట్, నిబద్ధత, క్రమశిక్షణతో పిన్న వయసులోనే పెద్ద అవకాశాన్ని పొందిన సిద్ధం మనోహర్, తన కెమెరా కంటితో ఎలాంటి మాయ చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ చిత్రంలో హీరోగా చేస్తున్న నవీన్ పోలిశెట్టి వరస సక్సెస్ లతో మంచి ఊపుమీదున్నాడు. తెలుగులో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో హిట్ కొట్టగా, హిందీలో చేసిన చిచ్చోరే కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు జాతి రత్నాలతో తన సక్సెస్ ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు నవీన్. మరోవైపు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి చేసిన బ్రోచేవారెవరురా చిత్రం సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ సినిమాలో వీరు ఎంత కామెడీ చేస్తారన్నది కూడా ఆసక్తికరం. వీరికి సాయం మురళి శర్మ, నరేష్, తనికెళ్ళ భరణి వెన్నెల కిషోర్ వంటి టాలెంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. చూద్దాం మరి ఈ జాతిరత్నాలు ఎంతటి నాణ్యత కలిగినవారో!



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2WdrZPn

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...