యంగ్ హీరో నిఖిల్ హ్యాపీ డేస్ తో ఇండస్ట్రీకి పరిచయమై కెరీర్ ఆరంభంలోనే కొన్ని హిట్లు చూసాడు. అయితే కథల ఎంపికలో చేసిన పొరబాట్ల కారణంగా వరస ప్లాపులను చవిచూడాల్సి వచ్చింది. ఇక నిఖిల్ కెరీర్ ముగిసిందన్న సమయంలో వచ్చిన స్వామి రారా, నిఖిల్ కెరీర్ కు పునరుత్తేజం తీసుకొచ్చింది. ఇక అక్కడి నుండి నిఖిల్ కథల ఎంపికలో జాగ్రత్తగా ఉంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే కార్తికేయ, సూర్య vs సూర్య వంటి విభిన్న చిత్రాలను చేసాడు. కానీ రీసెంట్ గా నిఖిల్ కెరీర్ మళ్ళీ డోలాయమానంలో పడింది. నమ్మి చేసిన సినిమాలు కూడా బోల్తా కొట్టడంతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి.
ఈ క్రమంలో నిఖిల్ నటించిన ముద్ర సినిమా కొన్ని కారణాల వల్ల పేరు మార్చుకుని అర్జున్ సురవరంగా రిలీజ్ సిద్ధమైంది. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ ఏడాదిగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఎన్ని సార్లు వాయిదా పడిందన్నది లెక్క కూడా లేదు. ఎప్పుడో ఈ చిత్ర టీజర్ ను కూడా విడుదల చేసేసారు. నిఖిల్ ఈ చిత్రం మీద ఆశలు కూడా వదులుకున్నట్లు కనిపించింది. గత రెండు నెలలుగా అయితే అర్జున్ సురవరం ఏమైందోనన్న వార్త కూడా బయటకు రాలేదు. దీంతో ఈ సినిమా అటకెక్కినట్లే అని అనుకున్నారంతా. కానీ ఇప్పుడు దీపావళి సందర్భంగా అర్జున్ సురవరం విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు.
ఈ చిత్రం నవంబర్ 29న విడుదలవుతుందని అన్నారు. ఈసారి కచ్చితంగా విడుదలవుతుందని నమ్మకంగా చెబుతున్నారు. ఫేక్ సర్టిఫికెట్ల కారణంగా బాధితుడిగా మారిన యువకుడు.. ఈ క్రమంలో ఆ మాఫియాకు ఎలా ఎదురునిలిచాడన్న కథాంశంతో అర్జున్ సురవరం తెరకెక్కింది. ఇందులో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తాడు. లావణ్య త్రిపాఠి ఇందులో హీరోయిన్. ఆద్యంతం ఉత్కంఠ రేపుతూ సాగేలా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే ట్రైలర్ విడుదల చేసి ప్రమోషన్స్ షురూ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.
అన్నట్లు అర్జున్ సురవరం, తమిళంలో సూపర్ హిట్ అయిన గణిదన్ అనే చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది. గద్దలకొండ గణేష్ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించిన అథర్వ గణిదన్ లో హీరోగా నటించాడు. క్యాథెరిన్ ఇందులో హీరోయిన్. ఒరిజినల్ సినిమాను కూడా టిఎన్ సంతోషే తెరకెక్కించాడు. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉన్న సినిమా కావడంతో విడుదల ఆలస్యమైనా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు అర్జున్ సురవరం నిర్మాతలు.
మరోవైపు నిఖిల్ ఈ చిత్రం తర్వాత కార్తికేయకు సీక్వెల్ కు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తై, ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. షూటింగ్ కూడా త్వరలోనే మొదలవుతుంది. సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ కావడంతో స్క్రిప్ట్ పక్కాగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకుడు.
మరి అర్జున్ సురవరం చెప్పిన తేదికి ఈసారైనా విడుదలవుతుందా లేక మరోసారి వాయిదా పడి అందరినీ నిరాశకు గురిచేస్తుందా అన్నది చూడాలి
Oka Mahanaubhavudu cheppadu,
KONNI SARLU RAVADAM LATE AVVACHEMO KAANI… RAAVADAM MAATRAM PAKKA
This Diwali it’s time for the Movie to tear the shreds of darkness and come into the Light…
Spread the word my dear friends #ArjunSuravaram on Nov 29th 2019year for clarity
pic.twitter.com/Y582BVNB5m
— Nikhil Siddhartha (@actor_Nikhil) October 27, 2019
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2BIBxIX

year for clarity
Comments
Post a Comment