Skip to main content

అదేంటి.. మహేష్ ను వెయిటింగ్ లో పెడుతున్నారు

అదేంటి.. మహేష్ ను వెయిటింగ్ లో పెడుతున్నారు
అదేంటి.. మహేష్ ను వెయిటింగ్ లో పెడుతున్నారు

సూపర్ స్టార్ మహేష్ బాబు గత నాలుగైదు చిత్రాల నుండి వరసగా సినిమాలు చేస్తున్నాడు. షూటింగ్ ల మధ్యలో బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ ట్రిప్స్ వేస్తున్నాడు కానీ సినిమా పూర్తైన కొన్ని రోజులకే మరొకటి మొదలుపెట్టేస్తున్నాడు. అయితే ఈసారి నాలుగైదు నెలలు బ్రేక్ తీసుకుందామని మహేష్ నిర్ణయించుకున్నాడట. మహేష్ బాబు 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు చిత్ర షూటింగ్ తుదిదశకు చేరుకుంది. మరొక షెడ్యూల్ కంప్లీట్ చేస్తే షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. నవంబర్ కల్లా చిత్ర షూటింగ్ ను పూర్తి చేయాలని టీమ్ ప్లాన్ చేసింది.

సో నవంబర్ తర్వాత నుండి మహేష్ బాబు ఫ్రీ అవ్వనున్నాడు. అయినా కానీ మహేష్ తన తదుపరి సినిమా విషయంలో తొందరపడట్లేదు. నాలుగైదు నెలలు షూటింగ్ కు బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఎందుకంటే తనకు కథలు వినిపించిన దర్శకులు ఎవరూ ప్రస్తుతం ఫ్రీ గా లేరు. ఇప్పుడు కొత్త కథ విన్నా కానీ దాన్ని డెవలప్ చేయడానికి కొన్ని నెలల సమయం కావాలి. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో మహేష్ విరామం తీసుకుంటున్నాడు.

మహేష్ కు కథలు వినిపించిన వాళ్లలో సందీప్ రెడ్డి, ప్రశాంత్ నీల్ ఉన్నారు. సందీప్ రెడ్డి బాలీవుడ్ లో క్రైమ్ థ్రిల్లర్ చేయడానికి రెడీ అవుతుండగా, ప్రశాంత్ నీల్ ఇంకా కేజిఎఫ్ నుండి బయటకు రావడానికి 6 నెలల సమయం పడుతుంది. వంశీ పైడిపల్లి చెప్పిన కథ మహేష్ కు నచ్చింది కానీ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయడానికి నాలుగు నెలలైనా కావాలి అంటున్నాడు. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు చిత్రం షూటింగ్ చేస్తున్న అనిల్ రావిపూడి కూడా మహేష్ కు ఒక లైన్ చెప్పాడు కానీ సరిలేరు నీకెవ్వరు విడుదలయ్యాక కానీ కొత్త స్క్రిప్ట్ మీద కూర్చోలేడు అనిల్. ఇలా అందరూ బిజీగా ఉండడంతో మహేష్ కు గ్యాప్ తీసుకోక తప్పడంలేదు. ఇన్నాళ్లూ ఒక సినిమా పూర్తయ్యేలోపే మరో సినిమా ప్రకటించిన మహేష్, ఈసారి బ్రేక్ తీసుకుని ఎలాంటి కథతో వస్తాడో, ఎవరి దర్శకత్వంలో కథ చేయనున్నాడో అన్నది ఆసక్తికరంగా మారింది.

సరిలేరు నీకెవ్వరు చిత్రంపై మహేష్ చాలానే ఆశలు పెట్టుకున్నాడు. దూకుడు తర్వాత పూర్తి స్థాయిలో కామెడీ చేస్తున్న చిత్రం కావడంతో మహేష్ ఈ చిత్రం గురి తప్పదని భావిస్తున్నాడు. ఈ మధ్య అతి మంచోడి పాత్రలు ఎక్కువగా చేసి ఫ్యాన్స్ కు కూడా బోర్ తెప్పించేసిన మహేష్ ఈసారి పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా ద్వారా రానున్నాడు. సంక్రాంతికి విడుదల కానున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. తమన్నా ఒక ప్రత్యేక గీతంలో నర్తించనుంది. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుమారు రెండు దశాబ్దాల తర్వాత విజయశాంతి ఈ చిత్రం ద్వారా తిరిగి రీ ఎంట్రీ ఇవ్వనుంది. సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు థియేటర్లలో సందడి చేయనుంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2BCCy5a

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...