Skip to main content

ఆ హీరోయిన్ గురించి మాట్లాడవేంటి మహేషా!

ఆ హీరోయిన్ గురించి మాట్లాడవేంటి మహేషా!
ఆ హీరోయిన్ గురించి మాట్లాడవేంటి మహేషా!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు చేరుకున్న సంగతి తెల్సిందే. చిత్ర బృందం ఇక లాస్ట్ షెడ్యూల్ ఒకటే షూటింగ్ బ్యాలన్స్ ఉందని ఇదివరకే ప్రకటించారు. రెండు సాంగ్స్, కొంత టాకీ పార్ట్ మాత్రం ఇంకా షూట్ చేయాల్సి ఉంది. సరిలేరు నీకెవ్వరు విషయంలో కాస్ట్ అండ్ క్రూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించడం ఖాయం, ఏ రేంజ్ హిట్ అన్నది మీరే చూసుకోండి అన్న రేంజ్ లో కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తున్నారు.

సినిమా గురించి సోషల్ మీడియాలో స్పందించాల్సి వచ్చినప్పుడు నవ్వుకుని నవ్వుకుని కడుపు చక్కలు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి అని చెప్తున్నారు. మహేష్ కూడా సరిలేరు నీకెవ్వరు తనకు చాలా స్పెషల్ చిత్రం అని అంటున్నాడు. ఇంతలా సినిమాలో ఏముందో అని సాధారణ ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. సరే అది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా అన్నది చిత్రం విడుదలయ్యేదాకా చెప్పలేం. సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికి జనవరి 12న విడుదల కానున్న సంగతి తెల్సిందే.

ఇదిలా ఉంటే ప్రమోషన్స్ విషయంలో సరిలేరు నీకెవ్వరు ఎక్కడా కంగారు పడట్లేదు. మరోవైపు అల వైకుంఠపురములో ప్రమోషన్స్ విషయంలో అగ్రెసివ్ గా వెళుతున్నా కానీ మహేష్ అండ్ కో మాత్రం నిదానంగా వెళుతున్నారు. ఇప్పటినుండే ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం లేదని, డిసెంబర్ నుండి మొదలుపెట్టి 40 రోజుల పాటు వరసగా ఏదొక ప్రమోషనల్ మెటీరియల్ వదలొచ్చని భావిస్తున్నారు. అందుకే అల వైకుంఠపురములో చిత్రంలో రెండు సాంగ్స్ విడుదలైనా కానీ సరిలేరు నీకెవ్వరు మాత్రం పోస్టర్స్ తో సరిపెడుతున్నారు.

దీపావళి సందర్భంగా ఈరోజు సరిలేరు నీకెవ్వరు నుండి రెండు పోస్టర్స్ వదిలారు. ఒకటి లేడీ అమితాబ్ గా పేరొందిన విజయశాంతి లుక్. 13 ఏళ్ల తర్వాత ముఖానికి రంగు వేసుకున్నారు విజయశాంతి. ఈ చిత్రంలో ఈమె చాలా స్పెషల్ రోల్ చేసినట్లు చెబుతున్నారు. కూర్చీలో చాలా హుందాగా కూర్చున్న ఆమె లుక్ కు మంచి స్పందన వచ్చింది. ఇంకో పోస్టర్ సాయంత్రం వదిలారు. అది సూపర్ స్టార్ మహేష్ ది. బండిపై కాజువల్ గా వస్తున్న మహేష్ పిక్ టెరిఫిక్ గా ఉంది. పోస్టర్ లో వెనకాల ప్రకాష్ రాజ్ కూడా కనిపిస్తాడు. ఇందులో ప్రకాష్ రాజ్ రాజకీయ నాయకుడిగా నటిస్తున్న విషయం తెల్సిందే.

అయితే ఇన్ని పోస్టర్స్ వదులుతున్నా ఇందులో హీరోయిన్ గా నటించిన రష్మిక లుక్ మాత్రం ఇప్పటివరకూ రివీల్ చేయలేదు. మహేష్ వి ఇప్పటికి నాలుగు పోస్టర్స్ వదలగా, విజయశాంతి పోస్టర్ ఒకటి వదిలారు. హీరోయిన్ లుక్ ను ఎందుకు దాస్తున్నారన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పుడు దీపావళి కూడా అవుతుండడంతో నవంబర్ లో పండగలు ఏం లేవు. ఇక సరిలేరు నీకెవ్వరు నుండి నెక్స్ట్ పోస్టర్ ఏదైనా కానీ డిసెంబర్ లోనే రివీల్ చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో రెగ్యులర్ ప్రమోషన్స్ తో పాటే రష్మిక మందన్న లుక్ ను రివీల్ చేసే అవకాశముంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/32RblaT

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...