Skip to main content

ఇంతకీ అలాంటి క్యారెక్టర్ కు బాలయ్య సూట్ అవుతాడా?

Balakrishna
Balakrishna

నందమూరి బాలకృష్ణ కెరీర్ పోషించని పాత్రంటూ లేదని చెప్పవచ్చు. పోలీస్, ఫ్యాక్షనిస్ట్, రాజులు, డాక్టర్.. ఇలా అన్ని వేరియేషన్స్ ఉన్న పాత్రలలో బాలయ్య నటించేసాడు. నటన పరంగా బాలయ్యకు వంక పెట్టడానికంటూ ఏం ఉండదు. కాకపోతే ఒక్కోసారి ఆయన లుక్స్, మేకప్ విషయంలోనే ప్రేక్షకుల నుండి కంప్లైంట్స్ వస్తాయి. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తన 105వ చిత్రంలో నటిస్తున్న సంగతి తెల్సిందే. తనతో జైసింహా తీసిన కెఎస్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. దీనికి రూలర్ అని టైటిల్ పెట్టినట్లు దీపావళి సందర్భంగా వెల్లడించారు. ఆ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో బాలయ్య పోలీస్ లుక్ లో దర్శనమిచ్చాడు. పాకెట్ లో గన్ ఉన్నా కానీ చేత్తో ఆయుధాన్ని పట్టుకుని సీరియస్ గా చూస్తున్న బాలయ్య లుక్ ను వదిలారు. ఇది మాస్ కోసమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫైట్స్, డ్యాన్స్ లు అంటే బాలయ్య ఊపు మాములుగా ఉండదు.

అయితే ఇప్పుడు డిస్కషన్ బాలయ్య పోలీస్ గా చేసిన పాత్ర గురించి కాదు. రూలర్ లో బాలయ్య రెండు గెటప్స్ లో కనిపించబోతున్నాడు. అంటే డ్యూయల్ రోల్ అన్నమాట. డ్యూయల్ రోల్స్ బాలయ్యకు కొత్తేమి కాదు. ఇప్పటికే పదుల సంఖ్యలో డ్యూయల్ రోల్స్ సినిమాలు చేసేసాడు బాలకృష్ణ. పోలీస్ కాకుండా రూలర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కూడా కనిపించబోతున్నాడు బాలకృష్ణ. దసరాకు విడుదల చేసిన పోస్టర్ లో బాలకృష్ణ సాఫ్ట్ వేర్ లుక్ ను రివీల్ చేసారు.

ఐరన్ మ్యాన్ గెడ్డంతో సూటు బూటు వేసుకున్న బాలయ్య గెటప్ స్టైలిష్ గా ఉందనే చెప్పాలి. అయితే లుక్ విషయం పక్కనపెడితే సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా బాలయ్య మెప్పించగలడా అన్నది ఇప్పుడున్న సందేహం. సాధారణంగా ఇప్పటివరకూ తెలుగు సినిమాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి అంటే 25-35 ఏళ్ల మధ్య వయసున్న వారినే చూపించారు. మరి 60కి దగ్గరపడుతోన్న బాలకృష్ణ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా సరిపోతాడా అన్నది చిత్ర యూనిట్ ముందున్న ప్రశ్న.

అసలు ఈ రోల్ ను ఎలా చూపించారన్న దానిపై ఇది ఆధారపడుతుంది అని చెప్పవచ్చు. మరి బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ గెటప్ ను ప్రేక్షకులు ఎంతవరకూ ఆదరిస్తారు అన్నది కీలకం. రూలర్ ను డిసెంబర్ 20న క్రిస్మస్ సెలవుల సందర్భంగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సి కళ్యాణ్ నిర్మిస్తున్నాడు. సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో భూమిక కీలక పాత్ర పోషించింది.

బాలయ్యతో గౌతమీపుత్ర శాతకర్ణి, జైసింహ వంటి సినిమాలకు పనిచేసిన సంగీత దర్శకుడు చిరంతన్ భట్ ఈ రూలర్ కు కూడా సంగీతం అందిస్తున్నాడు. నవంబర్ లోనే షూటింగ్ ను పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వెంటనే మొదలుపెట్టాలని చిత్ర బృందం భావిస్తోంది. అన్ని రకాల ఎమోషన్స్ ను మిళితం చేసిన కథ కావడంతో ఈ సినిమాతో బాలయ్య బౌన్స్ బ్యాక్ అవుతాడని ఆశిస్తున్నారు నందమూరి అభిమానులు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2NpgIHJ

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...