Skip to main content

ఎన్టీఆర్ హీరోయిన్.. నిర్మాతలను వేధిస్తోందా?

ఎన్టీఆర్ హీరోయిన్.. నిర్మాతలను వేధిస్తోందా?
ఎన్టీఆర్ హీరోయిన్.. నిర్మాతలను వేధిస్తోందా?

తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వట్లేదు అంటారు.. ఇచ్చిన వాటిని సరిగ్గా ఉపయోగించుకోరు. చేజేతులా పోగొట్టుకుంటారు. ఈ మధ్య కాలంలో తెలుగు హీరోయిన్స్ కు పెద్దగా అవకాశాలు ఇవ్వట్లేదు. టాలెంట్ పుష్కలంగా ఉండి, గ్లామర్ గా కూడా ఉండగల హీరోయిన్స్ మనకు ఉన్నా కానీ బాంబే నుండి కానీ వేరే రాష్ట్రాల నుండి హీరోయిన్స్ ను దిగుమతి చేసుకోవడం ఎందుకని, తెలుగు వాళ్లకు అవకాశాలివ్వమని చాలా మంది సోషల్ మీడియాలో స్పందించారు. ఈ విషయంలో ఈ మధ్య కొంచెం పేరు తెచ్చుకుంటోన్న ఈషా రెబ్బాను ఉదాహరణగా చూపుతూ ఈమెకు ఎందుకు పెద్దగా అవకాశాలివ్వట్లేదు అని కూడా ప్రశ్నించారు. అయితే ఇచ్చిన అవకాశాలను ఆమె సద్వినియోగం చేసుకోవట్లేదన్న అభియోగం ఆమెపై ఇప్పుడు పడింది. ఒక చిన్న నిర్మాతకు ఆమె చుక్కలు చూపిస్తోందిట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో కూడా ఇదే డిస్కషన్స్.

అసలు విషయంలోకి వెళితే.. అభినయంతో పాటు అందంగా కూడా ఉండే ఈషా రెబ్బా మొదట చాలా పద్దతిగా కనిపించినా ఈ మధ్య గ్లామర్ షూట్స్ అంటూ రెచ్చిపోతోంది. తరచుగా ఆమె సోషల్ మీడియా అకౌంట్ లో తన గ్లామరస్ పిక్స్ ను అప్లోడ్ చేస్తూ తాను ఎలాంటి పాత్రకైనా రెడీనే అన్న తరహాలో సంకేతాలిస్తోంది. ఇది పక్కన పెడితే చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలు చేసే ఈషా రెబ్బాకు ఎన్టీఆర్ సరసన అరవింద సమేతలో ఆఫర్ రాగానే ఆమె దశ తిరిగిందనుకున్నారంతా. పెనివిటి వంటి సూపర్ హిట్ సాంగ్ లో కూడా ఆమె ఉండడంతో గుర్తింపు బానే వస్తుందని ఆశించారు. అయితే ఈషాకు వచ్చిన గుర్తింపు ఈ సినిమాతో దాదాపు సున్నా. ఈమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోవడంతో అరవింద సమేత తర్వాత ఆమె దశ తిరిగిపోతుందని భావిస్తే అది కల్లే అయింది.

ఇక ప్రస్తుతం ఈషా రెబ్బా, టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా తెరకెక్కుతున్న రాగల 24 గంటల్లో అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్ర షూటింగ్ పూర్తై విడుదలకు ముస్తాబవుతోంది. అయితే అరవింద సమేత వంటి భారీ సినిమాలో చేయడంవల్లనో ఏమో అమ్మడు చిన్న హీరోయిన్ ను కాదనే తరహాలో ప్రవర్తిస్తోందిట. ఇటీవలే చిత్ర ఆడియో వేడుకలో కూడా ఎన్టీఆర్ నామస్మరణ చేయడం మనం చూసాం. అయితే రాగల 24 గంటల్లో చిత్ర ప్రమోషన్స్ కు ఈమె పెద్దగా సహకరించడం లేదట. సినిమాకు హెల్ప్ అవుతుందని ఒక ప్రమోషనల్ వీడియో షూట్ చేయడానికి నిర్మాత ప్లాన్ చేసాడట. అయితే ఈషా వైపు నుండి కనీస స్పందన లేదట. ఫోన్ కాల్స్ కూడా ఎత్తట్లేదని అంటున్నారు. హీరోయిన్ అవకాశాలు కావాలంటూ చిన్న చిత్రాల పట్ల ఇలా వ్యవహరించడం ఏంటని ఆ నిర్మాత ఇప్పుడు ఫీలవుతున్నాడు. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఆమె సినిమా గురించి స్పందిస్తే ఉపయోగం ఉంటుందని అనుకుంటే ఆమె ఇలా చేయడం నిర్మాత జీర్ణించుకోలేకపోతున్నాడట. మరి ఇది నిజంగానే జరిగిందా లేక ఊరికే పుకార్లు పుట్టించారా అన్నది తెలియదు కానీ నిజమైతే మాత్రం ఈషా కెరీర్ ను స్వంతంగా నాశనం చేసుకున్నట్లే.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2BSW9hB

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...