Skip to main content

విజయశాంతి, మహేష్ బాబు సెట్స్ లో ఒకరిని ఒకరు ఏమని పిలుచుకుంటారు?

విజయశాంతి, మహేష్ బాబు సెట్స్ లో ఒకరిని ఒకరు ఏమని పిలుచుకుంటారు?
విజయశాంతి, మహేష్ బాబు సెట్స్ లో ఒకరిని ఒకరు ఏమని పిలుచుకుంటారు?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు చిత్రంలో విజయశాంతి ప్రముఖ పాత్ర పోషిస్తున్న సంగతి తెల్సిందే. దాదాపు 13 ఏళ్ల తర్వాత తెలుగు సినిమాల్లో తిరిగి నటిస్తోంది విజయశాంతి. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ప్రొఫెసర్ భారతి పాత్ర చాలా మంచిదని, తనకు పెర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని తెలిశాకే ఒప్పుకున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది విజయశాంతి. ఇంకా ఆమె చిత్ర విశేషాలు హీరో మహేష్ బాబు గురించి ఆసక్తికర విశేషాలను పంచుకుంది. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా రాజకీయాలే తన తొలి ప్రాధాన్యం అని చెప్పుకొచ్చింది విజయశాంతి. మహేష్ బాబు, విజయశాంతి కలిసి పాతికేళ్ల క్రితం నటించారు. అప్పుడు మహేష్ బాబు చైల్డ్ హీరో కాగా, విజయశాంతి టాప్ హీరోయిన్. పాతికేళ్ల తర్వాత మహేష్ బాబు టాప్ హీరో అయ్యాడు, సూపర్ స్టార్ గా ఎదిగాడు. విజయశాంతి చాలా కాలం తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తిరిగి రీ ఎంట్రీ ఇస్తోంది.

మహేష్ బాబు ఇంత పెద్ద స్టార్ అవుతాడని అప్పట్లో అనుకున్నారా అన్న ప్రశ్నకు విజయశాంతి స్పందిస్తూ “బాబు హీరోగా చేసిన మొదటి సినిమా చూసి షాక్ అయ్యాను. ఎందుకంటే చిన్నప్పుడు షాక్ అయ్యాను. కానీ తొలి సినిమాకు పూర్తిగా మారిపోయాడు. తొలి సినిమా చూసాకే అనుకున్నా, బాబు పెద్ద స్టార్ అవుతాడని. గతంలో ఇంటర్వ్యూలలో కూడా ఇది చెప్పాను. క్రికెట్ లో సచిన్ ఎలా టాప్ క్రికెటరో, తెలుగు సినిమాలకు మహేష్ అలా అని చెప్పాను, అన్నట్లుగానే మహేష్ ఇప్పుడు సూపర్ స్టార్ అయ్యాడు” అని చెప్పింది. ఇక కృష్ణకు, మహేష్ కు ఉన్న తేడాలేంటి అని అడిగితే “కృష్ణ గారు చాలా మెత్తని స్వభావం కల వ్యక్తి. ఎదుటి వారి మనసును నొప్పించడం తెలీదు. మహేష్ అయితే పూర్తిగా డౌన్ టు ఎర్త్. తను అంత పెద్ద సూపర్ స్టార్ అని అతనికి గుర్తులేదు అనుకుంట. పెద్దలకు బాగా గౌరవ మర్యాదలు ఇస్తాడు. ఒక్కసారి కూడా తప్పుగా మాట్లాడడం నేను చూడలేదు. చాలా హంబుల్. సెట్ లో చాలా సరదాగా ఉంటూ అందరితోనూ కలిసిపోతుంటాడు” అని చెప్పింది విజయశాంతి.

ఇక సెట్ లో మహేష్, మీరు ఒకరినొకరు ఏమని పిలుచుకుంటారు అని అడుగగా నేను మహేష్ ను బాబు అని పిలుస్తాను. మొదటినుండి అదే అలవాటైంది. మహేష్ అని ఎందుకు పిలవనంటే హీరోకు గౌరవం ఇవ్వాలి. మహేష్ మాత్రం నన్ను అమ్మ, మేడం అని పిలుస్తాడు అని చెప్పింది.

సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలవుతోన్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో మహేష్, విజయశాంతికి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని చెప్పవచ్చు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2C36yYd

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...