Skip to main content

అల్లు అర్జున్ ఐకాన్ ను పక్కన పెట్టేసినట్టేనా?

Allu Arjun Icon
Allu Arjun Icon

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో నా పేరు సూర్య అనేది చాలా ఇంపార్టెంట్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఆ సినిమా హిట్ అవ్వలేదు కానీ అది హిట్ అవ్వకపోవడం వలన అల్లు అర్జున్ అంతర్మథనంలో పడ్డాడు. అసలు తనకి ఎలాంటి సినిమాలు నప్పుతాయి, ఎలాంటి చేయకూడదు అని అనలైజ్ చేసుకోవడంతోనే దాదాపు సంవత్సర కాలం గడిచిపోయింది. అయితే ఆ సంవత్సరం తర్వాత బన్నీ ఒకేసారి 3 సినిమాలను ప్రకటించాడు. మొదటిది త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా. ఈ సినిమా షూటింగ్ అంతా సెటప్ అయ్యాక మిగిలిన రెండు సినిమాల విశేషాలను మీడియాకు రిలీజ్ చేసాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేసే సినిమాకు అల వైకుంఠపురములో అని టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు. రెండో సినిమా సుకుమార్ తో కన్ఫర్మ్ అవ్వగా, మూడో సినిమా దిల్ రాజు కాంపౌండ్ లో దర్శకుడు వేణు శ్రీరామ్. మూడో సినిమాకు ఐకాన్ అన్న టైటిల్ ను కూడా కన్ఫర్మ్ చేసారు.

అల వైకుంఠపురములో షూటింగ్ శరవేగంగా సాగిపోతుండగా మిగిలిన ఇద్దరు దర్శకులు స్క్రిప్ట్ ను ఫైనల్ చేసే దశలో ఉన్నారు. సాధారణంగా ముందు స్టార్ డైరెక్టర్ కాబట్టి సుకుమార్ సినిమా మొదలవుతుందని అనుకుంటారు. కానీ అల్లు అర్జున్ ఎక్కువగా ఐకాన్ మీద ఇంట్రెస్ట్ చూపించేవాడు. బయటకు ఎక్కడికి వెళ్లినా కూడా ఐకాన్ ఉన్న టోపీలనే పెట్టుకుని తిరిగేవాడు. దీనివల్ల మీడియాలో ఏంటి అల్లు అర్జున్ కు ఈ కథ మీద ఇంత ఆసక్తి అన్న కథనాలు కూడా వచ్చేసాయి. మరోవైపు సుకుమార్ ను స్క్రిప్ట్ చేంజెస్ పేరుతో బాగా ఇబ్బంది పెడుతున్నాడని కూడా అన్నారు. సుకుమార్ రాసిన కథను పదే పదే మార్చమని చెబుతుండడంతో సుకుమార్ కూడా విసుగుకు లోనయ్యాడని కథనాలు ప్రచారమయ్యాయి.

కట్ చేస్తే ప్రస్తుతం అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్ర షూటింగ్ ను పూర్తి చేసే దశలో ఉన్నాడు. నవంబర్ కల్లా ఈ చిత్ర షూటింగ్ పూర్తవుతుంది. జనవరి నుండి బన్నీ నెక్స్ట్ సినిమా మొదలుపెట్టడానికి సిద్ధమని చెప్పేసాడు. మొదట ఐకాన్ మీద విపరీతమైన ఆసక్తి చూపిస్తూ వచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ ను పక్కనపెట్టేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. సుకుమార్ సినిమాను కూడా కాదని ఐకాన్ మీద అంత ప్రేమ పెంచుకున్న బన్నీకి సడెన్ గా ఏమైందంటే.. మొదట ఫస్ట్ నేరేషన్ అప్పుడు ఐకాన్ నచ్చిందట. అయితే రీసెంట్ గా ఫైనల్ నేరేషన్ ఇచ్చినప్పుడు సెకండ్ హాఫ్ మొత్తం ఫ్లాట్ గా ఉందని అల్లు అర్జున్ ఫీల్ అయ్యాడట. ఇక ఆ కథకు అంతకుమించి చేంజస్ ఏం చేసినా కూడా పెద్ద ప్రయోజనం ఉండదని బన్నీ భావించి ఇక దాన్ని పూర్తిగా పక్కనపెట్టేద్దామని డిసైడ్ అయ్యాడట. ఈ మేరకు దిల్ రాజుతో కూడా ప్రాధమికంగా చర్చించినట్లు సమాచారం. ఇక మరోవైపు సుకుమార్ సినిమాకు ఎట్టకేలకు పచ్చజెండా ఊపాడు బన్నీ. రేపే ఈ సినిమాకు ముహూర్తం.ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు రేపు తెలుస్తాయి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2NnJSHb

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...