Skip to main content

బాలయ్య మీద ట్రోలింగ్ మాములుగా నడవట్లేదుగా

Balakrishna Ruler Movie Poster
Balakrishna Ruler Movie Poster

నందమూరి బాలకృష్ణ.. ఒకప్పుడు టాప్ హీరో, ఒకానొక దశలో టాలీవుడ్ లో టాప్ ప్లేస్ కి చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చాడు. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ ఫ్యాన్స్ మధ్య వాదనలు యుద్ధాల రేంజ్ లో జరిగేవి. అయితే అదంతా గతం. బాలకృష్ణ ఇప్పుడు టాప్ హీరోకి అసలు రేసులో లేడు. హిట్ అయితే కలెక్షన్స్ బానే వస్తాయి కానీ ప్లాప్ అయితే మాత్రం ఆ సినిమా డిజాస్టర్లలో రికార్డు సృష్టించేలా ఉంటుంది. ఇవన్నీ పక్కనపెడితే బాలకృష్ణ మీద మీమ్స్ గత రెండేళ్లలో ఓ రేంజ్ లో నడుస్తుండడం అందరికీ తెలిసిన విషయమే.

బాలకృష్ణ ఏం చేసినా ట్రోల్ పేజీలు నడిపేవారికి పండగే. దాని మీద ఒక మీమ్ చేసుకుని బ్రతికేస్తారు. దానికి తగ్గట్లే బాలకృష్ణ కొన్ని సందర్భాల్లో ప్రవర్తించడం జరుగుతుంది. ఆ మధ్య వరసగా ఇద్దరు, ముగ్గురు అభిమానులను కొడుతూ కెమెరాలకు చిక్కిన బాలయ్యను ట్రోల్ పేజీలు ఓ రేంజ్ లో టార్గెట్ చేసాయి. బాలయ్య మీద మీమ్ వేస్తె రీచ్ ఎక్కువ ఉండడంతో ట్రోల్ పేజీలు మరింత రెచ్చిపోయాయి. గత కొన్నేళ్లుగా ఈ వ్యవహారం బాగా నడుస్తోంది.

ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రానికి రూలర్ అన్న టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు. దీపావళి సందర్భంగా నిన్న ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను, బాలయ్య లుక్ ను రివీల్ చేసారు. ఈ పోస్టర్ లో బాలకృష్ణ పోలీస్ యూనిఫామ్ లో ఆయుధాన్ని పట్టుకుని కనిపించాడు. నిజాయితీగా మాట్లాడుకుంటే ఇందులో బాలయ్య లుక్ కాస్త వెరైటీగా ఉండనే చెప్పాలి. హెయిర్ స్టైల్ బొత్తిగా సెట్ అవ్వలేదు. బాలయ్య నిలబడిన విధానం కూడా సాధారణంగా లేదు. ఇక ట్రోల్ పేజీలు పండగ చేసుకోవడం మొదలుపెట్టారు. నిన్న సాయంత్రం నుండి ట్రోల్ పేజీలపై నడిచిన మీమ్స్ హవా మాములుగా లేదు. పోస్టర్ మీమ్స్, వీడియో మీమ్స్ అంటూ ట్రోల్ పేజీలు రెచ్చిపోతున్నాయి. దీనికి భారీ సంఖ్యలో షేర్స్ కూడా వస్తున్నాయి.

ఇదనే కాదు ఇంతకు ముందు బాలకృష్ణ లుక్ లీకైనప్పుడు కూడా ట్రోల్స్ నడిచాయి. ఐరన్ మ్యాన్ లుక్ లో బాలకృష్ణ భలేగా కనిపించాడు ట్రోల్ పేజీలకు. దసరా కానుకగా విడుదల చేసిన బాలయ్య లుక్ పై కూడా ట్రోల్స్ నడిచాయి. ఇందులో బాలకృష్ణ రంగు రంగుల మధ్య కత్తి పట్టుకుని కనిపించాడు. ఈ లుక్ ను కూడా వదల్లేదు. ఈ రకంగా బాలయ్య ఏం చేసినా ట్రోల్స్ చేసుకుని బతికేవాళ్లకు బాలకృష్ణ ఆక్సిజన్ లా కనిపిస్తున్నాడు. మరి ఇది ఎప్పుడు ఆగుతుంది అన్నది ఎవరూ చెప్పలేరు.

ప్రస్తుతం బాలకృష్ణ చేస్తున్న రూలర్ చిత్రాన్ని కెఎస్ రవికుమార్ తెరకెక్కిస్తుండగా సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో భూమిక ఒక కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెల్సిందే. సి కళ్యాణ్ నిర్మాత. చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తున్నాడు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/36aWDh9

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...