తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ పేరుతోతో సౌత్ ఇండస్ట్రీలో అనేక కథలు రూపుదిద్దుకొంటున్నాయి. రమ్య కృష్ణ వెబ్ సిరీస్ చేస్తుండగా ఇతర స్టార్ యాక్టర్స్ బిగ్ స్క్రీన్ పై జయ జీవితాన్ని ధైర్యంగా చూపిస్తామని అంటున్నారు. ఆ లిస్ట్ లో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కూడా ఉంది. బాలీవుడ్ జయ బయోపిక్ లో ఆమె నటించనుంది. అయితే ఎవరు ఎలా తీసినా తమ సినిమాలో నిజాలే కనిపిస్తాయని అంటోంది నిత్యా మీనన్.
సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ డైరెక్షన్ లో జయలలిత బయోపిక్ తెరకెక్కుతోంది. నిత్య మీనన్ జయలలిత పాత్రలో కనిపించనుంది. రాజకీయాల నుంచి ఆమె మరణం వరకు సినిమా స్క్రీన్ ప్లే ఉంటుందట. అయితే ఇటీవల సినిమాకు సంబంధించిన కొన్ని రూమర్స్ వైరల్ అవుతుండగా నిత్యా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ప్రాజెక్ట్ ఆగింది అనే కామెంట్స్ కి కూడా ఆమె వివరణ ఇచ్చారు. ప్రాజెక్ట్ ని డిసెంబర్ లో మొదలుపెట్టనున్నట్లు చెబుతూ సినిమాలో ఎలాంటి కల్పిత సన్నివేశాలకు తావివ్వలేదని తెలిపింది.
అలాగే సినిమాలో నిజాలు కనిపిస్తాయని జయలలిత జీవితంలో కీలకమైన ఘట్టలు సినిమాలో హైలెట్ గా ఉంటాయని అన్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు చెప్పిన నిత్యా మీనన్ రూమర్స్ లోఎలాంటి నిజం లేదని, త్వరలో సినిమాను మొదలుపెట్టనున్నట్లు సమాధానం ఇచ్చారు. ఇక మరోవైపు రమ్యకృష్ణ నటిస్తున్న జయలలిత వెబ్ సిరీస్ బయోపిక్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే ఆ కథ ప్రేక్షకుల ముందుకు రానుంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2MYEzPt
Comments
Post a Comment