Skip to main content

“సామజవరగమన”ను మించి “రాములో రాముల”.. సౌత్ ఇండియాలోనే టాప్

"సామజవరగమన"ను మించి "రాములో రాముల".. సౌత్ ఇండియాలోనే టాప్
“సామజవరగమన”ను మించి “రాములో రాముల”.. సౌత్ ఇండియాలోనే టాప్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “అల వైకుంఠపురములో”. ఈ చిత్ర షూటింగ్ ఒక వైపు శరవేగంగా సాగుతుండగా మరోవైపు ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో సాగుతున్నాయి. చిత్రాన్ని జనాల్లో ఉంచాలని సినిమా రిలీజ్ కు నాలుగు నెలల ముందు నుండే ప్రమోషన్స్ ను దంచి కొడుతున్నారు. నెల క్రితమే తొలి పాట సామజవరగమన పాటను విడుదల చేయగా అది యూట్యూబ్ రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పటికే 56 మిలియన్ వ్యూస్ దాటి 100 మిలియన్ వ్యూస్ వైపు పరుగులు పెడుతోంది. లైక్స్ విషయంలో కూడా ఈ పాట పాత రికార్డులను తిరగరాస్తోంది. ఏ ఉద్దేశంతో అయితే ఇంత ముందర ఒక పాటను విడుదల చేసారో ఆ లక్ష్యాన్ని ఈ పాట అందుకుంది.

ఇక దీపావళి సందర్భంగా విడుదలైన రెండో పాట రాములో రాముల గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. తొలి పాట బ్లాక్ బస్టర్ హిట్ కాగా, తొలి పాటను మించి రెండో సాంగ్ యూట్యూబ్ లో రికార్డులను తిరగరాస్తోంది. సమజవరగమన తిరగరాసిన రికార్డులను దాటి ఈ పాట దూసుకుపోతోంది. విడుదలైన 24 గంటల్లో ఈ పాట దాదాపు 8.3 మిలియన్ వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలోనే ఫస్ట్ 24 గంటల్లో మోస్ట్ వ్యూడ్ సాంగ్ గా కొత్త రికార్డును సెట్ చేసింది. లైక్స్ పరంగా కూడా ఇప్పటికే 340K ను లైక్స్ వచ్చాయి. ఒక పాట అంత పెద్ద హిట్ అయ్యాక దాన్ని మించేలా మరో పాట ఉండటం నిజంగా విశేషమే. సామజవరగమన పూర్తిగా క్లాస్ సాంగ్ కాగా, రాములో రాముల పార్టీ సాంగ్. మాస్ టచ్ తో సాగే ఈ సాంగ్ ప్రేక్షకులకు తొలిసారి విన్న దగ్గరనుండే బాగా నచ్చేస్తోంది. అందుకే రిపీట్ లో ఈ పాటను తెగ వింటున్నారు. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ వాయిస్ లు కూడా ఈ పాటకు కనెక్ట్ అయ్యేలా చేస్తున్నాయి. ఇక కాసర్ల శ్యామ్ రాసిన క్యాచీ లిరిక్స్ పాటకు అసలైన ఆకర్షణగా మారాయి. మొత్తానికి ఈ రెండు పాటలు ఇంత పెద్ద హిట్ అవ్వడంతో అల వైకుంఠపురములో టీమ్ ఫుల్ ఖుషీగా ఉంది.

బయ్యర్లలో ఇప్పుడు ఈ చిత్రానికి ఫుల్ క్రేజ్ కనిపిస్తోంది. పైగా సినిమా మీద కూడా నమ్మకం ఏర్పడింది. దాంతో ఇప్పటినుండే బిజినెస్ ఆఫర్లు మొదలైపోయాయి. అయితే అల వైకుంఠపురములో టీమ్ ఎక్కడా హడావిడి లేకుండా డీల్ చేయాలనుకుంటోంది. సినిమా రిలీజ్ కు ఇంకా రెండున్నర నెలల సమయం ఉండడంతో డిసెంబర్ నుండి బిజినెస్ ను ఓపెన్ చేయాలని భావిస్తోంది. ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. సుశాంత్, నివేద పేతురాజ్, నవదీప్, సునీల్, హర్షవర్ధన్, మురళి శర్మ, సచిన్ కెద్కర్, జయరామ్ తదితరులు నటిస్తున్నారు. టబు ఈ చిత్రంతో చాలా ఏళ్ల తర్వాత తిరిగి తెలుగు సినిమాల్లో కనిపించబోతున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా అల్లు అరవింద్, చినబాబు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/36aVSVh

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...